E-Paper
Advertisement

Prime Video Upcoming releases 2026 : ది నైట్ మేనేజర్ సీజన్ 2 నుండి ది బాయ్స్ సీజన్ 5 వరకు… 2026లో మోస్ట్ అవైటింగ్ ప్రైమ్ వీడియో సిరీసులు

Prime Video Upcoming releases 2026 : ది నైట్ మేనేజర్ సీజన్ 2 నుండి ది బాయ్స్ సీజన్ 5 వరకు… 2026లో మోస్ట్ అవైటింగ్ ప్రైమ్ వీడియో సిరీసులు
Advertisement

Prime Video Upcoming releases 2026 : న్యూ ఇయర్ వచ్చేసింది. దానికి తగ్గట్టే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ Amazon Prime Video 2026లో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. థ్రిల్లర్స్ నుంచి యాక్షన్, రియాలిటీ షోలు ఒకటేమిటి అన్నీ ఉన్నాయి. వచ్చే ఏడాది ఈ ఓటీటీ అప్ కమింగ్ లిస్ట్ లో. మరి ఆ సిరీస్ లు, సినిమాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Beast Games Season 2

జనవరి 7న మిస్టర్ బీస్ట్ మళ్లీ రాబోతున్నాడు. సీజన్ 2లో 200 మంది కంటెస్టెంట్స్ 5 మిలియన్ డాలర్ల ప్రైజ్ కోసం ఎక్స్‌ట్రీమ్ చాలెంజెస్‌లో పోటీ పడతారు. స్పెషల్ సర్వైవర్ క్రాస్‌ఓవర్ కూడా ఉంది. మొదటి మూడు ఎపిసోడ్స్ జనవరి 7నే స్ట్రీమింగ్ కానున్నాయి. తర్వాత వీక్లీ రిలీజ్ లు ఉంటాయి. బ్యాక్‌స్టాబ్స్, హై-స్టేక్స్ స్టంట్స్ తో ఫుల్ ఎక్సైట్‌మెంట్ తో సాగుతుంది ఈ షో.

The Night Manager Season 2

Advertisement

బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘ది నైట్ మేనేజర్’ సీక్వెల్ ఎట్టకేలకు స్ట్రీమింగ్ కు సిద్ధం అవుతోంది. జనవరి 11న సెకండ్ సీజన్ స్ట్రీమింగ్ కానుంది. టామ్ హిడ్లెస్టన్ (జోనాథన్ పైన్) 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ స్పై యాక్షన్‌లో కన్పించబోతున్నారు. సౌత్ అమెరికాలో కొలంబియన్ ఆర్మ్స్ డీలర్‌ ను ఎదుర్కొని, డెడ్లీ ప్లాట్‌ను అన్‌కవర్ చేయబోతున్నాడు. అల్టిమేట్ యాక్షన్ సీన్స్ తో దుమ్మురేపే ఈ సిరీస్ ను డోంట్ మిస్.

120 Bahadur

ఫర్హాన్ అక్తర్ ప్యాట్రియాటిక్ యాక్షన్ డ్రామా ‘120 బహదూర్’. 1962 సైనో-ఇండియన్ వార్‌లో రెజాంగ్ లా బ్యాటిల్ ట్రూ స్టోరీని ఈ సినిమాలో చూడవచ్చు. మేజర్ షైతాన్ సింగ్, 120 మంది సైనికులు వేల మంది చైనా ట్రూప్స్‌తో పోరాడిన గొప్ప కథ ఇది. థియేటర్స్‌లో రూ.23.60 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు జనవరి 16 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

Steal

Advertisement

‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫేమ్ సోఫీ టర్నర్ హీస్ట్ థ్రిల్లర్ సీరీస్ ‘స్టీల్’. వయోలెంట్ గ్యాంగ్ పెన్షన్ ఫండ్ ఫర్మ్‌ను ఆక్యుపై చేసి, జారా అండ్ లూక్‌ను డిమాండ్స్ నెరవేర్చమని ఒత్తిడి తీసుకొస్తుంది. కోట్లలో డబ్బును కొల్లగొట్టే ఈ మనీ హీస్ట్ థ్రిల్లర్ తో కిక్కు గ్యారంటీ.

Young Sherlock

‘యంగ్ షెర్లాక్ హోమ్స్’ ఆడియన్స్ ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటింగ్ 2026 సిరీస్. ‘ఆఫ్టర్’ మూవీ ఫ్రాంచైజ్ (2019-2023)తో పాపులర్ అయిన హీరో ఫియన్నెస్ టిఫిన్ యంగ్ షెర్లాక్ హోమ్స్‌గా నటిస్తున్నాడు. హోమ్స్ టీనేజ్ ను, అతను ఎలా ప్రసిద్ధ డిటెక్టివ్ అయ్యాడు ? అనే విషయాలను ఇందులో చూపించబోతున్నారు. బ్రిటిష్ సీరీస్ ఫ్యాన్స్‌కి ఇదొక బెస్ట్ ఆప్షన్. 2026 మార్చి 4న ఈ సిరీస్ రిలీజ్ కానుంది.

The Boys Season 5

యాంటీ-సూపర్‌హీరో సిరీస్ ఫైనల్ సీజన్ ‘ది బాయ్స్ సీజన్ 5’ ఏప్రిల్ 8న రిలీజ్ కానుంది. హోమ్‌ ల్యాండర్ సుప్రీమ్ పవర్‌లో, ది బాయ్స్ జైలులో ఎలాంటి అరాచకం సృష్టించారు అన్నది స్టోరీ. ఈ క్రేజీ సిరీస్ లో ఇదే లాస్ట్ చాప్టర్ కావడంతో ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 2026లో ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ ను చూడవచ్చు.

Read Also :  ఏడాది గడిచినా విడుదలకు నోచుకోని ఉపేంద్ర యాక్షన్ థ్రిల్లర్… చేతులెత్తేసిన మేకర్స్

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×