This Week OTT Releases : ప్రతిరోజు కూడా ఎన్నో సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాయి. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటే మరికొన్ని సినిమాలు మాత్రం ఎక్కడా లేని విపరీతమైన క్రేజ్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ఉంటాయి.. గత కొన్ని రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి వస్తున్న ప్రతి సినిమా కూడా మంచి టాక్ ని అందుకోవడంతో పాటుగా కలెక్షన్లు కూడా భారీగానే వసూల్ అవ్వడంతో సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజనీకాంత్ జైలర్ 2, విజయ్ దేవరకొండ రణబాలి సినిమాలు ఇంకా మంచి క్రేజ్ లో ఉన్నాయి.. కానీ ఈ వారం కూడా బోలెడు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యి జనాలని ఆకట్టుకుంటూ వస్తున్నాయి. మరి ఈ వారం థియేటర్ సినిమాలతో పాటుగా ఓటీటీలోకి కూడా బోలెడు సినిమాలు వచ్చేస్తాయి. మరి ఆ సినిమాల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం..
ఈ వారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి.. బోలెడు సినిమాలు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నాయి. గత వారం ప్యారడైజ్ వంటి సినిమాలు కూడా ఓటీటీలోకి వచ్చేసి మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇక విజయ్ సేతుపతి, కీర్తి సురేష్, సందీప్ కిషన్, ఆది సాయికుమార్. జయసుధ వంటి స్టార్ యాక్టర్స్ నటించిన సినిమాలు చాలానే స్ట్రీమింగ్ కు సిద్దంగా ఉన్నాయి. ఆ సినిమాల లిస్ట్ చూస్తే.. బాగానే సినిమాలు మూవీ లవర్స్ ను ఆకట్టుకొనేందుకు సిద్దంగా ఉన్నాయి.
కోలీవుడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ డ్రామా మూవీ ‘బత్తా’. దర్శకుడు బాలాజీ తరణీధరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ 1986 నాటి మద్రాస్ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో ‘బచ్చలమ్’ అనే భయంకరమైన స్థానిక గ్యాంగ్‌స్టర్ పాత్రలో హీరో నటించారు. విలక్షణ నటుడుగా తన నటనతో అందరిని ఆకట్టుకున్న విజయ్ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో అక్టోబర్ 29 స్ట్రీమింగ్ అవుతుంది..
టాలీవుడ్ క్రేజీ హీరో ఆది సాయి కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ ఎస్సై యుగంధర్.. రాఘవేంద్ర కటారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మేఘలేఖ హీరోయిన్. పోలీస్ కస్టడీ నుంచి కనిపించకుండా పోయిన ఒక శవం గురించి ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్ గా ఆది కనిపించారు. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో అక్టోబర్ 30 న స్ట్రీమింగ్ కానుంది.
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్, రాధిక అప్ట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అక్క.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తో వచ్చిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఈ ఊరిలోని భూగర్భ బంగారు అక్రమ రవాణాను నియంత్రించే ‘అక్కలు’ అనే శక్తివంతమైన అక్కాచెల్లెళ్ల వ్యవస్థ చుట్టూ కథ.. ఈ మూవీ కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
అంతేకాదు వీటితో పాటుగా లవ్ ఆల్వేస్, ఇమ్మోర్టల్, సిగ్మా సినిమాలు సైతం ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తున్నాయి. హిస్టారికల్ డ్రామాలు, టైమ్ ట్రావెల్ లవ్ స్టోరీల నుంచి మైండ్ బ్లోయింగ్ హీస్ట్ థ్రిల్లర్స్ వరకు విభిన్న కథాంశాలతో రూపొందిన కొత్త సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. మరి ఈ సినిమాలలో మీకు నచ్చిన సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యండి..