E-Paper
Advertisement

Parasakthi OTT: పరాశక్తి ఓటీటీ డీల్ క్లోజ్..శివ కార్తికేయన్ కెరియర్ లోనే భారీ డీల్!

Parasakthi OTT: పరాశక్తి ఓటీటీ డీల్ క్లోజ్..శివ కార్తికేయన్ కెరియర్ లోనే భారీ డీల్!
Advertisement

Parasakthi OTT: శివ కార్తికేయన్ (Siva Karthikeyan) ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి టీవీ యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ వరుస హిట్ సినిమాలను అందుకుంటున్న శివ కార్తికేయన్ త్వరలోనే పరాశక్తి(Parasakthi) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

జీ 5 చేతికి పరాశక్తి డిజిటల్ రైట్స్..

ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు అలాగే ఈ సినిమా ఓటీటీ బిజినెస్ కూడ పూర్తి చేసుకుందని తెలుస్తుంది. ఇప్పటివరకు శివ కార్తికేయన్ కెరియర్ లోనే ఎప్పుడూ లేనివిధంగా ఈ సినిమా డిజిటల్ హక్కులు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ 5 (Zee 5)ఏకంగా 52 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇప్పటివరకు శివ కార్తికేయన్ నటించిన ఏ సినిమాలకు కూడా ఈ స్థాయిలో డిజిటల్ రైట్స్ అమ్ముడు పోలేదనే చెప్పాలి. ఈ సినిమాకు ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర(Sudha Kongara) దర్శకత్వం వహించడం విశేషం.

హిందీ వ్యతిరేక ఉద్యమం…

Advertisement

ఇలా సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ నటిస్తున్నటువంటి మొట్టమొదటి సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా 1965లో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో జయం రవి, మోహన్, అధర్వ వంటి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో శివ కార్తికేయన్ కు జోడిగా నటి శ్రీ లీల (Sreeleela)నటించడం విశేషం ఈమెకు ఈ సినిమా తమిళ డెబ్యూ సినిమా అని చెప్పాలి. శ్రీ లీల ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో డజనుకు పైగా సినిమాలలో నటించారు. అయితే ఈమె నటించిన సినిమాలు ఇటీవల కాలంలో ప్రేక్షకులను పూర్తిగా నిరాశ పరుస్తున్నాయి.

తమిళ డెబ్యూ సినిమా..

Advertisement

ఇలా తెలుగులో వరుస సినిమాలలో అవకాశాలు వచ్చిన సక్సెస్ అందుకొని శ్రీ లీల ఇప్పుడు తమిళ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారనే విషయం తెలియడంతో సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీ లీల మంచి సక్సెస్ అందుకుంటుందని అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీ లీలకు పరాశక్తి ఎలాంటి సక్సెస్ అందిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇక ఈమె తమిళ సినిమాలతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

Also Read: Upasana: మరో గౌరవాన్ని అందుకున్న మెగా కోడలు ఉపాసన..పోస్ట్ వైరల్!

Related News

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×