E-Paper
Advertisement

Psycho Thriller OTT : కొత్తగా పెళ్ళైన జంటను టార్గెట్ చేసి చంపే సైకో… హనీమూన్ కు వెళ్ళే వాళ్ళు మిస్ అవ్వకుండా చూడాల్సిన సైకో థ్రిల్లర్

Psycho Thriller OTT : కొత్తగా పెళ్ళైన జంటను టార్గెట్ చేసి చంపే సైకో… హనీమూన్ కు వెళ్ళే వాళ్ళు మిస్ అవ్వకుండా చూడాల్సిన సైకో థ్రిల్లర్
Advertisement

Psycho Thriller OTT : సైకో థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ హాలీవుడ్. ఈ జానర్లో ఇండియన్ సినిమా ఇప్పుడిప్పుడే వేగంగా అడుగులు వేస్తోంది. ఇంగ్షీషు సూపర్ హీరోల సినిమాలంటే ఎంత పిచ్చో, సైకో థ్రిల్లర్స్ ను కూడా అదే రేంజ్ లో చూస్తూ ఉంటారు కొందరు. అలాంటి క్రేజీ మూవీ లవర్స్ కోసం మరో ఇంట్రెస్టింగ్ మూవీని తీసుకొచ్చాము. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? కథ ఏంటి? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

డేవిడ్ టూహై దర్శకత్వం వహించిన థ్రిల్లింగ్ సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్ A Perfect Getaway (2009). హవాయి అందాల మధ్య సాగే ఈ సినిమాలో అప్పటిదాకా కనిపించిన స్వర్గం ఒక్కసారిగా నరకంగా మారిపోతుంది. ఇందులో మిల్లా జోవోవిచ్, స్టీవ్ జాన్, టిమోతీ ఓలిఫాంట్, కీలే సాంచెజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఊహించని ట్విస్టులు, సస్పెన్స్ తో నిండిన ఈ మూవీ థ్రిల్లర్ ఫ్యాన్స్‌కి బెస్ట్ చాయిస్. IMDbలో 6.5 రేటింగ్ ఉన్న ఈ మూవీ సాధారణ సైకో థ్రిల్లర్ కంటే స్మార్ట్‌గా ఉంటుంది. కానీ లాస్ట్‌లో వయోలెంట్ గా మారుతుంది. ఇండియాలో ఈ మూవీ Amazon Prime Videoలో అందుబాటులో ఉంది. అయితే ఈ మూవీ కేవలం రెంట్ లేదా బై ఆప్షన్ లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. థ్రిల్లర్ అండ్ సర్వైవల్ మూవీస్ ఇష్టపడేవాళ్లు హవాయి అందాలు చూస్తూ, ఇందులోని టెన్షన్ ను కూడా ఎంజాయ్ చేయండి మావా.

Advertisement

Read Also : మిడిల్ క్లాస్ కష్టాలతో తెరకెక్కిన మరో మూవీ… ఓటీటీలోకి వచ్చేసిన తమిళ ఫ్యామిలీ కామెడీ డ్రామా

స్టోరీలోకి వెళ్తే…

కొత్తగా పెళ్ళయిన జంట క్లిఫ్ (టిమోతీ ఓలిఫాంట్), సిడ్నీ (మిల్లా జోవోవిచ్). హనీమూన్ కోసం హవాయి ఐలాండ్స్‌ కి వెళ్తారు. ఎక్కడో దూరంగా ఉన్న అందమైన బీచ్‌ కి బ్యాక్‌ ప్యాక్ లతో ట్రెక్కింగ్ చేయడానికి వెళతారు. అలా వెళ్తుండగా, మధ్యలోనే కాలే – క్లియో (క్రిస్ హెమ్స్‌వర్త్ – మార్లే షెల్టన్) అనే మరో ఇద్దరు హైకర్స్, నిక్ – గినా (స్టీవ్ జాన్ – కీలే సాంచెజ్) అనే వైల్డ్ కపుల్‌ను కూడా కలుస్తారు. ఇక అందరూ ఒకే బ్యాచ్ కాబట్టి కలిసి వెళతారు. ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలోనే హవాయిలో రీసెంట్ గా జరిగిన డబుల్ మర్డర్ గురించిన వార్తను వింటారు. కిల్లర్స్ ఒక మగ – ఆడ జంట అని, ఇంకా ఐలాండ్‌లోనే ఉన్నారని తెలుసుకుంటారు. కానీ ఆ ఏరియాలో సిగ్నల్ ఉండదు. పైగా హెల్ప్ అందడం కష్టం. దీంతో గ్రూప్‌లో ఎవరైనా కిల్లర్స్‌ ఉన్నారేమో అనే అనుమానంతో కాలే అగ్రెసివ్‌గా ఉంటాడు. నిక్ కు మిలటరీ బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది. మొదటి సగం స్లో బిల్డప్‌తో సస్పెన్స్ ఫుల్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో ట్విస్టులు, యాక్షన్, సర్వైవల్ చేజ్‌లు స్టార్ట్ అవుతాయి. ఆ జంటలలో ఎవరు కిల్లర్స్? ఎవరు సేఫ్? అనేది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

ఏడుగురు ఆవారాగాళ్ల కథ… షార్ట్ కట్ లో కోటీశ్వరులు అవ్వాలనుకునే కామెడీ డ్రామా

‘ది ఒడిస్సీ’ డైరెక్టర్ మాస్టర్ పీస్ మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

Big Stories

Advertisement
×