మిరపకాయలకు ఆకారాన్ని ఇచ్చేది క్యాప్సైసిన్ అనే రసాయనమే. అందుకే అది ఎంతో మంటను కలిగిస్తుంది. అందుకే ఈ క్యాప్సైసిన్ మంట కలిగించే అనేక ఉత్పత్తుల్లో వాడతారు. అయితే ఈ కారం నిండిన పదార్థాలు తిన్నప్పుడు ముక్కు ఎందుకు కారుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
కారం నిండిన ఉత్పత్తుల్లో కేవలం క్యాప్సైసిన్ కాదు మరెన్నో సమ్మేళనాలు ఉంటాయి. ఇది మీ ఊపిరితిత్తులను, శరీర రంధ్రాలను, క్యావిటీలను రక్షించే పలుచని పొరలను చికాకు పెడుతుంది. అలా చికాకు పెట్టినప్పుడే మీకు మంటగా అనిపిస్తుంది. ముక్కు కారడంతో పాటు ముక్కు దిబ్బడ కట్టినట్టు, గొంతులో శ్లేష్మం వస్తున్నట్టు, తుమ్ములు, దగ్గులు వంటివి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇలా స్పైసీ ఫుడ్స్ తినేటప్పుడు ముక్కు కారడాన్ని అలెర్జీ రినిటిస్ అంటారు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల ఆహార అలెర్జీలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఆహారం వల్ల అలెర్జీ కలుగుతుంది. కొందరికి పుట్టగొడుగులు పడవు. మరికొందరికి కోడిగుడ్డు, ఇంకొందరికి పాలకూర ఇలా రకరకాల పదార్థాలకు అలెర్జీలు కలుగుతూ ఉంటాయి. ఇవి కొన్ని లక్షణాలను చూపిస్తూ ఉంటాయి. కొంతమందికి కారపు ఆహారం పడకపోవచ్చు. అయితే ఇది తీవ్రమైన అలెర్జీ లక్షణాలను చూపించదు. కేవలం ముక్కు కారడం, గొంతులో ఇబ్బంది పడటం వంటివి చూపిస్తాయి. అయితే తీవ్రమైన ఆహారం అలెర్జీలు ఉంటే మాత్రం వైద్య పరంగా అత్యవసర చికిత్స తీసుకోవాల్సి రావచ్చు.
ఆహార అలెర్జీల లక్షణాలు
కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల వెంటనే మీకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఇలాంటివి కనిపిస్తే వెంటనే మీరు తగిన చికిత్స తీసుకోవాలని అవసరం. ముక్కు దిబ్బడ కట్టినట్టు అవ్వడం, విపరీతంగా దగ్గు రావడం, శ్వాస ఆడక పోవడం, గొంతు బిగించినట్టు అనిపించడం, చర్మం మీద దురద, దద్దుర్లు వంటివి రావడం, ముఖం నాలుక పెదవులు గొంతు వంటివి ఉబ్బడం ,శరీరంలో కూడా వాపు రావడం, తల తిరుగుతున్నట్టు అనిపించడం వంటివన్నీ కూడా ఆహార అలర్జీకి కారణాలే. కొన్ని రకాలు ప్రాణాంతక అలెర్జీ ప్రాణాంతకంగా మారుతాయి. కాబట్టి వీటిని తేలిగ్గా తీసుకోరాదు. మీకు ఏ ఆహారం పడడం లేదో, ఏ ఆహారం తినడం వల్ల అలెర్జీ వస్తుందో తెలుసుకుంటే దానికి దూరంగా ఉండడం మంచిది.