BigTV English

OTT Movie : సవతి తల్లితో ఈ అబ్బాయి చేసే పనులు… చూస్తే షాక్ అవ్వాల్సిందే మావా

OTT Movie : సవతి తల్లితో ఈ అబ్బాయి చేసే పనులు… చూస్తే షాక్ అవ్వాల్సిందే మావా

OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను మూవీ లవర్స్ ఎక్కువగా ఇష్టపడతారు. ఈ సినిమాలలో వచ్చే ట్విస్ట్ లు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తుంటాయి. ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఎక్కువగా ఈ సస్పెన్స్ చిత్రాలే స్ట్రీమింగ్ అవుతున్నాయి. థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకొని ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఒక హాలీవుడ్ సస్పెన్స్ మూవీ గురించి తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘మై కజిన్ రేచెల్‘ (My cousin Rachel). ఈ మూవీలో ముసలి తండ్రి పెళ్లి చేసుకున్నాక అనుకోకుండా చనిపోతాడు. ఆ తర్వాత ఆ ముసలి వ్యక్తి భార్య, హీరో మధ్య స్టోరీ నడుస్తుంది. ఈ మూవీలో మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ లు ఉంటాయి. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

సంపన్న వ్యక్తి అయిన బ్రోస్ కి అమ్మాయిలంటే పెద్దగా ఇష్టం ఉండదు. అందుకే పెళ్లి చేసుకోకుండా ఉంటాడు బ్రోస్ . ఒక అనాధను దత్తత తీసుకొని మంచిగా చూసుకుంటాడు. దత్తత తీసుకున్న హీరోని విదేశాలకు పంపిస్తాడు. చదువు పూర్తయిన తర్వాత హీరో తిరిగి బ్రోస్ దగ్గరికి వస్తాడు. వయసు అయిపోతూ ఉండటంతో ఆస్తి మొత్తం నువ్వే చూసుకోవాలని హీరోతో చెప్తాడు బ్రోస్. అయితే బ్రోస్ కి అనారోగ్యం ఉండటంతో తన సొంత ఊరు కి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలనుకుంటాడు. హీరోకి ఆస్తి అప్పజెప్పి దూరంగా వెళ్తాడు. కొన్ని రోజుల తర్వాత నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను పెళ్లి చేసుకుంటున్నాను అని హీరోకి లెటర్ రాస్తాడు. హీరో కూడా సంతోషపడతాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆమెను పెళ్లి చేసుకుని తప్పు చేశానని బాధపడుతూ మరొక లెటర్ రాస్తాడు. బ్రోస్ని చూడటానికి హీరో అతడు ఉన్న చోటికి వెళ్తాడు. అప్పటికే అతడు చనిపోయి ఉంటాడు. బ్రోస్ పెళ్లి చేసుకున్న అమ్మాయిని తన ఎస్టేట్ కి తీసుకు వస్తాడు. ఆ అమ్మాయి హీరో కన్నా చాలా యంగ్ గా ఉంటుంది.

ఆమె కూడా అనాధ కావడంతో బ్రోస్ ని పెళ్లి చేసుకొని ఉంటుంది. ఇదిలా ఉంటే ఆ ఎస్టేట్ లోనే లూసి అనే అమ్మాయి, చిన్నప్పటి నుంచి హీరోని ఇష్టపడుతూ ఉంటుంది. హీరో మాత్రం రేచెల్ ని ఇష్టపడుతూ ఉంటాడు. మొదట బ్రోస్ ని ఆస్తి కోసం చంపిందేమో అని అనుమానిస్తాడు. ఆమె ప్రవర్తన చూసి ఇలా చేసి ఉండదనుకుంటాడు. హీరోకి రేచెల్ ఒక సూప్ ఇస్తూ ఉంటుంది. ఇతనికే కాక అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ సూప్ ఇస్తూ ఉంటుంది. ఆస్తిని ఆమె పేరు మీద సగం రాసిస్తాడు బ్రోస్. అయితే రేచెల్ ఎవరికీ తెలియకుండా సిటీకి వెళ్లి వస్తూ ఉంటుంది. హీరో ఆమె మీద మరొక సారి అనుమానం పెంచుకుంటాడు. చివరికి బ్రూస్ ని రేచెల్ నిజంగానే చంపిందా? సిటీకి ఎవరికీ తెలియకుండా రేచెల్ ఎందుకు వెళ్తుంది? ఆ సూప్ లో నిజంగానే విషం కలుపుతోందా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని చూసేయండి.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×