E-Paper
Advertisement

OTT Movie : అషు రెడ్డి బో*ల్డ్ మూవీ… అందమైన అమ్మాయిల్ని టార్గెట్ చేసే సైకో కిల్లర్

OTT Movie : అషు రెడ్డి బో*ల్డ్ మూవీ… అందమైన అమ్మాయిల్ని టార్గెట్ చేసే సైకో కిల్లర్
Advertisement

OTT Movie : అషు రెడ్డి అనగానే ఆమె చిక్కుకున్న కొన్ని బో*ల్డ్ కాంట్రవర్సీలు గుర్తొస్తాయి. నిజానికి బిగ్ బాస్ వల్ల అషు రెడ్డి మంచి పేరు తెచ్చుకుంది. కానీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన పనులు ఆమెను మరింత పాపులర్ చేశాయి. అయితే ఈ బోల్డ్ బ్యూటీ నటించిన ఒక బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. పైగా రికార్డు స్థాయి న్యూస్ తో దూసుకెళ్తోంది. మరి ఆ సినిమా ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి…

Advertisement

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్. అంతేకాదు ఇందులో హీరోయిన్ అషూ రెడ్డి కాదు చాందిని చౌదరి. థియేటర్లలో రిలీజ్ అయిన నాలుగు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇందులో జై భరత్, వశిష్ట సింహ కీలకపాత్రల పోషించారు. ప్రకాష్ దంతలూరి దర్శకత్వం వహించగా, ఇందులో చాందిని చౌదరి పోలీస్ ఆఫీసర్ గా కనిపించింది. రెగ్యులర్ హీరోయిన్ గా కాకుండా భిన్నమైన క్యారెక్టర్ లో కనిపించి ఆకట్టుకుంది చాందిని చౌదరి. యంగ్ హీరో నవదీప్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన సైకలాజికల్ బోల్డ్ థ్రిల్లర్ ఈ సినిమా. ఈ మూవీ ఇప్పటికే ఆహా (Aha) ఓటీటీలో రిలీజ్ అయ్యి రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టుకుంది. థియేటర్లలో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన నాలుగు నెలల తర్వాత సన్ నెక్స్ట్ అనే ఓటిటిలో రిలీజ్ అయింది.

కథలోకి వెళ్తే…

Advertisement

సౌమ్య అని అమ్మాయికి ఎస్ఐ గా జాబ్ వస్తుంది. కానీ ఆమె అమ్మాయి కావడంతో చుట్టు పక్కల వారంతా కాస్త చిన్నచూపు చూస్తారు. ఎలాగైతేనేం జాబ్ కొట్టేసి వికారాబాద్ లో పోస్టింగ్ పట్టేస్తుంది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో పని చేసే అభి అనే మరో ఎస్ఐని సౌమ్య ప్రేమిస్తుంది. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీస్తుంది. కానీ అతనికి అప్పటికే పెళ్లవుతుంది. ఆయన భార్య అతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఈ నేపథ్యంలోనే సౌమ్య అతనికి నెమ్మదిగా దగ్గరవుతుంది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. ఈ క్రమంలో మరోవైపు యుగంధర్ అనే సైకో కిల్లర్ వికారాబాద్ ఏరియాలో హీరోల పేర్లతో అమ్మాయిలను ట్రాప్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్లను హత్య చేసి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న జనాలను భయభ్రాంతులకు గురి చేస్తాడు. ఆ సైకో కిల్లర్ ను పట్టుకునే ప్రయత్నంలో సౌమ్యకు అభి గురించిన ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అభికి సంబంధించిన ఆ నిజం ఏంటి? యుగంధర్, అభి కి మధ్య ఉన్న లింక్ ఏంటి? అభి భార్య ఏమైంది? అతనికి ఉన్న సమస్య ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ‘యేవమ్‘ (Yevam Movie) అనే ఈ సినిమాను చూడాల్సిందే.

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×