E-Paper
Advertisement

Suspense Thriller OTT : భర్త అస్థికలు కలపడానికెళ్ళి కిల్లర్ చేతిలో ట్రాప్… కిడ్నాప్ అయిన అమ్మాయి కోసం ముసలావిడ సాహసం… క్రేజీ ట్విస్టులు

Suspense Thriller OTT : భర్త అస్థికలు కలపడానికెళ్ళి కిల్లర్ చేతిలో ట్రాప్… కిడ్నాప్ అయిన అమ్మాయి కోసం ముసలావిడ సాహసం… క్రేజీ ట్విస్టులు
Advertisement

Suspense Thriller OTT : సర్వైవల్ థీమ్స్‌తో వచ్చిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. థియేటర్స్‌లో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఒక మంచు తుఫానులో చిక్కుకున్న ఒక వితంతువు, కిడ్నాప్ చేసిన టీనేజ్ అమ్మాయిని రక్షించే సస్పెన్స్ థ్రిల్లర్. ఈ కథ సీను సీనుకి టెన్షన్ తో గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2025 లో వచ్చిన ఈ అమెరికన్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా పేరు ‘డెడ్ ఆఫ్ వింటర్’ (Dead of Winter). ఇది బ్రియాన్ కిర్క్ దర్శకత్వంలో రూపొందింది. ఎమ్మా థాంప్సన్, జూడీ గ్రీర్, మార్క్ మెంచాకా, లారెల్ మార్స్‌డెన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం Prime Videoలో రెంట్ ఆప్షన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఎమ్మా థాంప్సన్ పర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచింది. థియేటర్స్‌లో 2025 సెప్టెంబర్ 26న రిలీజ్ అవ్వగా, 2025 అక్టోబర్ 21 నుంచి డిజిటల్ లో కి వచ్చింది.

Advertisement

Read Also :  బ్లాక్ మార్కెట్ లో డేంజరస్ డ్రగ్… సైడ్ ఎఫెక్ట్స్ చూస్తే కంటిమీద కునుకు కరువు… బుర్రపాడు క్లైమాక్స్

స్టోరీలోకి వెళ్తే

బార్బ్ అనే మహిళ ఇటీవలే తన భర్తను కోల్పోయి చాలా బాధలో ఉంటుంది. ఆమె నివసించే మిన్నెసోటా అనే ప్రాంతం భారీ మంచు తుఫాను వస్తుంది. ఆమె తన భర్త అస్థికలను  కలపడానికి కారులో ఒంటరిగా వెళ్తుంటే రోడ్డు బ్లాక్ అవుతుంది. దీంతో తను దారి తప్పి ఒక చిన్న వుడెన్ ఇంటి దగ్గర ఆగుతుంది. సాయం కోసం లోపలికి వెళ్తే అక్కడ ఒక టీనేజ్ అమ్మాయి లీయాను ఇద్దరు ఆయుధాలు పట్టుకున్న జంట (ఒక ఆంటీ, ఒక అంకుల్) బంధించి ఉంటారు. అక్కడ ఫోన్ సిగ్నల్ లేదు, దగ్గర్లో మనుషులు కూడా లేరు. బార్బ్‌కు ఇప్పుడు ఒక విషయం అర్థమవుతుంది. ఆ అమ్మాయిని రక్షించేది తను మాత్రమే!

Advertisement

బార్బ్ మొదట భయపడుతుంది, కానీ తన బాధల్ని పక్కన పెట్టి ధైర్యం తెచ్చుకుంటుంది. ఆ జంటకు తెలియకుండా లీయాను విడిపించే ప్లాన్ వేస్తుంది. ఇంట్లో దొరికిన వస్తువులతో ఫైట్ చేస్తుంది. షూటింగ్స్, చేజ్‌లు, మంచులో పరుగులతో టెన్షన్ నిండిన సీన్లు ఉంటాయి. బార్బ్ పాత జ్ఞాపకాలు (భర్తతో గడిపిన రోజులు) ఫ్లాష్‌బ్యాక్‌లో కనిపిస్తాయి. చివర్లో భయంకరమైన ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో బార్బ్ ఆ అమ్మాయిని కాపాడుతుందా ? ఎందుకు ఆ ఆమ్మాయిని బంధించారు ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

‘ది ఒడిస్సీ’ డైరెక్టర్ మాస్టర్ పీస్ మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

Big Stories

Advertisement
×