E-Paper
Advertisement

రాహుల్‌కు తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ లోని వాహనాలు ఢీ, పలువురికి గాయాలు

రాహుల్‌కు తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ లోని వాహనాలు ఢీ, పలువురికి గాయాలు
Advertisement

Rahul Gandhi: ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌‌గాంధీకి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికి మరొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో పలు వాహనాలు డ్యామేజ్ అయ్యాయి. అయితే రాహుల్‌‌గాంధీ సురక్షితంగా బయటపడ్డారు. వాహనంలోని భద్రతా సిబ్బందికి స్వల్పంగా గాయాలు అయ్యాయి. అసలు ఏం జరిగింది?

రాహుల్‌కు తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ లోని వాహనాలు ఢీ

పరువు నష్టం కేసుకు సంబంధించి తీర్పు రానున్న నేపథ్యంలో ప్రత్యేక కోర్టుకు వెళ్తున్నారు ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ. సోమవారం ఉదయం లక్నో ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సుల్తాన్‌పూర్ న్యాయస్థానానికి బయలుదేరారు. అయితే పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై రాహుల్‌గాంధీ వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌‌లో చివర ఐదు వాహనాలు-ఓ అంబులెన్స్‌ ఒకదానికొకటి ఢీ కొన్నాయి.

భద్రతా సిబ్బందికి, కార్యకర్తలకు గాయాలు, యూపీలో ఘటన

Advertisement

ఈ ఘటనలో పార్టీ కార్యకర్తలు, భద్రతా సిబ్బందికి గాయాలు అయ్యాయి. రాహుల్‌ కూర్చున్న వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. హైవేపై కాన్వాయ్‌ వేగంగా వెళ్తోందని, అందులోని ఓ వాహనం సడెన్‌ బ్రేక్‌ వేయడంతో మిగతా వాహనాలు ఢీ కొన్నట్లు స్థానిక మీడియా చెబుతోంది. ఇది స్వల్ప ప్రమాదమేనని ఆ పార్టీ నేతలు చెప్పారు. ఈ ఘటన తర్వాత రాహుల్‌‌గాంధీ తిరిగి తన ప్రయాణం కొనసాగించారని అధికారులు తెలిపారు.

బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా ఉన్నప్పుడు ఆయనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలకు సంబంధించి పరువు నష్టం కేసు. దీనిపై సుల్తాన్‌పూర్‌లోని ప్రత్యేక న్యాయస్థానం ముందుకు ప్రతిపక్ష నేత హాజరు కావాల్సివుంది. న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్వయంగా హాజరవుతున్నారు. పరువు నష్టం కేసు 2018 ఆగస్టు 4 నాటిది. కర్ణాటక శాసనసభ ఎన్నికలకు ముందు బెంగళూరులో జరిగిన ఒక ప్రచార సభలో చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైన విషయం తెల్సిందే.

Advertisement

ALSO READ: అప్పులు తీర్చి, గర్ల్‌ఫ్రెండ్‌తో తిరిగేందుకు.. కిడ్నాప్ డ్రామా ఆడిన నీట్‌ స్టూడెంట్!

 

Related News

హోసూరులో దారుణం.. ప్రియురాలి గొంతు కోసి .. ఆపై లారీ కింద పడి ప్రియుడి సూసైడ్!

భర్తను కత్తితో పొడిచి చంపిన భార్యకు కేవలం రూ.500 జరిమానా.. హైకోర్టు షాకింగ్ తీర్పు

అప్పులు తీర్చి, గర్ల్‌ఫ్రెండ్‌తో తిరిగేందుకు.. కిడ్నాప్ డ్రామా ఆడిన నీట్‌ స్టూడెంట్!

గుట్కా ఉమ్ముతూ విద్యుత్ వైర్లపై.. బాల్కనీలో అసలు ఏం జరిగింది? మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన

ఘోరమైన యాక్సిడెంట్.. లోయలోపడిన బస్సులో 30 మంది, వీడియోలో కాపాడాలంటూ ఆర్తనాదాలు

6 నెలలు.. 23 ఉరిశిక్షలు.. సంచలన జడ్జి రవికుమార్ దివాకర్ సడన్ ట్రాన్స్‌ఫర్!

12 ఏళ్ల ‘మన్ కీ బాత్’ ప్రయాణం.. దీన్ని ‘తీర్థయాత్ర’తో పోల్చిన ప్రధాని మోదీ!

Big Stories

Advertisement
×