E-Paper
Advertisement

Pastor Joseph: విషాదం.. గుండెపోటుతో ‘పాతాళ భైరవి’ నటుడు కన్నుమూత

Pastor Joseph: విషాదం.. గుండెపోటుతో ‘పాతాళ భైరవి’ నటుడు కన్నుమూత
Advertisement

Actor Pastor Joseph Died: టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు పాస్టర్‌ జోసెఫ్‌ (47) కన్నుమూశాడు. గురువారం (డిసెంబర్‌ 4) ఆయన గుండెపోటుతో మరణించారు. ఈ విషాద వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిలకలూరిపేటలో ఓ కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా మార్గమధ్యలో ఆయనకు గుండెలో నొప్పితో కుప్పకూలారు. దీంతో ఆయనను హుటాహుటినా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మరణిచినట్టు వైద్యులు ధ్రువికరించారు. ఆయన మరణావార్త తెలిసి టాలీవుడ్‌ సినీ ప్రముఖులు, నటీనటులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

గుండెపోటుతో మృతి

కాగా తెలుగులో ఎన్నో చిత్రాల్లో తనదైన కామెడీతో నవ్వించిన పాస్టర్‌ జోసెఫ్‌ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన సొంత గ్రామం ఏలూరు జిల్లా నిడమర్రు మండలం పెదనిండ్రకొలను గ్రామంలోనే ఉంటున్నారు. జోసెఫ్ తల్లిదండ్రులు మరిపూడి సుబ్బారావు-సుబ్బాలక్ష్మీల ఏకైక కుమారుడు జోసెఫ్‌. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత 25 ఏళ్ల క్రితం ఉంగటూరు మండలం చేబ్రోలులో పాస్టర్ యోబు దగ్గరకు వెళ్లి అక్కడే ఉండి ఆయన వద్ద శిష్యరికం చేసిన ఆయన ప్రస్తుతం పాస్టర్‌గా స్థిరపడ్డారు. గతంలో ఎన్టీఆర్ తో కలిసి ‘పాతాళభైరవి’ సహా ఆరు చిత్రాల్లో నటించారు. కృష్ణ, కృష్ణంరాజు, కమలహాసన్ వంటి అగ్రనటులతో కలిసి నటించి ప్రేక్షకులను మెప్పించారు. పాస్టర్ గాను ఆయన ప్రసంగంలో నవ్వులు పూయించేవారు.

Advertisement

Also Read: Aadi Sai Kumar: బాలయ్యతో బాక్సాఫీసు క్లాష్‌.. తప్పదు అంటున్న యంగ్‌ హీరో

Related News

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

Big Stories

Advertisement
×