E-Paper
Advertisement

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న రాశీ ఖన్నా యాక్షన్ డ్రామా ‘లుక్కే’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న రాశీ ఖన్నా యాక్షన్ డ్రామా ‘లుక్కే’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Advertisement

Raashi Khanna: సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాశి కన్నా (Raashi Khanna)ఇటీవల కాలంలో కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. రాశిఖన్నా ఇప్పటికే ఫర్జీ, రుద్ర వంటి సిరీస్ లలో కనిపించిన ఈమె ఇప్పుడు మరో యాక్షన్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. రాపర్ కింగ్ నటుడిగా పరిచయమవుతున్నటువంటి తాజా సిరీస్ ‘లుక్కే’. (lukkhe)రాశి ఖన్నా, పాలక్ తివారి, శివాంకిత్ వంటి తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సిరీస్ మ్యూజికల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

డ్రగ్ సిండికేట్ నేపథ్యంలో లుక్కే..

హిమాంక్ గౌర్ (Himank Gaur)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ రాప్ కల్చర్, డ్రగ్ సిండికేట్ వంటి అంశాలతో తెరకెక్కినది. ఈ వెబ్ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో ప్రసారం చేయబోతున్నట్లు తాజాగా విడుదల తేదీని ప్రకటించారు. 8వ తేదీ నుంచి ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉండబోతోంది. తెలుగులో కూడా ఈ సిరీస్ విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటివరకు పలు సినిమాలలో నటించిన రాశి కన్నా తన నటనతో వెండితెరపై ప్రేక్షకులను మెప్పించారు. మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా బిజీగా గడుపుతున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అపజయాలు..

Advertisement

టాలీవుడ్ సినిమాల విషయానికి వస్తే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల పలు సినిమాలలో నటిస్తున్నప్పటికీ అనుకున్న స్థాయిలో పెద్దగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. ఈమె గత ఏడాది సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన తెలుసు కదా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నారు.

నిరాశపరిచిన ఉస్తాద్ భగత్ సింగ్..

Advertisement

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో ఈమె కీలకపాత్రలో నటించారు .ఈ సినిమాలో గ్లామర్ రోల్ చేసిన రాశి ఖన్నా ఈ సినిమా తన కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందని భావించారు కానీ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడమే కాకుండా రాశి కన్నా పాత్ర పై విమర్శలు కూడా వచ్చాయి. వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమెకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని చెప్పాలి. మరి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘లుక్కే’ సిరీస్ అయిన ఈ ముద్దుగుమ్మకు మంచి సక్సెస్ అందిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: రష్మిక పెళ్లి మేకప్ కోసం అంత సమయం పట్టిందా.. ఆ విషయంలో కండిషన్లు పెట్టిన నటి!

Related News

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

బ్రష్ కొనివ్వలేదని కొడుకుపై కేసు… నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే ఫ్యామిలీ ఎమోషన్

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×