E-Paper
Advertisement

Sci-fi Thriller OTT : రోబోలకు కోరికలు పుడితే… పిచ్చెక్కించే ట్విస్టులున్న సై-ఫై థ్రిల్లర్

Sci-fi Thriller OTT : రోబోలకు కోరికలు పుడితే… పిచ్చెక్కించే ట్విస్టులున్న సై-ఫై థ్రిల్లర్
Advertisement

Sci-fi Thriller OTT : సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఎంత క్రేజీగా ఉంటాయంటే, వాటిని చూస్తున్నంతసేపూ కంటిపై రెప్ప వాల్చకుండా ఊహాలోకంలో తెలిపోతూ ఉంటాము. ఎంగేజింగ్ స్టోరీ ఉండాలే గానీ సినిమాలలో ఇంతకు మించిన జానర్ ఉండదేమో అన్పిస్తుంది. మీరు కూడా సై -ఫై ఫిల్మ్ అంటే ఇంతే క్రేజీగా ఫీల్ అవుతారా ? అయితే ఈ మూవీ మీ కోసమే. మరి ఆ మూవీ పేరు, ఓటీటీ వంటి వివరాలు తెలుసుకుందాం పదండి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ థ్రిల్లర్ Ex Machina. అలెక్స్ గార్లాండ్ డైరెక్టోరియల్ డెబ్యూ మూవీ ఇది. అతను ’28 డేస్ లేటర్’, ‘సన్‌షైన్’ లాంటి పాపులర్ సినిమాలకు స్క్రిప్ట్స్ కూడా రాశాడు. 2014లో రిలీజ్ అయిన ‘ఎక్స్ మెషినా’ సినిమా 15 మిలియన్ డాలర్ల బడ్జెట్‌ తో రూపొందగా, 36.8 మిలియన్లు కలెక్ట్ చేసింది. ఆస్కార్ అవార్డ్స్ లో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో గెలిచింది ఈ మూవీ. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లేకి నామినేషన్ కూడా వచ్చింది. IMDbలో 7.7 రేటింగ్ ఉన్న ఈ మూవీ… ఇప్పటిదాకా ఏఐ థీమ్స్ తో వచ్చిన వరల్డ్స్ బెస్ట్ మూవీస్ లో ఒకటి. సై-ఫై, థ్రిల్లర్ ప్రేమికులు ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు. కాగా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : ది నైట్ మేనేజర్ సీజన్ 2 నుండి ది బాయ్స్ సీజన్ 5 వరకు… 2026లో మోస్ట్ అవైటింగ్ ప్రైమ్ వీడియో సిరీసులు

స్టోరీలోకి వెళ్తే…

కథ యంగ్ ప్రోగ్రామర్ కాలెబ్ స్మిత్ (డామ్నల్ గ్లీసన్) చుట్టూ సాగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ సెర్చ్ కంపెనీలో పని చేసే స్మిత్ కు… కంపెనీ సీఈఓ నాథన్ బేట్‌మాన్ (ఆస్కార్ ఐజాక్) నిర్వహించిన కాంటెస్ట్ గెలిచి, ఒక వీక్ అతని ప్రైవేట్ మౌంటైన్ ఎస్టేట్‌లో గడపడానికి అవకాశం వస్తుంది. నాథన్ ఒక రిక్లూసివ్ బిలియనీర్, బ్రిలియంట్ సైంటిస్ట్. అతని ఇల్లు మారుమూల ప్రాంతంలో ఉంటుంది. అయితే అది ఇంటిలా కాదు రీసెర్చ్ ఫెసిలిటీలా ఉంటుంది. కాలెబ్ అక్కడికి వెళ్లాకే తెలుస్తుంది ఇది సాధారణ వెకేషన్ కాదు అన్న షాకింగ్ విషయం. నాథన్ సృష్టించిన ప్రపంచంలోనే మొదటి ట్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ ఏవా (అలీషియా వికాండర్)ను ట్యూరింగ్ టెస్ట్ చేయమని స్మిత్ కు చెప్తాడు.

Advertisement

ఏవా ఒక అందమైన హ్యూమనాయిడ్ రోబోట్. అచ్చం మనుషుల్లా మాట్లాడుతుంది, భావాలు వ్యక్తం చేస్తుంది, స్పందిస్తుంది కూడా. కాలెబ్ రోజూ ఏవాతో సెషన్స్ నిర్వహిస్తూ, ఆమె స్వభావాన్ని టెస్ట్ చేయాలన్నది డ్యూటి. సెషన్స్ సాగుతున్న కొద్దీ కాలెబ్ ఏవాతో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడు. దీంతో ఏవా కూడా అతనికి దగ్గరై ప్రపంచాన్ని చూడాలని, స్వేచ్ఛ కావాలనె కోరికను అతని దగ్గర బయట పెడుతుంది. నాథన్ బిహేవియర్… అతని డ్రింకింగ్, నేచర్, ఇంట్లోని సర్వెంట్ క్యోకో (సోనోయా మిజునో)తో ప్రవర్తన చూసిన కాలెబ్‌ కు కొత్త అనుమానాలు తలెత్తుతాయి. నాథన్ నిజంగా ఏమైనా దాచిపెడుతున్నాడా? ఏవా నిజంగా కాన్షియస్‌నెస్ కలిగిన AIనా లేక ప్రోగ్రామ్డ్ మానిప్యులేషనా? అన్నది తెలియాలంటే మూవీని చూడాల్సిందే.

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×