OTT Movie : రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలంటే చేవి కోసుకునే అభిమానులు చాలామంది ఉన్నారు. హాలీవుడ్ అందాల తారలు తమ అందాల ప్రదర్శనలో మూవీ లవర్స్ ని ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే టైటానిక్ హీరోయిన్ కేట్ విన్స్ లేట్ తన అందాల ప్రదర్శనతో కుర్ర కారుకి వేడి పుట్టించింది. కేట్ విన్స్ లేట్ నటించిన ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాంపదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లో
ఈ హాలీవుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ పేరు “ది రీడర్” (The Reader). ఈ మూవీలో హీరోయిన్ రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ లో కోర్టు ఆమెకు జైలు శిక్ష విధిస్తుంది. ఈ మూవీ స్టోరీ మొత్తం హీరోయిన్ చుట్టూనే తిరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
మైఖేల్ కి దాదాపు 18 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇతను రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుండగా అనారోగ్యానికి గురవుతాడు. మైఖేల్ ని హీరోయిన్ తన ఇంటికి తీసుకువెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేసి పంపిస్తుంది. అనారోగ్యం నుంచి కోలుకున్న మైఖేల్ మళ్లీ ఆమె ఇంటికి వచ్చి థాంక్స్ చెప్తాడు. ఇలా వీరి పరిచయం పడక వరకూ వెళుతుంది. 36 సంవత్సరాలు ఉన్న హీరోయిన్ 18 సంవత్సరాల యువకుడితో రొమాన్స్ లో నిండిపోతుంది. ఎప్పుడు చూసినా అదే పనిలో ఉంటూ ఏకాంతంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా ఉంటే ఒక రోజు హీరోయిన్ మైఖేల్ కి చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఆమె ఆ తర్వాత మళ్లీ కనిపించదు. మైఖేల్ ఆమె గురించి ఆలోచిస్తూ కుంగిపోతాడు. కొద్ది రోజుల్లో కోలుకొని మళ్లీ సాధారణ మనిషిగా జీవిస్తాడు. మైఖేల్ కి ఆ తర్వాత ఒక అమ్మాయి తో పెళ్లి అవుతుంది. ఆమెతో కొంతకాలం కలసి జీవించాక విడాకులు తీసుకుంటాడు. అప్పటికే వీళ్ళిద్దరికీ ఒక కూతురు కూడా ఉంటుంది.
ఒకరోజు మైఖేల్ కోర్టులో ఖైదీలను ఎలా విచారిస్తారో తెలుసుకునే క్రమంలో కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ 18 సంవత్సరాల తర్వాత హీరోయిన్ ఖైదీగా ప్రత్యక్షమవుతుంది. రెండో ప్రపంచ యుద్ధంలో ఒక చర్చిలో 300 మంది సైనికులను, బయటికి రానికుండా గడియ పెట్టిందని కోర్టు ఆమెను నిందితురాలిగా పరిగణిస్తుంది. ఆమెతో పాటు ఉండే నలుగురు మహిళలు హీరోయిన్ ఒక్క దాని పై అకారణంగా నింద మోపుతారు. చివరికి కోర్టు హీరోయిన్ కి శిక్ష విధిస్తుందా. మైఖేల్ ఆమెను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాడు. ఇతనికి చెప్పకుండా ఆమె ఎందుకు వెళ్ళిపోయింది. అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ మీడియాలో (Amazon prime video) స్ట్రీమింగ్ అవుతున్న ది రీడర్ (The Reader) మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీలో ఆ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. రొమాంటిక్ మూవీ లవర్స్ ఈ మూవీని ఒంటరిగా చూడటమే బెట్టర్.