E-Paper
Advertisement

Murder Mystery OTT : రిసార్ట్ లో 11 మందితో పార్టీ… రాత్రికి రాత్రే ఊహించని మర్డర్… ప్రతిక్షణం ఉత్కంఠ

Murder Mystery OTT : రిసార్ట్ లో 11 మందితో పార్టీ… రాత్రికి రాత్రే ఊహించని మర్డర్… ప్రతిక్షణం ఉత్కంఠ
Advertisement

Murder Mystery OTT : మర్డర్ మిస్టరీ… అందులోనూ మలయాళం మూవీ… మాలీవుడ్ సినిమాలంటే చెవి కోసుకునే ఓటీటీ మూవీ లవర్స్ కు ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. మలయాళ మూవీ ప్రేమికులతో పాటు థ్రిల్లర్ మూవీస్ ను ఇష్టపడే ఆడియన్స్ కు కూడా ఈ మూవీ పక్కా కిక్ ఇస్తుంది. మూవీని చూశాక ఖచ్చితంగా మీరే వర్త్ వాచింగ్ మావా అంటారు. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? కథ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం చెపుకోబోయే మూవీ మలయాళ సినిమాల్లో ఒక బెస్ట్ లాక్డ్ రూమ్ మిస్టరీ. ఈ మూవీ పేరు ’12th మ్యాన్’. 2022లో దృశ్యం ఫేమ్ దర్శకుడు జీతు జోసెఫ్ డైరెక్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. కేఆర్ కృష్ణకుమార్ దీనికి స్క్రిప్ట్ రాశారు. 2022 మే 20న డిస్నీ+ హాట్‌స్టార్ (ఇప్పుడు జియో హాట్‌స్టార్)లో డైరెక్ట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. 2 గంటల 43 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ మూవీ విమర్శకులను సైతం మెప్పించింది. ఓటీటీలో ఉన్న మలయాళ బెస్ట్ థ్రిల్లర్స్‌ లో ఇది కూడా ఒకటి.

Advertisement

మోహన్‌లాల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆంథోనీ పెరుంబావూర్ ఈ మూవీని నిర్మించారు. ఇందులో మెయిన్ లీడ్ మోహన్‌లాల్. ఆయన డాక్టర్ చంద్రశేఖర్ పాత్రలో నటించారు. ఉన్నీ ముకుందన్, శివదా నాయర్, అను సితార, రాహుల్ మాధవ్, చాందునాథ్, ప్రియాంక నాయర్, అదితి రవి, లీలా సంసన్, సుదీప్ కోషి తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. మొత్తం 11 మంది ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది.

Read Also :  ఉరుగ్వే ఫ్లైట్ 571 విషాదగాథ… ఒక్కో సీనుకూ వణికిపోవాల్సిందే మావా

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

మొత్తం 11 మంది ఫ్రెండ్స్ ఒక బ్యాచిలర్ పార్టీని ప్లాన్ చేస్తారు. అందుకోసం కేరళలోని మారుమూలన ఉన్న హిల్ స్టేషన్‌ లో ఒక రిసార్ట్‌ కి వెళ్తారు. వాళ్లలో ఒకరు 12వ వ్యక్తి మాత్రం పార్టీలో లేట్‌ గా జాయిన్ అవుతాడు. అతనే డాక్టర్ చంద్రశేఖర్ (మోహన్‌లాల్). పార్టీ స్టార్ట్ అయ్యాక అందరూ మాటల్లో పడతారు. పార్టీని ఎంజాయ్ చేస్తారు. అలా పార్టీ పీక్స్ లో ఉండగానే ఈ 11 మందిలో ఒకరు మిస్టీరియస్‌గా మర్డర్ కు గురవుతాడు. మొబైల్ నెట్‌ వర్క్ లేని ప్రాంతం కావడంతో ఎవ్వరినీ హెల్ప్ అడగలేరు. పైగా అక్కడ ఆ 12 మంది తప్ప ఎవ్వరూ లేరు.

చేసేదేం లేక చంద్రశేఖర్ స్వయంగా ఇంటరాగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆ 11 మంది ఫ్రెండ్స్‌లో కిల్లర్ ఎవరో కనుక్కోవడానికి ట్రై చేస్తాడు. అందులో భాగంగా ఒక్కొక్కరి బండారాలు, సీక్రెట్స్ బయట పడతాయి. అందరూ అనుమానితుల లిస్ట్ లో ఉంటారు. కిల్లర్ ఎవరు ? ఎందుకు చంపారు ? అన్న విషయాన్ని చివరి వరకూ ఊహించలేరు ఆడియన్స్. ఇక మోహన్ లాల్ ఫ్యాన్స్ కి ఇదొక గ్రిప్పింగ్ మస్ట్ వాచ్ ఇంటెన్స్ థ్రిల్లర్.

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×