Punjabi movies on OTT : పంజాబీ సినిమాలంటే ఒకప్పుడు కేవలం కామెడీ, యాక్షన్ మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలు, ఎమోషనల్ డ్రామాలు కూడా వస్తున్నాయి. అయితే సాధారణంగా పంజాబీ సినిమాలన్నీ ఒకే చోట దొరకడం కష్టం. కానీ చౌపాల్ అనే ఓటీటీ యాప్ ప్రత్యేకంగా పంజాబీ, హర్యానీ కంటెంట్ కోసం రూపొందించబడింది. ఇప్పుడు వచ్చిన సినిమాలన్నీ దాదాపు ఇందులో లభిస్తాయి. ఇవి కాకుండా Amazon Prime Video లో కూడా పంజాబీ సినిమాల కలెక్షన్ బాగానే ఉంది. మీకు పంజాబీ భాష రాకపోయినా, ఈ సినిమాలకు ఇంగ్లీష్, హిందీ సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్ గా ఓటీటీలో ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న పంజాబీ సినిమాలపై ఓ లుక్ వేద్దాం పదండి.
తండ్రీకూతుళ్ల మధ్య ఉండే స్వచ్ఛమైన అనుబంధాన్ని, ఒక తండ్రి తన కూతురి కలల కోసం పడే తపనను ఈ సినిమాలో చాలా హార్ట్ టచింగ్ గా చూపించారు. మనసుకు హత్తుకునే ఈ ఎమోషనల్ డ్రామాను మీరు చూడాలనుకుంటే, Chaupal ఓటీటీ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది 2026 ఫిబ్రవరి19 నుంచి నేరుగా స్ట్రీమింగ్ కి వచ్చింది. గ్రామీణ కథలను ఇష్టపడే వాళ్ళకి ఇది తప్పకుండా నచ్చుతుంది.
బిగ్ బాస్ ఫేమ్, పంజాబీ కత్రినా కైఫ్ గా పేరు తెచ్చుకున్న షెహనాజ్ గిల్ ఇందులో ప్రధాన పాత్రలో నటించింది. ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక అమ్మాయి తన జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా అధిగమించిందనే పాయింట్‌తో ఈ సినిమా సాగుతుంది. గత ఏడాది అక్టోబర్ లో వచ్చిన ఈ సినిమాను కూడా మీరు Chaupal ప్లాట్‌ఫామ్‌లో చూడవచ్చు. ఇది 2026 ఫిబ్రవరి 26 నుంచి అందుబాటులోకి వస్తుంది.
మీకు మ్యూజికల్ రొమాంటిక్ సినిమాలు ఇష్టమైతే ‘యమ్లా’ బెస్ట్ ఛాయిస్. 2025న నవంబర్ 28న ఈ పంజాబీ రొమాంటిక్ చిత్రం విడుదలైంది. ఈ సినిమా ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు రాజ్ వీర్ జవాండా నటించిన చివరి చిత్రం కావడం విశేషం. అతను ఈ సినిమా విడుదల కావడానికి కొద్దిరోజుల ముందే అక్టోబర్ 2025లో కన్నుమూశారు. అయితే ఈ సినిమా పాటలు, లవ్ స్టోరీ యూత్‌ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం 2026 ఫిబ్రవరి 12 నుంచి Chaupal, Amazon Prime Video లో అందుబాటులో ఉంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కోసం చూస్తున్న వారికి ఇది పర్ఫెక్ట్.
పేరు వినగానే హారర్ సినిమా అనుకోకండి, ఇది ఒక పీరియడ్ డ్రామా. పాతకాలపు గ్రామీణ వాతావరణం, అక్కడి మనుషుల ప్రవర్తన, ఒక బావి చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథనంతో ఈ సినిమా ఉంటుంది. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఈ నెల నుంచి Chaupal, Amazon Prime Video లో స్ట్రీమింగ్ కి వచ్చింది.
Read Also : మార్చిలో విడుదలయ్యే మోస్ట్ అవైటింగ్ తమిళ చిత్రాలు ఇవే