jaya Krishna -Ajay Bhupathi: సినిమా ఇండస్ట్రీలో వారసుల పరంపర కొనసాగడం సర్వసాధారణం. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఘట్టమనేని వారసుడిగా మహేష్ బాబు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే మూడోతరం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడు, కృష్ణ మనవడు జయకృష్ణ (Jayakrishna)హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల అధికారక పోస్టర్ కూడా వెళ్లడైంది. ఆర్ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన అజయ్ భూపతి దర్శకత్వంలో ఘట్టమనేని వారసుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.
అజయ్ భూపతికి ఇది నాలుగవ సినిమా కావటం విశేషం. జయకృష్ణ హీరోగా, అజయ్ భూపతి (Ajay Bhupathi)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీ దత్ సమర్పణలో చందమామ కథలు పతాకంపై పి కిరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన వెలువడమే కాకుండా కాన్సెప్ట్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే చిత్తూరు నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందని తెలుస్తోంది. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంతో ఈ పోస్టర్ డిజైన్ చేశారు. ఇక ఈ సినిమా న్యూ ఏజ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.
ఇలా ఘట్టమనేని మూడోతరం వారసుడి సినిమాని అధికారకంగా ప్రకటించడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి మరొక అప్డేట్ వెల్లడించారు. ఈ సినిమాలో జయ కృష్ణకు జోడి ఎవరు నటించబోతున్నారునే విషయంపై ఎన్నో సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రముఖ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ (Raveena Tandon) కుమార్తె రాషా తడానీ(rasha thadani ) హీరోయిన్ గా నటించబోతున్నట్లు చిత్ర బృందం అధికారక పోస్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Make way for the Gorgeous & Talented #RashaThadani in to Telugu Cinema ❤️🔥
Stay tuned to witness her magnetic screen presence and performance in #AB4 ❤️
Starring 🌟#JayaKrishnaGhattamaneni
Presented by @AshwiniDuttCh
Produced by @gemini_kiran under @CKPicturesoffl… pic.twitter.com/g6NdzrmlIE— Ajay Bhupathi (@DirAjayBhupathi) November 17, 2025
రాషా తడానీ సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్నారు ఈమె తల్లి ప్రముఖ హీరోయిన్ కావటం విశేషం. ఇక తండ్రి అనిల్ తడానీ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రాషా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గత కొంతకాలంగా రాషా టాలీవుడ్ హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఎక్కడ అధికారక ప్రకటన మాత్రం వెల్లడించలేదు. ఇక తాజాగా ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో చిత్ర బంధం బిజీగా ఉన్నారు.
Also Read: Rajamouli: పైరసీ వల్ల మాకంటే ఎక్కువగా మీకే నష్టం..రాజమౌళి