BigTV English

OTT Movie : రాత్రయితే చాలు ఆ పార్క్ లో దయ్యాలు చేసే రచ్చ అంతా ఇంతా కాదు…. గూస్ బంప్స్ తెప్పించే హారర్ మూవీ

OTT Movie : రాత్రయితే చాలు ఆ పార్క్ లో దయ్యాలు చేసే రచ్చ అంతా ఇంతా కాదు…. గూస్ బంప్స్ తెప్పించే హారర్ మూవీ

OTT Movie : ఎన్ని సినిమాలు చూసినా హర్రర్ సినిమాలు చూస్తే వచ్చే కిక్కే వేరు. ఈ సినిమాలలో వచ్చే విజువల్స్ తో పాటు, సౌండ్ ఎఫెక్ట్స్ మూవీ లవర్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. రీసెంట్ గా తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక హర్రర్ మూవీ థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుని, ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


ఆపిల్ టీవీ

ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘పార్క్‘ (Park) ఈ మూవీలో ఇద్దరు ప్రేమికుల శరీరాలలోకి ఆత్మలు వచ్చి రచ్చ రచ్చ చేస్తాయి. ఈ మూవీలో కొన్ని సన్నివేశాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆపిల్ టీవీ (Apple TV)లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

మిత్రన్ ఏ పని పాట లేకుండా తిరుగుతూ ఉంటాడు. ఇంట్లో తల్లిదండ్రులు ఏదైనా పని చేసుకోమని అతనికి చెప్తూ ఉంటారు. ఒకరోజు షాపింగ్ చేసిన మిత్రన్ కి బంపర్ ప్రైస్ తగిలిందని పిలుపు వస్తుంది. అక్కడికి వెళ్లిన మిత్రన్ కు స్కూటీ బహుమతిగా వస్తుంది. అక్కడికి యామిని అనే  అమ్మాయి కూడా వస్తుంది. ఆ అమ్మాయికి బైక్ బహుమతిగా వస్తుంది. మిత్రన్ తనకు తగిలిన స్కూటీ మీకు బాగుంటుందని చెప్పడంతో, వెహికల్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఉద్యోగం కోసం మిత్రన్ ఒకచోటికి వెళ్తాడు. అక్కడ హెడ్ గా యామిని ఉంటుంది. ఆమె మిత్రన్ ని పనిలోకి తీసుకుంటుంది. ఒకరోజు యామినికి పెళ్లిచూపులు జరుగుతాయి. అతను ఎలాంటివాడో కనుక్కోవాలని మిత్రన్ కి చెప్తుంది యామిని. అతను మంచివాడు అయినా గాని, యామిని తో చెడ్డవాడిని చెప్తాడు మిత్రన్. ఎందుకంటే యామినీని మిత్రన్ ప్రేమిస్తుంటాడు. ఇలా రెండు మూడు సంబంధాలు చెడగొడతాడు. నేను నిన్ను ప్రేమించడం వల్లనే ఇలా పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అయ్యేలా చేశానని యామినితో చెప్తాడు. ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమించుకొని, ఎంగేజ్మెంట్ చేసుకుంటారు.

అదే ఊరిలో గురు అనే రౌడీ ఉంటాడు. మిత్రన్, యామిని రాత్రిపూట నడుచుకుంటూ వెళ్తుండగా, గురుతో పాటు అతని గ్యాంగ్ యామినీని టీజ్ చేస్తూ వారిని వెంబడిస్తారు. వాళ్ల నుంచి తప్పించుకొని ఒక పార్కు లోకి వెళ్తారు . అక్కడ వీరిద్దరి శరీరాలలోకి ఆత్మల ప్రవేశించి, గరు గ్యాంగ్ లో ఇద్దరిని చంపేస్తాయి. ఆ తర్వాత వీళ్ళిద్దరూ వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. యామిని రాత్రిపూట ఒంటరిగా దయ్యాల సినిమాలను చూస్తూ ఉంటుంది. పార్కులో జరిగిన హత్యలను ఒక పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్లో పోలీస్ ఆఫీసర్ కి దిమ్మతిరిగే విషయాలు తెలుస్తాయి. మిత్రన్, యామిని శరీరాలలోకి ప్రవేశించిన ఆత్మలు ఎవరివి? పార్కులో ఈ ఆత్మలు రౌడీలను ఎందుకు చంపాయి? పోలీస్ ఆఫీసర్ వెలుగులోకి తెచ్చిన విషయాలు ఏమిటి? వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఆపిల్ టీవీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి.

Related News

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

OTT Movie : పెళ్ళైన ట్యూషన్ టీచర్ పై ప్రేమ… సీక్రెట్ లెటర్ తో బండారం బట్టబయలు… IMDbలో 7.5 రేటింగ్

OTT Movie : తవ్వకాల్లో బయటపడే శవపేటిక… దుష్ట శక్తి విడుదలవ్వడంతో దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు డోంట్ వాచ్

OTT Movie : బాబోయ్ చావడానికెళ్లి ఇలా బుక్కయ్యాడేంటి… 12 జన్మలు, 12 సార్లు చావు… కల్లో కూడా చావు గురించి ఆలోచించరు

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : వరుడిని కోమాలోకి పంపే పెళ్లి కూతురు కోరిక… అంతలోనే మరో పెళ్ళికి సిద్ధం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Big Stories

×