BigTV English

OTT Movie : దెయ్యాలు ఉండే మ్యాన్షన్ లోకి తల్లి కూతుర్ల ఎంట్రీ… కూతురు మిస్ అవడంతో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్

OTT Movie : దెయ్యాలు ఉండే మ్యాన్షన్ లోకి తల్లి కూతుర్ల ఎంట్రీ… కూతురు మిస్ అవడంతో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్

OTT Movie : కరోనా తర్వాత కొరియన్ సినిమాలు వెబ్ సిరీస్ లకు ఇండియన్ మూవీ లవర్స్ దాదాపుగా అడిక్ట్ అయిపోయారు. బుల్లితెరలో సీరియల్స్ ఎలాచూస్తున్నారో అలా కొరియన్ సెరిస్ లు మనవాళ్లు చూస్తున్నారు. ఇలా కొరియన్ సినిమాలను పిచ్చిగా ఇష్టపడే వారి కోసమే దీపావళి నాడు ఓ హర్రర్ కొరియన్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా పేరేంటి? ఎక్కడ చూడొచ్చు? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.


నెట్ ఫ్లిక్స్

హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లను ఇష్టపడే వారి కోసమే ఈ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ పేరు “డోంట్ కం హోం” (Don’t Come Home). తమ సొంత ఇంటిని వెతుక్కుంటూ వెళ్లిన ఓ తల్లి కూతురుకు ఎలాంటి అనుభవం ఎదురైందనే నేపథ్యంలో సాగే సిరీస్ ఇది. ఈ మిస్టరీ అండ్ హర్రర్ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రిమింగ్ అవుతోంది. థాయిలాండ్ లోని ఒక అడవిలో ఉన్న మెన్షన్ చుట్టూ నడుస్తుంది ఈ హార్రర్ స్టోరీ. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఒక తాయ్ వెబ్ సిరీస్ గురించి. కానీ నిరాశ కలిగించే విషయం ఏమిటంటే ఈ సిరీస్ ప్రస్తుతం ఇండియాలో కేవలం ఇంగ్లీష్ హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. మరి తెలుగులో ఎప్పుడు అవైలబుల్ గా ఉంటుందో చూడాలి.


స్టోరీ ఏంటంటే…

బ్యాంకాక్ కి దూరంగా ఒక అడవి ఉంటుంది. అందులో ఒక మ్యాన్షన్ ఉంటుంది. ఆ మెన్షన్ లోకి వాలి అనే మహిళతో పాటు ఆమె కూతురు కూడా ఎంట్రీ ఇస్తుంది. కానీ అప్పటికే ఆ చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఆ ఇంట్లో దయ్యాలు ఉన్నాయని నమ్ముతారు. అయినా వినకుండా ఈ తల్లి కూతుర్లు ఆ ఇంట్లో చేరుతారు. అప్పటినుంచి ఇద్దరికీ వింత వింత అనుభవాలు ఎదురవడమే కాకుండా, ఊహించని సంఘటనలు భయపెడతాయి. ఓ రోజు ఆమె కూతురు కనిపించకుండా పోతుంది. తల్లి ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులు కు కంప్లైంట్ చేస్తుంది. దీంతో పోలీసులు అడవి మొత్తం పాప కోసం జల్లెడ పడతారు. ఈ క్రమంలో కొన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తాయి. అయితే ఇన్వెస్టిగేషన్లో పోలీసులు ఆ తల్లిని అనుమానిస్తారు. అసలు ఆ మహిళ ఎవరు? ఎవరు లేరని తెలిసి ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళింది? ఆ ఇంట్లో ఉండే కంటికి కనిపించని శక్తుల కథ ఏంటి? పాప దొరికిందా లేదా? అన్న విషయాలు తెలియాలంటే డోంట్ కం హోం (Don’t Come Home) అనే హర్రర్ మిస్టరీ వెబ్ సిరీస్ ను చూడాల్సిందే. ఈ వెబ్ సిరీస్ లో ట్విస్ట్లు చాలానే ఉంటాయి. నెక్స్ట్ ఏంజరుగుతుందోనని ఆతృతగా ఈ వెబ్ సిరీస్ ను చూస్తారు మూవీ లవర్స్ . మరెందుకు ఆలస్యం హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లను ఇష్టపడే వారు ఈ సీరీస్ పై ఓ లుక్ వేయండి.

Related News

OTT Movie : అడుగు పెట్టగానే కుప్పకూలే కలల సౌధం… చివరి వరకూ ట్విస్టులే… బుర్ర బ్లాస్ట్ చేసే కొరియన్ థ్రిల్లర్

OTT Movie : 40 ఏళ్ల క్రితం మిస్సైన అమ్మాయి కోసం వేట… టాటూతో ఊహించని ట్విస్ట్… పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : చచ్చిన శవాన్ని కూడా వదలకుండా ఇదెక్కడి దిక్కుమాలిన పని భయ్యా ? స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : ఈ ఊర్లో అమ్మాయిల్ని పుట్టకుండానే చంపేస్తారు… అలాంటి గ్రామాన్ని మార్చే ఆడపిల్ల… ఒక్కో ట్విస్ట్ మెంటల్ మాస్

OTT Movie : అవెంజర్స్ ను జాంబీలుగా మార్చే వైరస్… ప్రపంచాన్ని అంతం చేసే డాక్టర్ డూమ్ ఈవిల్ నెస్

OTT Movie : ఆఫీస్ లో పీడకలగా మారే చివరిరోజు… ఈ కొరియన్ కిల్లర్ అరాచకం చూస్తే గుండె జారిపోద్ది మావా

Ghaati OTT : అనుష్కకు ఘోర అవమానం… 20 రోజుల్లో జీరో థియేటర్స్

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

Big Stories

×