Bigg Boss 9 Telugu Promo : బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ మరికొద్ది రోజుల్లో శుభం కార్డు వేసుకోబోతుంది. ఈ క్రమంలో ఈ షో పై రోజు రోజుకి జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం హౌస్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు. వీరిలో ఫైనల్ కి చేరుకునేది ఎవరు అన్నది జనాల్లో మెదులుతున్న ప్రశ్న. కేవలం ఐదుగురు మాత్రమే హౌస్ లో ఉండడంతో బిగ్ బాస్ వారికి కష్టమైన టాస్కులను ఇచ్చి జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 14వ వారం డబల్ ఎలిమినేషన్ తర్వాత ఈ వారం టాప్ ఫైవ్ లో ఎవరు ఫైనల్ వరకు చేరుకుంటారు అన్నది సస్పెన్స్ గా మారింది. తాజాగా ఇవాళ ఎపిసోడ్ ప్రోమో ని బిగ్ బాస్ రిలీజ్ చేశాడు. ఆ ప్రోమో ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం..
తాజాగా మంగళవారం ఎపిసోడ్ ప్రోమో ని బిగ్ బాస్ రిలీజ్ చేశాడు.. ఆ ప్రోమోలో బిగ్ బాస్ కంటెస్టెంట్లకు వన్స్ మోర్ అంటూ చెబుతాడు. ఇవాళ మీకోసం ఒక టాస్క్ ని తీసుకొచ్చాను అని అంటాడు. సేవ్ ఇట్ ద విన్ ఇట్ టాస్క్ ను ఇస్తాడు. ఈ టాస్క్ ని లాస్ట్ టైం ఇచ్చాను కదా అప్పుడు మీకు తెలివిని ప్రదర్శించి బాగా ఆడారు కదా అని బిగ్ బాస్ అంటాడు. ఆ మాట వినగానే అందరూ నవ్వుకుంటారు.. ఈ టాస్క్ లో ఎవరు జంటల్ గా ఉంటారు ఎవరు సంచాలకుగా ఉంటారో నిర్ణయించుకోవాలని అంటాడు. లాస్ట్ టైం లాగా మీరు తెలివిని ప్రదర్శించాలని అనుకుంటే మాత్రం శిక్షలు తప్పవు అని వార్నింగ్ ఇచ్చేస్తాడు. దానికి డిమాన్ తెలివితేటలు ఎప్పుడో పోయాయి బిగ్ బాస్ అని ఫన్నీగా అంటాడు. ఫైనల్ గా ఆ గేమ్ ను ఆడేందుకు అందరూ సిద్ధపడతారు..
Also Read :బాలీవుడ్ కోలీవుడ్ ముందు చతికిలపడ్డ టాలీవుడ్… పరువు తీసారు కదరా..
ఇప్పటివరకు డిమాన్ రెండు స్టార్లు గెలుచుకుంటాడు. ఇమాన్యుయల్ ఒక స్టార్ని గెలుచుకుంటాడు. ఈ గేమ్ మేము ఆడతాము నీకు ఆల్రెడీ రెండు స్టార్లు ఉన్నాయి కదా నువ్వు సంచాలకుగా ఉండమని చెప్తారు. వాళ్లు గెలిస్తే వాళ్లకి చెరొక స్టార్ వస్తుంది నీకు ప్రాబ్లం లేదు కదా అని ఇమ్ము అంటాడు. కానీ పవన్ మాత్రం నువ్వు గెలిస్తే నీకు రెండు స్టార్లు వస్తాయి అదే కదా నా ప్రాబ్లం అని అంటాడు.. కాసేపు ఈ డిస్కషన్ తర్వాత మొత్తానికి పవన్ సంచాలక్ గా ఉంటాడు.. ఇమ్ము, సంజన ఒక టీమ్ గా, కళ్యాణ్, తనూజ ఒక టీమ్ గా టాస్క్ ను పూర్తి చేస్తారు.. అయితే బెలూన్ పగల్లేదు అంటూ ఇమ్మూ, తనూజా ఇద్దరు వాదనకు దిగుతారు.. సరే నువ్వు ఏదైన అనుకో అని ఇమ్మూ అంటాడు.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. మరి ఈ టాస్క్ లో ఎవరు విన్నర్ గా నిలిచారు అన్నది ఇవాళ ఎపిసోడ్లో తెలియనుంది. అసలు మిస్ అవ్వకుండా ఎపిసోడ్ ని చూసేయండి..