E-Paper
Advertisement

OTT Movie : కారును బహుమతిగా ఇచ్చి భార్యను కోరే బిజినెస్ మ్యాన్… దిమ్మతిరిగే బోల్డ్ మూవీ

OTT Movie : కారును బహుమతిగా ఇచ్చి భార్యను కోరే బిజినెస్ మ్యాన్… దిమ్మతిరిగే బోల్డ్ మూవీ
Advertisement

OTT Movie : ఓటిటిలో హర్రర్ సినిమాలకు ఎంతటి క్రేజ్ ఉంటుందో అంతకంటే ఎక్కువగానే బో*ల్డ్ సినిమాలకు ఆదరణ పెరుగుతుంది.  ఇలాంటి సినిమాలను ఇష్టపడే వారి కోసమే ఈ మూవీ సజెషన్. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ అద్భుతమైన బో*ల్డ్ సినిమా 9 ఏళ్ల క్రితమే రిలీజ్ అయింది. అయితే క్లైమాక్స్ మాత్రం మనసును పిండేసేలా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో మొదట్లో విలన్ గా కనిపించిన వ్యక్తి క్లైమాక్స్ లో హీరోగా కనిపిస్తాడు. ఇక టైటిల్ లో చెప్పుకున్న విధంగానే సినిమా స్టోరీ మొత్తం బో*ల్డ్ గా సాగుతుంది.. మరి ఈ బో*ల్డ్ లవ్ స్టోరీ ఏంటి? అనే విషయంలోకి వెళ్తే…

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో…

Advertisement

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 2017 లో రిలీజ్ అయ్యి టాక్  ఆఫ్ ది టౌన్ అయింది. ముఖ్యంగా సినిమాలో ఉన్న సస్పెన్స్ తో పాటు ఉత్కంఠ భరతమైన సన్నివేశాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ హిందీ సినిమా పేరు ‘హేట్ స్టోరీ 3‘. విశాల్ పాండ్యా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 2015 డిసెంబర్ నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాలో శర్మన్ జోషి, కరణ్ సింగ్ గ్రోవర్, జరీన్ ఖాన్ లీడ్ రూల్స్ లో కనిపించారు. ఇక ఈ సినిమాను నిర్మించడానికి 20 కోట్లు ఖర్చు చేస్తే ప్రపంచవ్యాప్తంగా 62.12 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది ఈ మూవీ. ఇక థియేటర్లలో రిలీజ్ అయిన 9 ఏళ్ల తర్వాత ఈ సినిమా ఓటిటిలోకి స్ట్రీమింగ్ కి రావడం విశేషం. అయితే ఈ సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా మాత్రం కాదని గుర్తుపెట్టుకోండి. చాలావరకు ఇంటిమేట్ సీన్స్ ఉండే ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

కథలోకి వెళ్తే…

Advertisement

సినిమా మొత్తం ఆదిత్య దేవాన్ అనే వ్యాపారవేత్త, అతని భార్య సియా దివాన్, మరో వ్యాపారవేత్త సౌరవ్ చుట్టూ తిరుగుతుంది. ఈ భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉంటారు. అయితే ఓ రోజు సౌరవ్ ఆదిత్య కు ఖరీదైన కారును బహుమతిగా ఇస్తాడు. ఈ జంటను డిన్నర్ కి ఆహ్వానించి, కలలో కూడా ఊహించని షాకింగ్ డీల్ భార్యాభర్తల ముందు పెడతాడు. కడుపునిండా తిని తాగాక అతనికి పెద్ద మొత్తంలో డబ్బులు ఆఫర్ చేస్తాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే అతని వైఫ్ సియా ఒక రాత్రి మొత్తం తనతో గడపాలి. ఈ షరతు విన్నాక ఆదిత్యకు విపరీతంగా కోపం వస్తుంది. ఇక ఆ తర్వాత సౌరవ్ ఆదిత్యను నాశనం చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఆదిత్యకు మాత్రం అసలు సౌరవ్ తనతో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అర్థం కాదు. అయితే సినిమా చివర్లో వచ్చే ట్విస్ట్ మాత్రం దిమ్మ తిరిగేలా ఉంటుంది. సౌరవ్ పెట్టిన ఇబ్బందులకు తలొగ్గి చివరకు ఆదిత్య ఆ డీల్ కు ఒప్పుకున్నాడా ? అనే విషయం తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×