BigTV English

Nindu Noorella Saavasam Serial Today February 13th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  కాళీని పెళ్లి చేసుకుంటానన్న మనోహరి – అనామిక బాడీలోకి వెళ్లిన ఆరు

Nindu Noorella Saavasam Serial Today February 13th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  కాళీని పెళ్లి చేసుకుంటానన్న మనోహరి – అనామిక బాడీలోకి వెళ్లిన ఆరు

Nindu Noorella Saavasam Serial Today Episode : మనోహరి రాగానే బలవంతంగా తాళి కడతానని మంగళకు చెప్తాడు కాళీ. ఆ మాటలకు మంగళ షాక్ అవుతుంది. ఆ మనోహరి నమ్మిన స్నేహితురాలినే చంపింది. నిన్ను నన్ను వదిలిపెడుతుందా..? అంటూ భయపడుతుంది. అరుందతిని చంపింది. ఆ ఇంట్లో చేరింది. అందర్ని మోసం చేస్తుంది. అమరేంద్రను పెళ్లి చేసుకోవాలనే ఆశతో ఏదో ఒక రోజు చేసుకుంటుంది అన్న ఆశతో ఏదో ఒక రోజు చేసుకుంటుందన్న నమ్మకంతోనే కదనే అంటాడు కాళీ అవునని అంటుంది మంగళ. అదే నేను మనోహరి మెడలో తాళి కట్టినట్టు.. నా పెళ్లాం అయినట్టు.. అమరేంద్రకు ఆ కుటుంబానికి తెలిస్తే.. ఇంకెట్టా పెళ్లి చేసుకుంటదే.. నాతో కలిసి ఉండటం తప్పా ఆ మనోహరికి మరో దారే లేదు అని కాళీ చెప్పడంతో మంగళ కూడా ఇంకాసేపట్టో మనోహరి కలలు కన్నీళ్లుగా మారబోతున్నాయి అని తెలియక ఆగమేఘాల మీద ఇక్కడకు వస్తుందా..? పాపం అంటుంది మంగళ.


చిత్రగుప్తుడు ఆరును తీసుకుని మేఘాలలో వెళ్తుంటాడు. ఆరు అనుమానంగా మిస్టర్‌ చిత్రగుప్తా.. మీరు నాకు హ్యాండిచ్చి.. నన్ను యమలోకం తీసుకుపోవడం లేదు కదా అని  అడుగుతుంది. దీంతో గుప్త చిరాకుగా అనుమానం ముందు పుట్టి.. తర్వాత మానవులు పుట్టారని నా పితృదేవులు చెప్తుంటే నేను నమ్మలేదు. కానీ నిన్ను చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది అంటాడు. బాలిక తమరి కోసం నేను ఇంతటి సాహసానికి ఒడిగడితే మీరు నన్నే అనుమానించుచుంటిరే అంటాడు. ఇది ఎవరైనా వింటే మీరు నిజంగా గొప్ప వ్యక్తి అనుకుంటారు అంటుంది. ఇందులో నా స్వార్థం కూడా ఉన్నది బాలిక అంటాడు.

అవును నాకు తెలుసులే మీరు ఇదంతా నాగమణి కోసం చేస్తున్నారని నాకు తెలుసు అని ఆరు చెప్తుండగానే.. చిత్రగుప్తుడు బాలిక మనం చేరవలసిన ప్రదేశం అదే అని అనామిక దగ్గరకు తీసుకెళ్తాడు. అక్కడ అనామిక నిద్రమాత్రలు మింగి చనిపోతుంది. వెంటనే ఆమె బాడీలోకి ఆరు ఆత్మను ప్రవేశపెడతాడు చిత్రగుప్తుడు. మరోవైపు పెద్దగా గాలి వీయడంతో ఇంట్లో ఉన్న ఆరు ఫోటో దగ్గర దీపం ఆరిపోతుంది. పూజగదిలో మిస్సమ్మ పూజ చేస్తుంటే.. దీపం ఆరిపోతుంది. కానీ మిస్సమ్మ చేతులు అడ్డుపెడుతుంది. గాలి తగ్గాక మిస్సమ్మ హాల్లోకి రాగానే శివరాం కంగారుగా ఏంటమ్మా ఇది ఉన్నట్టుండి గాలి వీచింది అని అడుగుతాడు. అదే అర్థం కావడం లేదు మామయ్య దీపం కూడా కొండెక్కబోయింది.


ఇందాకటి నుంచి మనసంతా అలజడిగా ఉంది. ఏదో జరుగుతున్నట్టు ఏవేవో పిచ్చి ఆలోచనలు అంటూ కంగారు పడుతుంది మిస్సమ్మ. దీంతో నిర్మల భయపడాల్సిన అవసరం లేదు మిస్సమ్మ.. జరగబోయేదంతా మంచిదేనని ఆ పరమేశ్వరుడు సంకేతాన్ని పంపాడు అని చెప్పగానే.. శివరాం ఆశ్చర్యంగా ఏంటి నిర్మల నువ్వు చెప్పేది. అని అడుగుతాడు. దీంతో నిర్మల అవునండి రేపుటి శివరాత్రి శివతాండవానికి శివయ్య సన్నాహాలు మొదలుపెట్టాడు అనిపిస్తుందండి అని చెప్తుంది.

అనామిక శరీరంలోకి వెళ్లిన ఆరు మత్తుగా లేస్తుంది. చిత్రగుప్తుడు దగ్గరకు వెళ్లి హమ్మయ్యా లేచితివా బాలిక త్వరగా నీ గృహమునకు వెళ్లెదము.. నాగమణిని తీసుకుని వచ్చెదము అంటూ మాట్లాడుతుంటే.. అనామిక ( ఆరు) కు వినిపించదు. చిత్రగుప్తుడు కనిపించడు. దీంతో గుప్త షాక్ అవుతాడు. అనామిక మాత్రం ఆరు లా కాకుండా అనామికలాగే మాట్లాడుతుంది. దీంతో ఎక్కడో ఏదో తప్పిదం జరిగింది. వెంటనే యమపురికి వెళ్లి తప్పిదం తెలుసుకోవాలి అని చిత్రగుప్తుడు వెళ్లిపోతాడు.

మనోహరి కోసం కాళీ, మంగళ ఎదురుచూస్తుంటారు. ఇంతలో మనోహరి వస్తుంది. కోపంగా తిడుతూ ఎంత ధైర్యం ఉంటే నన్నే బెదిరిస్తావురా నువ్వు అంటూ కొట్టబోతుంటే.. మంగళ అడ్డుపడి.. మనోహరి ఆగు ఏంటి ఈ కోపం  నా తమ్ముణ్ని చంపేస్తావా ఏంటి..? అంటుంది. దీంతో ఏయ్‌ నాకొచ్చే కోపానికి నీ తమ్ముణ్నే కాదు నిన్ను కూడా చంపేస్తాను అంటూ చెప్పు ఎంత కావాలి నీకు అని అడుగుతుంది. దీంతో కాళీ ఎంత కావాలని కాదు మనోహరి.. ఏం కావాలని అడుగు మనోహరి అంటాడు. సరే చెప్పు ఏం కావాలి అని అడుగుతుంది మనోహరి. దీంతో కాళీ పెళ్లి కావాలి. నీ వల్ల నా పెళ్లి ఆగిపోయింది. చిన్నప్పటి నుంచి భాగీని ఎంతో ప్రేమించాను. కానీ నీవల్లే భాగీతో నా పెళ్లి ఆగిపోయింది అంటాడు కాళీ.

దీంతో మనోహరి వెటకారంగా అయితే ఏం చేయాలి ఇప్పుడు ఒక అమ్మాయిని వెతికి నీ పెళ్లి చేయాలా..? అంటుంది. దీంతో కాళీ లేదు నన్ను పెళ్లి చేసుకుంటే చాలు అంటాడు. మనోహరి కోపంగా ఏమన్నావు అంటుంది. దీంతో కాళీ తన చేతిలో ఉన్న తాళి చూపిస్తాడు. దీంతో కోపంగా మనోహరి ఎంత ధైర్యం ఉంటే నన్నే పెళ్లి చేసుకుంటాను అంటావురా..? అంటూ తిడుతుంటే.. కాళీ బలవంతంగా తాళి కట్టడానికి ప్రయత్నిస్తాడు. మనోహరి అడ్డుకుని తోసేస్తుంది. నాకు ఆల్‌ రెడీ పెళ్లి అయింది. నువ్వు నా మెడలో తాళి కడితే నా మాజీ మొగుడు నిన్ను జైలుకు పంపిస్తాడు. అలా కాకుండా రణవీర్‌ను నువ్వు చంపేసిరా అప్పుడు పెళ్లి చేసుకుందాం. కోట్ల ఆస్తి వస్తుంది అని నువ్వే డిసైడ్‌ చేసుకో అని చెప్పి వెళ్లిపోతుంది మనోహరి. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

Intinti Ramayanam Today Episode: అక్షయ్ ను రెచ్చగొట్టిన పల్లవి.. పోలీస్ కంప్లైంట్.. ప్రణతి కోసం నిజం చెప్తాడా..?

GudiGantalu Today episode: మీనా మిస్సింగ్.. ప్రభావతి ఇంట్లో టెన్షన్..లెటర్ తో ఇంట్లో బాంబ్..

Nindu Noorella Saavasam Serial Today october 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరును బంధించేందుకు చంభా కొత్త ప్లాన్‌    

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి రాబోతున్న చిత్రాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి నర్మద స్ట్రాంగ్ వార్నింగ్..కత్తి పట్టిన ప్రేమ.. ఇది కదా ట్విస్ట్ అంటే..

Big tv Kissik Talks: మహేష్ విట్టా లవ్ లో ఇన్ని  ట్విస్టులా.. నా ఆటోగ్రాఫ్ సినిమాని తలపిస్తోందిగా?

Big tv Kissik Talks: బిగ్ బాస్ నా జీవితాన్నే మార్చేసింది.. ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోలేను?

Big tv Kissik Talks: పేరుకే గొప్ప నటుడు.. సొంత ఇల్లు కూడా లేదు.. ఇండస్ట్రీలో ఇంత మోసమా?

Big Stories

×