Sitamanshu Kotak: టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్ కోసం అన్వేషణ ప్రారంభించిందంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల భారత జట్టు వరుస పరాజయాలు చవిచూడడంతో కోచింగ్ స్టాఫ్ పై బీసీసీఐ దృష్టి సారించింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కోచ్ స్థానానికి కొత్త మార్గదర్శకుడు అవసరమని నిర్ణయించిన బీసీసీఐ.. బ్యాటింగ్ కోచ్ గా సితాంశు కోటక్ పేరు ఖరారు అయినట్లుగా తెలుస్తోంది.
Also Read: Kireon Pollard: 900 సిక్సర్లు బాదిన పోలార్డ్.. గేల్ తర్వాత రెండో స్థానం !
సితాంశు కోటక్ ప్రస్తుతం ఇండియా – ఏ జట్టుకి హెడ్ కోచ్ గా ఉన్నారు. అంతేకాదు గతంలో ఈయన కోటక్ సౌరాష్ట్ర రంజి సారథిగా కూడా వ్యవహరించారు. 2023లో భారత పేస్ బౌలర్ బుమ్రా నాయకత్వంలో ఐర్లాండ్ లో టి-20 సిరీస్ ఆడిన భారత జట్టుకు కోటక్ హెడ్ కోచ్ గా వ్యవహరించారు. 52 ఏళ్ల సితాంశు కోటక్ దేశవాళీ క్రికెట్ లో ఘనమైన చరిత్రను కలిగి ఉన్నారు. 1992 నుండి 2013 వరకు దేశవాళీ క్రికెట్ కూడా ఆడారు. ఆ తర్వాత ఈయన కోచింగ్ వైపు వెళ్లారు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సితాంశు 130 మ్యాచ్ లు ఆడారు. అందులో 41.76 సగటుతో 8, 061 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు ఉండగా.. 55 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇక దేశవాళీ క్రికెట్ కి వీడ్కోలు పలికిన అనంతరం సితాంశు కోచింగ్ వైపు వెళ్ళాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కోచ్ గా చేశారు. గత నాలుగు సంవత్సరాల నుండి ఇండియా – ఏ టీమ్ కి బ్యాటింగ్ కోచ్ గా సేవలు అందిస్తున్నారు.
అయితే ఇప్పుడు టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్ ని ఎంపిక చేసేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తుండగా.. సితాంశుతో పాటు ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కూడా టీమిండియా బ్యాటింగ్ కోచ్ రేసులో ఉన్నట్లు సమాచారం. ఆయన తాజాగా భారత జట్టు బ్యాటింగ్ కోచ్ గా రావాలని ఉందని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎవరిని బ్యాటింగ్ కోచ్ గా ఎంపిక చేస్తుందనేది ఆసక్తిగా మారింది.
Also Read: BCCI Rules-Team India: టీమిండియా ప్లేయర్లకు 10 కొత్త రూల్స్ పెట్టిన BCCI..షూట్స్,VIP కోటా రద్దు !
టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. అసిస్టెంట్ కోచ్ లుగా భారత మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ తో పాటు టెన్ డెస్చెట్ ని ఎంచుకున్నాడు. మరోవైపు బౌలింగ్ కోచ్ గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్ని మోర్కల్ వ్యవహరిస్తున్నారు. అయితే గంభీర్ స్వతహాగా బ్యాటర్ కావడంతో ప్రత్యేకంగా బ్యాటింగ్ కోచ్ ని నియమించలేదు. కానీ ఇటీవల భారత జట్టు బ్యాటింగ్ పేలవంగా ఉండడంతో బ్యాటింగ్ కోచ్ ని నియమించాలని బీసీసీఐ డిసైడ్ కావడంతో ఈ నియామక ప్రక్రియని మొదలుపెట్టింది.
Sitanshu Kotak, a former Domestic Cricket stalwart and currently India-A Coach, is now considered to strengthen the support staff as the head Batting Coach. Final announcement is expected soon.#worlddais #BCCI #SitanshuKotak #TeamIndia #CricketTwitter #crickettraining… pic.twitter.com/A0rDydBYyF
— Dais World ® (@world_dais) January 16, 2025