E-Paper
Advertisement

OTT Movie : ఒంటరిగా కనిపించే అమ్మాయి ఆ సైకో టార్గెట్… సైకో కిల్లర్ మూవీ

OTT Movie : ఒంటరిగా కనిపించే అమ్మాయి ఆ సైకో టార్గెట్… సైకో కిల్లర్ మూవీ
Advertisement

OTT Movie : సైకో కిల్లర్ సినిమాలు సీను సీనుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా ఉంటాయి. అందుకే ఇలాంటి సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు మన మూవీ సజెషన్ కూడా ఇలాంటి ఒక ఎంగేజింగ్ మూవీనే. మరి ఆ మూవీ పేరేంటి? ఎక్కడ చూడచ్చు? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో..

Advertisement

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని చూస్తే వణుకు పుట్టడం ఖాయం. ఈ సైకో కిల్లర్ ఒంటరిగా కనిపించే అమ్మాయిలు లేదా చావాలనుకునే అమ్మాయినే టార్గెట్ చేస్తాడు. స్టోరీ మొత్తం ఆ సైకో కిల్లర్ తో పాటు హీరోయిన్ చుట్టూనే తిరుగుతుంది. కాబట్టి సినిమాలో ఎక్కువ పాత్రలు లేకపోవడంతో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. కానీ డిసప్పాయింట్ కలిగించే ఒకే ఒక్క విషయం ఏమిటంటే ఈ సినిమా తెలుగులో అందుబాటులో లేదు. ఈ మూవీ పేరు “డోంట్ మూవ్” (Don’t Move). ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ (Netflix ) లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే…

Advertisement

హీరోయిన్ స్టార్టింగ్ లోనే ఉదయాన్నే నిద్ర లేచి కారులో ప్రయాణం అవుతుంది. అప్పటికే తన కొడుకు చనిపోవడంతో అతడిని పూడ్చిపెట్టిన ప్లేస్ లోకి వెళ్లి కొడుకును తలచుకుంటుంది. ఆ తర్వాత ఓ పెద్ద కొండపైకి వెళ్లి అక్కడ నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలి అనుకుంటుంది. అంతలోనే వెనకాల ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి ఆమెతో మాట్లాడతాడు. చావాలనుకుంటే చావు… కానీ నీ పేరు ఏంటో చెప్పి చావు అని ఆమెతో కబుర్లు మొదలు పెడతాడు. నువ్వు చావడం గురించి నాకు ఎలాంటి బాధ లేదు, అలాగే నీ స్టోరీ కూడా నాకు తెలుసుకోవాలని లేదు… కావాల్సిందల్లా నీ పేరు మాత్రమే అంటూ ఆమెను డైవర్ట్ చేస్తాడు. ఆ తర్వాత అతని వెంబడి హీరోయిన్ కిందకు వచ్చేస్తుంది. అక్కడ కార్లోకి ఎక్కే క్రమంలో సైకో కిల్లర్ ఆమెకు కరెంట్ షాక్ ఇచ్చి కళ్ళు తిరిగి పడిపోయేలా చేస్తాడు. కళ్ళు తెరిచి చూసేసరికి హీరోయిన్ ఒక కార్లో కాళ్లు చేతులు కట్టేసి ఉంటుంది. అక్కడ నెట్వర్క్ పని చేయకపోవడంతో పోలీసులకు ఇన్ఫాం చేసే అవకాశం కూడా ఉండదు.

ఈ నేపథ్యంలోనే కిల్లర్ తో ముచ్చట్లు పెడుతూ హీరోయిన్ తన చేతికి ఉన్న కట్లను తెంచుకుంటుంది. ఆ తర్వాత అతనికి సీట్ బెల్ట్ ను అతని మెడకు వేసి యాక్సిడెంట్ అయ్యేలా చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కారులోంచి బయటపడగా హీరోయిన్ తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ కిల్లర్ నీకు ఇంజక్షన్ ఇచ్చాను , దానివల్ల నీ శరీరంలో ఒక్కో పార్ట్ నెమ్మదిగా పారలైజ్ అవుతుంది. కొంత టైం తర్వాత నువ్వు అసలు ఎక్కడికి కదల్లేవు, కేవలం చూడగలవు అంతే అని చెప్తాడు. ఫస్ట్ భయపడినప్పటికీ హీరోయిన్ తప్పించుకొని ఒక ముసలాడే ఇంటికి చేరుకుంటుంది. వాడిని కూడా చంపేసి హీరోయిన్ ను ఎత్తుకెళ్లి పోతాడు ఆ కిల్లర్. అప్పటికి హీరోయిన్ పూర్తిగా ప్యారలైజ్ అయ్యి, చూడడం తప్ప ఇంకేమీ చెయ్యలేని పరిస్థితిలో ఉంటుంది. మరి హీరోయిన్ ఆ కిల్లర్ నుంచి ఎలా తప్పించుకుంది? చివరికి క్లైమాక్స్ ఏంటి? అనే విషయం తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×