E-Paper
Advertisement

Psychological Thriller OTT : నరకం లాంటి ఇంట్లో నలిగిపోయే అమ్మాయి… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

Psychological Thriller OTT : నరకం లాంటి ఇంట్లో నలిగిపోయే అమ్మాయి… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Psychological Thriller OTT : బుర్రకు పదును పెట్టే ట్విస్టులతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటాయి సైకలాజికల్ థ్రిల్లర్లు. ఇక ఓటీటీలలో ఇప్పటికే ఇలాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. అందుకే అందులో బెస్ట్ సినిమాలను వెతుక్కోవడం చాలా కష్టం. ఇలా అనుకునే వారి కోసమే ఈ మూవీ సజెషన్. మరి ఈ ఆసక్తికరమైన మూవీని ఎక్కడ వీక్షించవచ్చు ? దాని కథ ఏంటో తెలుసుకుందాం పదండి.

ఆపిల్ టీవీ ప్లస్ లో స్ట్రీమింగ్

ఫ్రీడా మెక్‌ఫాడెన్ నవల ఆధారంగా తెరకెక్కిన బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘ది హౌస్‌మెయిడ్’ (The Housemaid). 2025లో విడుదలైన ఈ మూవీకి ‘ఎ సింపుల్ ఫేవర్, ‘బ్రైడ్స్‌ మెయిడ్స్’ ఫేమ్ పాల్ ఫీగ్ దర్శకత్వం వహించారు. లయన్స్‌గేట్ ప్లే లో రిలీజ్ చేసిన ఈ మూవీలో సిడ్నీ స్వీనీ మిల్లీ కాలోవే అనే హౌస్‌ మెయిడ్ గా నటించింది. ఇంకా అమండా సీఫ్రైడ్, బ్రాండన్ స్క్లెనార్, మిచెల్ మొరోన్, ఎలిజబెత్ పెర్కిన్స్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Advertisement

2 గంటల 11 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ మూవీని 2025 డిసెంబర్ 19న థియేటర్లలో తీసుకొచ్చారు. బ్లాక్ బస్టర్ టాక్ తో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 135 మిలియన్ల కలెక్షన్స్ సంపాదించింది. ఇండియాలో ప్రస్తుతం ఈ మూవీ ఆపిల్ టీవీ+ (Apple TV+)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్ ఆడియోతో పాటు సబ్‌టైటిల్స్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఒకవేళ భాష అడ్డు కాదనుకుంటే వెంటనే మూవీపై ఒక లుక్కేయండి.

Read Also :  రిసార్ట్ లో 11 మందితో పార్టీ… రాత్రికి రాత్రే ఊహించని మర్డర్… ప్రతిక్షణం ఉత్కంఠ

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

సినిమా మొత్తం మిల్లీ (సిడ్నీ స్వీనీ) చుట్టూనే తిరిగేలా కథను అల్లారు డైరెక్టర్. క్రిమినల్ హిస్టరీ ఉన్న ఒక యంగ్ అమ్మాయి తన లైఫ్ లో ఫ్రెష్ స్టార్ట్ కోసం చూస్తుంది. జైల్లో నుంచి విడుదల అయ్యాక ఏదైనా మంచి జాబ్ లో చేరాలి అనుకుంటుంది. లేదంటే ఆమెను మళ్లీ జైలుకి పంపే ప్రమాదం ఉంది. జాబ్ కోసం ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలోనే రిచ్ కపుల్ నీనా (అమండా సీఫ్రైడ్), ఆండ్రూ విన్‌చెస్టర్ (బ్రాండన్ స్క్లెనార్) ఇంట్లో లైవ్-ఇన్ హౌస్‌ మెయిడ్ జాబ్ దొరుకుతుంది. అంటే ఆమె అక్కడే జాబ్ చేసి, అదే ఇంట్లో ఉంటుందన్నమాట.

ఒకరకంగా చెప్పాలంటే ఇది డ్రీం జాబ్. ఎందుకంటే రెంట్ కట్టే పని ఉండదు. ఫుడ్ ఫ్రీ, పైగా మంచి జీతం. అందుకే ఆమెకు మొదట ఈ జాబ్‌ బాగుంది అన్పిస్తుంది. ఇంకా ఆ రిచ్ కపుల్ చూడడానికి పర్ఫెక్ట్ అన్నట్టుగా ఉంటారు. కానీ నెమ్మదిగా ఆ ఇంటి బండారం హీరోయిన్ కు తెలుస్తుంది. మరి ఇంతకీ రిచ్ ఫ్యామిలీ పర్ఫెక్ట్ లైఫ్ వెనుక దాగి ఉన్న షాకింగ్ సీక్రెట్ ఏంటి ? అన్నది తెరపై చూడాల్సిందే.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×