BigTV English
Advertisement

Nizhal Movie : 8 ఏళ్లకే మర్డర్ స్టోరీలు… 30 సంవత్సరాల కేసు … ట్విస్ట్ లతో అదరగొట్టే క్రైమ్ థ్రిల్లర్

Nizhal Movie :  8 ఏళ్లకే మర్డర్ స్టోరీలు… 30 సంవత్సరాల కేసు … ట్విస్ట్ లతో అదరగొట్టే క్రైమ్ థ్రిల్లర్

Nizhal Movie : మలయాళం చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు, ఇప్పుడు టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన ‘కిష్కింద కాండం’, ‘పని’ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. అటువంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


ఆహా (aha) లో 

2021లో వచ్చిన ఈ మలయాళం సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘నిజల్’ (Nizhal). మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మలయాళం సినిమాలో   చాకో బోబన్న, నయనతార హీరో, హీరోయిన్లుగా నటించగా, అప్పు ఎన్ భట్టతిరి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఏప్రిల్ 9, 2021 విడుదలైంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా (aha) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

జాన్ ఒక కారు ప్రమాదంలో హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. ఆ ప్రమాదం జరిగిన తర్వాత నుంచి, అతనికి వర్షం పడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఒక సైకాలజిస్ట్ దగ్గరికి చెకింగ్ కోసం వెళ్తాడు. తలకు దెబ్బ తగలడం వల్ల అలా అనిపిస్తుందని, కోలుకోవడానికి కొంచెం సమయం పడుతుంది అని చెప్తాడు. తనకి నయం అయ్యేంతవరకు ఒక మాస్క్ పెట్టుకోమని చెప్తాడు. ఆ తర్వాత, తన ఫ్రెండ్ అయిన రాజన్ దగ్గరికి వెళ్తాడు. ఆమె భార్య కూడా సైకాలజిస్ట్ కావడంతో జాన్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంతుంది. ఈ క్రమంలోనే ఒక చిన్న పిల్లవాడు చేసిన పని ఫన్నీగా చెప్తుంది. కథలు రాయమంటే, కొంతమంది పిల్లలు, పిల్లి, జిరాఫీ కథలు రాశారని, ఒక పిల్లవాడు మాత్రం మర్డర్ స్టోరీ రాశాడని చెప్తుంది. అయితే అది మలయాళం లో ఉందని, ఆ పిల్లవాడికి మలయాళం తెలిసే ప్రసక్తే లేదని చెప్తుంది. జాన్ ఆ పిల్లవాడు చెప్పినట్టు మర్డర్ జరిగిన ప్రాంతానికి వెళ్తాడు. పోలీసుల సహాయం తో ఆ ప్రాంతాన్ని పరిశీలించగా, అక్కడ ఒక అస్తిపంజరం ఉంటుంది. ఆ పిల్లవాడు చెప్పింది నిజమేనని మళ్లీ తిరిగి వస్తాడు.

ఆ పిల్లవాడు చెప్పిన రెండో కథ కూడా నిజం అవుతుంది. ఈ కథలు పిల్లవాడికి ఎవరు చెప్తున్నారని సందేహ పడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే పిల్లవాడి తల్లి షర్మిల సాయం తీసుకుంటాడు. ఒకరోజు షర్మిల ఇంట్లో ఏదైనా క్లూ దొరుకుతుందని వెతుకుతూ ఉంటాడు. నిద్రలో అతని తల్లి షర్మిల కలవరిస్తూ కథ చెప్తూ ఉంటుంది. ఆ కథను చిన్న పిల్లవాడు వింటూ ఉంటాడు. ఇది తెలుసుకున్న జాన్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు. ఆమె గతాన్ని తెలుసుకోవాలనుకుంటాడు. షర్మిల భర్త కూడా ఒక ప్రమాదంలో చనిపోయి ఉంటాడు. ఈ క్రమంలోనే ఇన్వెస్టిగేషన్ చేస్తూ పోతాడు. ఈ ఇన్వెస్టిగేషన్లో జాన్ దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి తెస్తాడు. షర్మిలకి, ఆ హత్యలకి సంబంధం ఉందా? జాన్ వెలుగులోకి తెచ్చే విషయాలు ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ట్విస్ట్ లతో సాగిపోయే ఈ మూవీని చూడండి.

Related News

K Ramp OTT : ఓటీటీ డేట్ ను లాక్ చేసుకున్న ‘కే ర్యాంప్’.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..?

OTT Movie : ఒంటిపై నూలు పోగు లేకుండా భగభగ మండే మంటల్లోకి పరుగు… ఇదెక్కడి దిక్కుమాలిన పని సామీ

OTT Movie : మిస్టీరియస్ మనిషితో ముసలావిడ రొమాన్స్… ఇలాంటి సినిమాను ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : భర్తకు బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయే భార్య… ఐఎండీబీలో రేటింగ్ 8… క్రైమ్ మూవీ లవర్స్ కు పండగే

OTT Movie : IMDb లో 9.7 రేటింగ్… స్కూల్ పుస్తకాల్లో స్కామ్… ఈ తండ్రి గట్స్ కు దండం పెట్టాల్సిందే భయ్యా

OTT Movie : బ్రోతల్ హౌస్ నుంచి తప్పించుకుని 17 ఏళ్ల అమ్మాయితో ఆ పాడు పనులు… ఈ మూవీ స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : స్కూల్ పాప డ్రెస్సుకు బటన్స్ పెట్టే మాస్టార్… డోర్ వేస్తానని చెప్పి ఆమె చేసే పనికి ఫ్యూజులు అవుట్

OTT Movie : అడవిలో వేలాడే తల లేని శవం… తవ్వుతున్న కొద్దీ బయటపడే నేరాల చిట్టా… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×