E-Paper
Advertisement

OTT Movie : నదిలో తేలే శవాలు… జంతుబలితో శాంతి పూజలు… కన్నడ హర్రర్ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్

OTT Movie : నదిలో తేలే శవాలు… జంతుబలితో శాంతి పూజలు… కన్నడ హర్రర్ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్
Advertisement

OTT Movie : ఓటీటీలలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలు దర్శనం ఇస్తున్న సంగతి తెలిసిందే. అందులోనూ హారర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి సినిమాలను ఇష్టపడే వారి కోసమే మరికొన్ని గంటల్లో ఓ హర్రర్ కామెడీ థ్రిల్లర్ ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది. మరి ఆ మూవీ ఏంటి ? కథ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్

కన్నడ నటుడు కోమల్ తన ‘ఉండెనామా’ మూవీ కోస్టార్ తనీషా కుప్పండతో కలిసి నటించిన హర్రర్ కామెడీ ‘కోన’. ఈ చిత్రానికి కోమల్ సహ నిర్మాతగా కూడా పని చేశాడు. అక్టోబర్ 31 న చాలా కన్నడ సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అందులో ఒకటిగా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ‘కోన’కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కానీ ఎక్కువ కాలం బాక్సాఫీస్ దగ్గర తన జోరును కొనసాగించలేకపోయింది ఈ మూవీ. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రియులను అలరించడానికి సిద్ధం అయ్యింది. జీ నెట్‌వర్క్ ‘కొన’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం డిసెంబర్ 19న జీ5 ఓటీటీలో ప్రీమియర్ కాబోతోందని ప్రకటించారు. హరి కృష్ణ ఎస్ దర్శకత్వం వహించిన ఈ ‘కోన’ చిత్రంలో వినయ్ గౌడ, రిత్వి జగదీష్, రఘు రామనకొప్ప, జగప్ప, రంజిత్, నమ్రత గౌడ, శిశిర్ శాస్త్రి, ఎంకే మఠ్, విజయ్ చెల్లూర్ తదితరులు నటించారు. 2025లో జీ5 పిక్ చేసుకున్న అతి కొద్ది చిత్రాలలో ‘కోన’ ఒకటి. మరి ఈ మూవీ ఓటీటీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement

Read Also : ఫిల్మ్ ఫేర్ లో దుమ్మురేపిన సినిమాలు, సిరీస్ లు… ఏది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందంటే?

 

కథలోకి వెళ్తే…

Advertisement

‘కోన’ కథ 19వ శతాబ్దంలో ప్రారంభమవుతుంది. ఒక గ్రామంలో నివసించే ప్రజలు మిస్టరీ శక్తి దాడి కారణంగా నదిలో చనిపోతారు. ఈ అరిష్టానికి అడ్డుకట్ట వేయడానికి బలి ఇవ్వాలని నిర్ణయిస్తారు. రాజు గ్రామ సరిహద్దులను గుర్తించి, జంతు బలితో సహా కొన్ని ఆచారాలతో స్థానిక దేవత రక్షణలో ఊరిని ఉంచమని చెబుతారు తాంత్రికులు. అయితే అప్పట్లో అంటే జంతుబలి అనేది కామన్, కానీ ప్రస్తుత కాలంలో ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం కష్టం. ఎందుకంటే జంతు బలికి అనుమతి లేదు కదా. అలాంటి టైమ్ లో జరుగుతున్న ఆలయ ఉత్సవానికి జ్యోతిష్యుడు నారాయణ (కోమల్) ఈ గ్రామానికి వస్తాడు. ఆయన అక్కడ అడుగు పెట్టాక ఏం జరిగింది ? ఆ పరిస్థితులను కోమల్ ఎలా ఎదుర్కొన్నాడు ? అన్నది స్టోరీ. మూవీ స్టోరీ చెప్పుకోవడానికి ఇంట్రెస్టింగ్ గా, సీరియస్ గానే ఉన్నప్పటికీ ఇందులో కామెడీ కూడా కావలసినంత ఉంటుంది. కాబట్టి హర్రర్ కామెడీ మూవీ లవర్స్ ఈ మూవీని చూడడం మరచిపోవద్దు.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×