E-Paper
Advertisement

Netflix: హాలీవుడ్‌ దిగ్గజం వార్నర్ బ్రదర్స్‌తో నెట్‌ఫ్లిక్స్ కీలక ఒప్పందం.. ఏకంగా రూ. 6.5 లక్ష కోట్ల డీల్!

Netflix: హాలీవుడ్‌ దిగ్గజం వార్నర్ బ్రదర్స్‌తో నెట్‌ఫ్లిక్స్ కీలక ఒప్పందం.. ఏకంగా రూ. 6.5 లక్ష కోట్ల డీల్!
Advertisement

Netflix to Buy Warner Bros.: ప్రపంచ దిగ్గజ స్ట్రీమింగ్‌ డిజిటల్‌ సంస్థగా నెట్‌ఫ్లిక్స్‌ గుర్తింపు పొందింది. వరల్డ్‌ వైడ్‌గా వినోదపరిశ్రమను ఏలుతున్న నెట్‌ఫ్లిక్స్‌ తాజాగా ఓ భారీ ఒప్పందం చేసుకుంది. హాలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో అతి పెద్ద సంస్థ అయిన వార్న్‌ర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ (Warner Bros Discovery – WBD)ని కోనుగోలు చేసేందుకు సిద్దమైంది. నిన్న శుక్రవారం (డిసెంబర్‌ 5) వార్నర్‌ బ్రదర్స్ డిస్కవరిని కొనుగోలు చేసినట్టు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా కొన్ని రోజులుగా వార్న్‌ర్‌ బ్రదర్స్‌ డిస్కవరి కోనుగోలుకు సంబంధించి ఒప్పందం జరుగుతున్నట్టు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

ఇకపై హ్యారీ పోటర్‌, డీసీ కామిక్స్‌ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం

ఈ ఒప్పందం కోసం నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ప్రపంచంలోని పలు దిగ్గజ సంస్థలు పోటీ పడ్డాయి. ఇందులో అత్యధిక ధరకు నెట్‌ఫ్లిక్స్‌ వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీని సొంతం చేసుకుంది. ఈ ఒప్పందంతో ప్రపంచంలోనే వినోద పరిశ్రమలోనే ఒక పెద్ద దిగ్గజంగా నెట్‌ఫ్లిక్స్‌ మారనుంది. ఇకపై వార్న్‌ర్‌ బ్రదర్స్‌ డిస్కవరీలో భాగంగా ఉన్న డీసీ కామిక్స్‌, గేమ్ ఆఫ్‌ థ్రోన్‌, ఫ్రెండ్స్‌, హ్యారీ పోటర్‌ వంటి ప్రాంచైజీలన్ని ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో భాగం అయ్యాయి. అంతేకాదు హెచ్‌బీఓ (HBO) నెట్‌వర్క్స్‌ కూడా నెట్‌ఫ్లిక్స్‌ యజమానిగా మారనుంది. ఈ ఒప్పందంతో ఒకప్పుడు ఒకప్పుడు కేవలం చలనచిత్ర స్టూడియో వార్నర్ బ్రదర్స్.. ఇప్పుడు ఒక పెద్ద మీడియా సంస్థగా మారనుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వినోదాన్ని అందించడంతో పాటు భారతదేశంలో కూడా ప్రుమఖ సంస్థగా మారనుంది.

Advertisement

Also Read: Pastor Joseph: విషాదం.. గుండెపోటుతో ‘పాతాళ భైరవి’ నటుడు మృతి

రూ. 6.48 లక్షల కోట్ల ఒప్పందం

ఇప్పటికే హైదరాబాద్లో ఈ సంస్థ ముఖ్యమైన టెక్నాలజీ హబ్‌గా ఉండటం విశేషం. ఈ ఒప్పందం విలువ 72 మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 6.48 లక్షల కోట్లు) ఉన్నట్టు తెలుస్తోంది. హాలీవుడ్‌ మీడియా ప్రకారం.. WBD ఒక్కొ షేరును 28 డాలర్లుగా చెల్లించినట్టు తెలుస్తోంది. దీంతో మొత్తంగా రూ. 6.48 లక్షల కోట్లు చెల్లించి నెట్‌ఫ్లిక్స్‌ WBDతో డీల్‌ చేసుకుంది. ఒకవేళ గురువారం వార్నర్‌ బ్రదర్స్‌ షేర్‌ ముగింపు ధర 24.5 డాలర్లతో పోల్చినా పారామౌంట్‌ నుంచి అంత ఆఫర్‌ వచ్చిన 24 డాలర్ల కన్నా ఇది ఎక్కువే. షేర్‌ ఫైనల్‌ ప్రైజ్‌ ప్రకారం.. వార్నర్‌ బ్రదర్స్‌ మార్కెట్‌ విలువ 61 బి. డాలర్లు (సుమారు రూ.5.49 లక్షల కోట్లు)గా ఉంది. ఇప్పటికే ట్రంప్‌ ప్రభుత్వంతో అనుబంధం ఉన్న పారామౌంట్‌ సంస్థ, ఈ వారం మొదట్లో విక్రయ ప్రక్రియను ప్రశ్నించింది. నెట్‌ఫ్లిక్స్‌కు సానుకూలంగా ఉందని ఆరోపించింది.

డీల్‌ కుదిరేనా?

Advertisement

ఈ నేపథ్యంలో అక్టోబరులో పారామౌంట్‌ చేసిన 60 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.5.40 లక్షల కోట్ల) బిడ్‌ను వార్నర్‌ బ్రదర్స్‌ బోర్డు తిరస్కరించడం దీనికి కారణం. ఒక వేళ నియంత్రణ సంస్థలు ఈ ఒప్పందాన్ని అడ్డుకుంటే బ్రేకప్‌ ఫీజు కింద 5 బిలియన్‌ డాలర్లను (సుమారు రూ.45,000 కోట్ల) నెట్‌ఫ్లిక్స్‌ ఆఫర్‌ చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఐరోపా, అమెరికాల్లో బలమైన యాంటీ ట్రస్ట్‌ తనిఖీలకు ఈ ఒప్పందం లోనుకావచ్చని అంటున్నారు. ఈ భారీ ఒప్పందం కోసం నెట్‌ఫ్లిక్స్‌ బ్యాంకుల కాన్సార్టియం నుంచి 59 బిలియన్ డాలర్ల భారీ ఆర్థిక సహాయాన్ని పొందినట్టు స్ట్రీమింగ్‌ దిగ్జం తెలిపింది. తమ వినియోగదారులకు వైవిధ్యభరితమైన ఎంటర్‌టైన్‌మెంట్‌ కంటెంట్‌ని అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా తమ సబ్‌ స్క్రిప్షన్‌ల ప్లాన్‌ను మెరుగుపరచకోవడమే నెట్‌ఫ్లిక్స్ ముఖ్య ఉద్దేశం. అలాగే స్టూడియో కార్యకలాపాలను విస్తరించడంతో పాటు ప్రతి ఏటా 2 బిఇయన్‌ డాలర్ల నుంచి 3 బిలియన్‌ డాలర్ల వరకు ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ డీల్‌ సహాయపడుతుందని నెట్‌ఫ్లిక్స్‌ తమ ప్రకటనలో వెల్లడించింది.

Also Read: Aadi Sai Kumar: బాలయ్యతో బాక్సాఫీసు క్లాష్‌.. తప్పదు అంటున్న యంగ్‌ హీరో

అందుకే ఈ డీల్

అదే విధంగా డిస్నీ, పారామౌంట్ వంటి సంస్థల నుంచి ఎదురవుతున్నపోటీని ఎదుర్కోవడానికి, సొంత కంటెంట్ లైబ్రరీని మెరుగుపరుచుకోవడానికి ఈ డీల్ కీలకంగా మారుతుదని నెట్‌ఫ్లిక్స్‌ అభిప్రాయపడింది. హిట్ షోలు, సినిమాల హక్కులను సొంతం చేసుకోవడం, బయటి స్టూడియోలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడమే నెట్‌ఫ్లిక్స్ లక్ష్యమని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ ఒప్పందం ప్రతిపాదనలో 5.8 బిలియన్ డాలర్లకు బ్రేకప్ ఫీజు ఉందని, ఒకవేళ ఒప్పందం రద్దయినా లేదా నెట్‌ఫ్లిక్స్ ఈ మొత్తాన్ని వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరికి చెల్లించాల్సి ఉంటుందట. డీల్‌లో భాగంగా WBD వాటాదారులు ప్రతి షేరుకు 23.25 డాలర్ల క్యాష్ పేమెంట్‌ తో పాటు 4.50 డాలర్ల విలువైన నెట్‌ఫ్లిక్స్ స్టాక్ పొందుతారు. అయితే వార్నర్ బ్రదర్స్ లీనియర్ నెట్‌వర్క్ వ్యాపారం (CNN, TNT, HGTV, డిస్కవరీ+) మాత్రం ఈ ఒప్పందంలో భాగం కాలేదని స్పష్టం చేసింది నెట్‌ఫ్లిక్స్‌.

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×