E-Paper
Advertisement

OTT Movie : మైండ్ డిస్టర్బింగ్ టీనేజర్స్ మూవీ.. స్టూడెంట్స్ మస్ట్ వాచ్

OTT Movie : మైండ్ డిస్టర్బింగ్ టీనేజర్స్ మూవీ.. స్టూడెంట్స్ మస్ట్ వాచ్
Advertisement

OTT Movie : రోజు రోజుకూ ఓటిటిల సంఖ్య పెరుగుతుంది. ఇక ఇప్పటికే అందుబాటులో ఉన్న పలు ఓటిటిలలో ఉన్న సినిమాల సంఖ్యను లెక్కబెట్టడం చాలా కష్టం. ఎమోషన్, యాక్షన్, డ్రామా, హారర్ ఇలా ఒక్కో జానర్లో కొన్ని వేల సినిమాలు ఉన్నాయి. కానీ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకునే సినిమాల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఈరోజు మన మూవీ సజెషన్ ఇలాంటి ఓ మంచి వెబ్ సిరీస్ గురించే. మరి ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటి? ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది? అనే వివరాల్లోకి వెళితే…

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

Advertisement

కొన్ని సిరీస్ లను చూడడం మొదలు పెడితే కంప్లీట్ అయ్యేదాకా పక్కకు కూడా జరగాలి అనిపించదు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న వెబ్ సిరీస్ కూడా అలాంటిదే. ముఖ్యంగా ఈ సిరీస్ ను చూస్తున్నంత సేపు టీనేజర్స్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియడంతో పాటు సినిమా అంతా ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా స్టోరీ ఈ మూవీకి ఆయువుపట్టు లాంటిది. ఇక చదువుకునే పిల్లల మధ్య ఉండే తారతమ్యాల గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. రిచ్, పూర్ అనే అంశాలు అపుడప్పుడే ఎదురుతున్న టీనేజర్స్ మదిలో ఎప్పటికీ మరిచిపోలేని గాయాన్ని చేస్తాయి. సాధారణంగా టీనేజర్స్ మూవీ అనగానే లవ్ స్టోరీ, రొమాన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒకవేళ అలా ఎక్స్పెక్ట్ చేసి దీన్ని చదువుతున్నట్లయితే మీరు తప్పులో కాలేసినట్టే. ఇదొక మోస్ట్ వైలెంట్ మూవీ. దీన్ని చూస్తే బుర్ర పాడవడం ఖాయం. అయితే ఈ సిరీస్ మిమ్మల్ని పూర్తయ్యేదాకా లేవనివ్వదు అనేది మాత్రం నిజం.

Class Web Series Online on Netflix: Cast | Release Date - NewZNew

Advertisement

స్టోరీలోకి వెళ్తే…

ఈ సిరీస్ మొత్తం ఒక ఇంటర్నేషనల్ స్కూల్, అక్కడ జరిగే పరిస్థితుల చుట్టూ తిరుగుతుంది. సాధారణంగానే ఉన్న దాంట్లో బాగా బ్రతికితే మంచిది అని చెప్తారు పెద్దలు. కానీ కొంతమంది మాత్రం అత్యాశతో డబ్బు వెనకాల పరుగులు పెట్టి జీవితాలను నాశనం చేసుకుంటారు. అలా అత్యాశ కొద్దీ అనర్ధాలు తెచ్చుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈ సిరీస్లో బాగా చూపించారు మేకర్స్. స్టోరీ విషయానికొస్తే ముగ్గురు విద్యార్థులు ఢిల్లీలోనే అత్యంత ధనిక స్కూల్లో స్కాలర్షిప్ ద్వారా సీటు దక్కించుకుంటారు. కానీ తీరా అక్కడికి వెళ్ళాక వాళ్ళు కన్న కలలన్నీ కల్లలుగానే మిగిలిపోతాయి. పరిస్థితి ఎంత దారుణంగా మారుతుంది అంటే ఆ స్కూల్లో ఉండే పిల్లలు ఎవ్వరూ ఈ ముగ్గురితో మాట్లాడరు. ఈ ముగ్గురిని పశువుల కన్నా హీనంగా చూస్తారు. ప్రతి విషయంలో ఏడిపించడమే కాకుండా అందరూ దూరం పెడతారు. దీంతో ఆ విద్యార్థులు ఆ రిచ్ కిడ్స్ లాగే మారాలని ట్రై చేస్తారు. కానీ పరిస్థితి ఇంకా చేజారిపోతుంది. ఆ తర్వాత ఈ ముగ్గురి జీవితాల్లోకి ఓ అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. నెక్స్ట్ వెబ్ సిరీస్ ఎలాంటి మలుపు తిరిగింది? అసలు ఆ అమ్మాయి ఎవరు అనే విషయం తెలియాలంటే క్లాస్ అనే ఈ సిరీస్ ని చూడాల్సిందే.

Tags

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×