E-Paper
Advertisement

ప్రదీప్ రంగనాథన్ సైన్స్ ఫిక్షన్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ప్రదీప్ రంగనాథన్ సైన్స్ ఫిక్షన్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Advertisement

LIK Movie: లవ్ స్టోరీ , డ్యూడ్ వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రదీప్ రంగనాథన్ తాజాగా నటించిన చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(LIK )..యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ సినిమా ఓటీటీ పార్టనర్ ఎవరు? ఎప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వస్తుంది? అనే విషయాలు హాట్ టాపిక్ గా మారాయి.

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. ఓటీటీ పార్టనర్ ఫిక్స్..

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకుంది.. ఇక నేడు థియేటర్లలోకి వచ్చిన నేపథ్యంలో సాధారణ నాలుగు వారాల థియేటర్ రన్ తర్వాత 2026 మే రెండవ వారంలో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఇకపోతే త్వరలోనే దీనిపై అధికారిక తేదీని కూడా ప్రకటించనున్నారు. ఏది ఏమైనా థియేటర్లలో ఇప్పుడు సందడి చేస్తున్న ఈ సినిమా అటు ఓటీటీలో ఎలాంటి టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Advertisement

also read:హైకోర్టులో మోహన్ బాబుకు భారీ ఊరట!

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా స్టోరీ..

కథ విషయానికి వస్తే.. ఈ సినిమా కథ 2040వ సంవత్సరంలో సాగుతుంది. ఆ కాలంలో ప్రేమలో విఫలమైతే కలిగే నష్టాన్ని భర్తీ చేయడానికి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే ఒక సంస్థ ఉంటుంది.. ఈ కంపెనీకి సీఈఓ ఎస్. జే.సూర్య. ఒక యాప్ ద్వారా యువత ప్రేమ వ్యవహారాలను నియంత్రిస్తూ ఉంటాడు. ఇందులో హీరో ప్రదీప్ రంగనాథన్, తన ప్రేయసి కృతి శెట్టిని దక్కించుకోవడానికి ఈ టెక్నాలజీ ప్రపంచంలో ఎదుర్కొన్న సవాళ్లు.. ఆ క్రమంలో వచ్చే కామెడీ సన్నివేశాల మేళవింపుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇకపోతే ప్రదీప్ తన మునుపటి చిత్రం లవ్ టుడే తరహా లోనే ఈ సినిమాలో కూడా తన బాడీ లాంగ్వేజ్ తో, కామెడీ టైమింగ్ తో అందరినీ మెప్పించారు.

Advertisement

ఎమోషనల్ సీన్స్ లో తన టాలెంట్ ప్రదర్శించాడు.. అటు హీరోయిన్ ధీమా అనే పాత్రలో కృతి శెట్టి చాలా అందంగా కనిపిస్తూనే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో మెప్పించింది. ఇక ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ ఎస్.జే.సూర్య. ఆయన తన నటన మేనరిజమ్స్ తో థియేటర్లలో నవ్వులు పూయించారు. ఇకపోతే ఈ చిత్రానికి కొత్త పాయింట్, ప్రదీప్ -సూర్యల మధ్య కామెడీ , అనిరుద్ మ్యూజిక్, హై క్వాలిటీ విజువల్స్ అన్ని బాగా కలిసొచ్చాయి.. నేటితరం యువతకు, కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా ఒక మంచి ట్రీట్ అని చెప్పవచ్చు.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×