BigTV English

Unstoppable Ram Charan Episode Part 2 : పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్.. ఓజీలో అకీరా అంటూ..!

Unstoppable Ram Charan Episode Part 2 : పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్.. ఓజీలో అకీరా అంటూ..!

Unstoppable Ram Charan Episode Part 2 :ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే సెలబ్రిటీలు ముఖ్యంగా స్టార్ హీరోలు ఒక హోదాకు చేరుకున్న తర్వాత.. వారి వారసులు యుక్త వయసుకి వస్తే మాత్రం హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు అని అభిమానులు తెగ గోల చేస్తారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు ,(Mahesh Babu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), బాలకృష్ణ(Balakrishna ) లను నిత్యం ఎక్కడికి వెళ్లినా ఇదే ప్రశ్నతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇక బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ (Mokshagna)ఎంట్రీ కోసం.. హనుమాన్ (Hanuman) డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) ను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇక మరొకవైపు అకీరా నందన్ (Akira Nandan) కోసం.. గేమ్ ఛేంజర్ (Game Changer) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎస్.జె.సూర్య(SJ Surya) మాట్లాడుతూ.. అకీరా ఓకే చెబితే వెంటనే ‘ఖుషి 2’ మొదలు పెట్టేస్తాను అంటూ తెలిపారు. అటు అకీరా నందన్ తల్లి రేణు దేశాయ్ (Renudesai) కూడా అకీరా హీరోగా ఎంట్రీ ఇవ్వడం కోసం తాను కూడా ఎదురు చూస్తున్నాను అంటూ తెలిపింది.


అకీరా ఎంట్రీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..

అయితే దీనికంటే ముందే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ఓజీ (OG) సినిమాతో అకీరా నందన్ ఎంట్రీ ఉంటుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ అభిమాన హీరో వారసుడి ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చెప్పండి అంటూ కోరుతున్నారు. అయితే ఎట్టకేలకు రామ్ చరణ్(Ram Charan) ఈ విషయాన్ని రివీల్ చేశారు. తాజాగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె కార్యక్రమానికి హాజరయ్యారు.


అకీరా నందన్ ఎంట్రీ పై రామ్ చరణ్ క్లారిటీ..

సీజన్ 4 9వ ఎపిసోడ్ కి రామ్ చరణ్ హాజరవడం జరిగింది. ఇకపోతే ఈ ఎపిసోడ్ ను రెండు పార్ట్ లుగా విడుదల చేసిన విషయం తెలిసిందే. మొదటి పార్ట్ సంక్రాంతికి ముందు విడుదల చేయగా.. ఇప్పుడు రెండో పార్ట్ ను విడుదల చేశారు. ఇక ఇందులో రామ్ చరణ్ అకీరానందన్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు.. “అకీరా నందన్ బాబాయ్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓ.జి సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు “అంటూ రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే రామ్ చరణ్ మాటలతో పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఇక త్వరలోనే తమ అభిమాన హీరో వారసుడు ఎంట్రీ ఉంటుందని, ఆయన నటన ఎలా ఉంటుందో చూడాలని కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా ఈ షోలో రామ్ చరణ్ తన తమ్ముడు ఎంట్రీ గురించి చెప్పి అందరినీ సంతోషపరిచారని చెప్పవచ్చు. ఇక మరొకవైపు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టి, తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూనే.. మరొకవైపు అభిమానుల కోసం తాను సంతకం చేసిన ఓజీ , హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను త్వరగా పూర్తి చేసే పనిలో పడ్డారు .

Related News

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

OTT Movie : గ్యాంగ్ స్టర్ గా సిల్వెస్టర్ స్టాలోన్… అల్టిమేట్ యాక్షన్ సీన్స్… యాక్షన్ ప్రియులకు పంగడే

OTT Movie : సూపర్ హీరోల బిడ్డను బలికోరే బ్రహ్మ రాక్షసి… కడుపులో ఉండగానే బీభత్సం… క్లైమాక్స్ డోంట్ మిస్

Sundarakanda OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన నారా రోహిత్‌ ‘సుందరకాండ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

Big Stories

×