E-Paper
Advertisement

OTT Movie : బ్లాక్ మార్కెట్ లో డేంజరస్ డ్రగ్… సైడ్ ఎఫెక్ట్స్ చూస్తే కంటిమీద కునుకు కరువు… బుర్రపాడు క్లైమాక్స్

OTT Movie : బ్లాక్ మార్కెట్ లో డేంజరస్ డ్రగ్… సైడ్ ఎఫెక్ట్స్ చూస్తే కంటిమీద కునుకు కరువు… బుర్రపాడు క్లైమాక్స్
Advertisement

OTT Movie : సైన్స్ అండ్ హర్రర్ ఈ రెండు జానర్లు ఒకే సినిమాలో ఉంటే… ఊహించుకోవడానికే క్రేజీగా ఉన్న ఈ మిక్స్డ్ జానర్లో వచ్చే సినిమాలకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. దెయ్యాలను నమ్మే వాళ్ళు కొందరైతే, సైన్స్ ను నమ్మేవాళ్ళు మరికొందరు. కానీ ఆ ఇద్దరినీ ఒకే చోట చేర్చే మ్యాజిక్ ను సైన్స్ ఎలిమెంట్స్ ను మిక్స్ చేసి తెరకెక్కించే హర్రర్ సినిమాలు మాత్రమే చేయగలవు. ఈరోజు మన మూవీ సజెషన్ కూడా అలాంటిదే. మరి ఆ మూవీని ఎక్కడ చూడవచ్చు అనే వివరాల్లోకి వెళ్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

కొరాలీ ఫార్గెట్ రాసి, డైరెక్ట్ చేసిన అద్భుతమైన ఫ్రెంచ్-అమెరికన్ బాడీ హారర్ ఫిల్మ్ ‘The Substance (2024)’, హాలీవుడ్ ఇండస్ట్రీలోని యూత్ అబ్సెషన్, ఏజింగ్ ఫియర్, బ్యూటీ స్టాండర్డ్స్, సెల్ఫ్-హేట్ వంటి థీమ్స్‌ను గ్రాఫిక్ మిక్స్ చేసి, డిస్టర్బింగ్ స్టోరీతో రూపొందించారు. ఇది డెమీ మూర్ కమ్‌బ్యాక్ ఫిల్మ్‌గా ప్రశంసలు అందుకుంది. ఈ మూవీలో డెమీ మూర్ (ఎలిజబెత్ స్పార్కిల్), మార్గరెట్ క్వాలీ (స్యూ), డెన్నిస్ క్వైడ్ (హార్వీ) మెయిన్ లీడ్స్ గా నటించగా, గోర్ అబ్రమ్, రే లియోటా మొదలైనవారు సపోర్టింగ్ రోల్స్ పోషించారు. 2 గంటల 20 నిమిషాలు రన్‌టైమ్ ఉన్న ఈ ఫిల్మ్ పెద్దలకు మాత్రమే. సినిమాటోగ్రఫీ (బెంజమిన్ క్రాక్‌జెన్), సౌండ్ డిజైన్ (రాఫెల్ బ్యూజర్) అద్భుతంగా ఉంటాయి. ఇందులోని మిరర్ సీన్స్, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్స్ విజువల్ స్టన్నింగ్. డెమీ మూర్ కెరీర్-డిఫైనింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ మూవీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయి, బెస్ట్ స్క్రీన్‌ప్లే అవార్డు గెలిచింది. IMDbలో 7.2 రేటింగ్ ఉంది. ఎక్స్‌ట్రీమ్ హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఈ మూవీ ఖచ్చితంగా హారర్ ప్రియులకు ఓ మంచి ఆప్షన్. కానీ హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు మాత్రం అస్సలు చూడొద్దు. ఈ ఫిల్మ్ Amazon Prime Videoలో రెంట్ లేదా బై ఆప్షన్స్ తో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also :  ఓటీటీ అలర్ట్… డిజిటల్ కష్టాలు గట్టెక్కిన మలయాళం మూవీ… ఎట్టకేలకు సైలెంట్ గా స్ట్రీమింగ్

స్టోరీలోకి వెళ్తే…

80ల కాలం నాటి ఐకానిక్, ఏరోబిక్స్ టీవీ స్టార్, మాజీ యాక్ట్రెస్ ఎలిజబెత్ స్పార్కిల్ (డెమీ మూర్). ఆమెకు 50 ఏళ్లు నిండిన రోజు ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. ఆమె చేస్తున్న షో ప్రొడ్యూసర్ హార్వీ (డెన్నిస్ క్వైడ్) “వయసు పెరిగింది” అని చెప్పి ఫైర్ చేస్తాడు. దీంతో నిరాశలో మునిగి పోయిన ఎలిజబెత్ సెల్ఫ్-డౌట్‌తో పాటు డిప్రెషన్ లో కూరుకుపోతుంది. వయసు పైబడడాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఎలాగైనా సరే వయసు తగ్గించుకోవాలని అనుకుంటుంది. అందులో భాగంగా ఎలిజబెత్ ఒక మిస్టీరియస్ బ్లాక్ మార్కెట్ డ్రగ్ “ది సబ్‌స్టాన్స్”ను కనిపెడుతుంది. ఇది సెల్ డివిజన్ టెక్నాలజీతో ఆమెకు యంగర్, మరింత అట్రాక్టివ్ వెర్షన్‌ను స్యూ (మార్గరెట్ క్వాలీ)ను క్రియేట్ చేస్తుంది. కానీ ఇక్కడే వస్తుంది అసలు ట్విస్ట్.

Advertisement

స్యూ ఎలిజబెత్ జీవితాన్ని టేకోవర్ చేసి, ఫేమ్ అండ్ సక్సెస్ సాధిస్తుంది. కానీ డ్రగ్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. రెండు బాడీలు సింబయోటిక్‌గా లింక్ అయి ఉంటాయి. కాబట్టి ప్రతి 7 రోజులకు ఒకటి యాక్టివ్, మరొకటి స్లీప్ మోడ్‌లో ఉండేలా స్విచ్ చేయాలి. రూల్స్ బ్రేక్ చేస్తే భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫిజికల్ – సైకలాజికల్ కాన్సిక్వెన్సెస్ భయంకరంగా మారతాయి. బాడీలు డిఫార్మ్ అవుతాయి, మెంటల్ గా డిస్టర్బ్ అవుతారు. ఈ ఇంటెన్స్‌ సైకలాజికల్ ఫిల్మ్ స్టార్ట్ నుంచి స్లో బర్న్‌గా మొదలై, క్లైమాక్స్‌లో ఎక్స్‌ట్రీమ్ హర్రర్, ప్రాస్థెటిక్ ఎఫెక్ట్స్‌తో థ్రిల్ చేస్తుంది. అయితే ఎలిజబెత్ ఆ రూల్స్ ను బ్రేక్ చేసిందా? అలా చేయడం వల్ల ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది? చివరికి ఏం జరిగింది? అన్నది స్టోరీ.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×