E-Paper
Advertisement

40 ఏళ్ల అత్త 15 ఏళ్ల మేనల్లుడితో… ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ డ్రామా

40 ఏళ్ల అత్త 15 ఏళ్ల మేనల్లుడితో… ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ డ్రామా
Advertisement

Psychological Drama OTT : లవ్ స్టోరీ లు ఓటీటీలో బోలెడు ఉన్నాయి. అయితే కొన్ని మాత్రం వివాదాలతో అందరి కంట్లో పడుతుంటాయి. అలాంటి మూవీ గురించే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇది ఒక సీరియస్ ఎమోషనల్ డ్రామా. సన్యాసిని కావాలనుకునే 40 ఏళ్ల మహిళకు, 15 ఏళ్ల తన మేనల్లుడి మీద ప్రేమ పుడుతుంది. ఈ నేపథ్యంలో కథ ఆసక్తిగా సాగుతుంది. అయితే ఇందులో కొన్ని బాత్ సీన్స్, అది కూడా నన్ తో చేపించడంతో ఇది వివాదాల్లో చిక్కుకుంది. ఇది కొంచెం సున్నితమైన కంటెంట్ కాబట్టి, ఒంటరిగా చూడటమే మంచిది.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ 

ఈ సైకలాజికల్ డ్రామా మూవీ పేరు ‘ది లాస్ట్ బాత్’ (The Last Bath). ఇందులో అనబెలా మోరెరా (జోసెఫినా), మార్టిమ్ కానవారో (అలెగ్జాండ్రే) ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో అనబెలా మోరెరా తన పాత్రను చాలా గొప్పగా పండించారు. ఒక పక్క సన్యాసినిగా ఉండాలనుకుంటూ, మరోపక్క మేనల్లుడిపై కలిగే కోరికల మధ్య నలిగిపోయే మహిళగా ఆమె నటన సినిమాకే హైలైట్. టోక్యో, గోథెన్‌బర్గ్ వంటి ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైన ఈ సినిమా, వివాదాస్పద కథగానే కాకుండా, ఒక కళాఖండంగా గుర్తింపు పొందింది. ఈ సినిమా పోర్చుగీస్ అకాడమీ (Sophia Awards) లో ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాల్లో అవార్డులు కూడా గెలుచుకుంది. ఈ మూవీ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో రెంట్ కు అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

జోసెఫినా అనే 40 ఏళ్ల మహిళ ప్రపంచంతో సంబంధం లేదన్నట్టుగా, చర్చిలో సన్యాసినిగా మారిపోవాలని అనుకుంటుంది. అంతా సిద్ధం అనుకున్న టైమ్‌లో వాళ్ల నాన్న చనిపోవడంతో ఊరికి రావాల్సి వస్తుంది. అక్కడ తన 15 ఏళ్ల మేనల్లుడు అలెగ్జాండ్రే ఒంటరిగా కనిపిస్తాడు. అతన్ని తల్లి వదిలేసి వెళ్ళిపోవడంతో, ఇక చేసేదేం లేక ఆ పిల్లాడి బాధ్యతను ఈమె తీసుకుంటుంది. ఆ పిల్లాడికి లోకజ్ఞానం తక్కువ, ప్రతిదానికీ జోసెఫినా మీద ఆధారపడుతుంటాడు. కుర్రాడికి పనులు చేసి పెడుతూ, వాడితో సమయం గడుపుతున్న కొద్దీ జోసెఫినా మనసులో రకరకాల ఎమోషన్స్ మొదలవుతాయి. అటు సన్యాసినిగా, ఇటు మేనల్లుడి మీద పెరుగుతున్న అనుబంధం.. ఈ రెండిటి మధ్య ఆమె చాలా ఇబ్బంది పడుతుంది. ఒకే ఇంట్లో ఇద్దరే ఉండటం వల్ల ఇద్దరి మధ్య క్లోస్ పెరిగి, అది కాస్తా వింత పరిస్థితికి దారి తీస్తుంది. చివరికి ఆమె సన్యాసినిగా మారుతుందా ? లేక ఆ బంధానికి లొంగిపోయిందా? అనేదే ఈ సినిమా కథ.

Read Also : మాఫియాను ఏలే అనాథ… యాక్షన్ తో పాటు ఎమోషన్స్ ను ఇరగదీస్తున్న జపనీస్ థ్రిల్లర్

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×