E-Paper
Advertisement

Upcoming JioHotstar releases : ఈ నెలలో జియోహాట్‌స్టార్‌లో వస్తున్న సరికొత్త సిరీస్ లు ఇవే

Upcoming JioHotstar releases : ఈ నెలలో జియోహాట్‌స్టార్‌లో వస్తున్న సరికొత్త సిరీస్ లు ఇవే
Advertisement

Upcoming JioHotstar releases : మార్చి నెలలో ఓటీటీ స్ట్రీమింగ్ ప్రియులకు పండగే అని చెప్పాలి. జియోహాట్‌స్టార్ లో అదిరిపోయే ఇంటర్నేషనల్ సిరీస్‌లతో పాటు లోకల్ కంటెంట్ కూడా లైన్ లో ఉంది. మీరు మిస్ అవ్వకుండా చూడాల్సిన ఆ 6 సిరీస్‌ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటాయో తెలుసుకుందాం పదండి.

1. Marshals: A Yellowstone Story

మీకు గుర్రపు స్వారీలు, గన్ ఫైట్లు ఉండే వెస్ట్రన్ డ్రామాలు ఇష్టమైతే ఇది మీ కోసమే. ఫేమస్ ‘ఎల్లోస్టోన్’ సిరీస్ నుంచి వస్తున్న స్పిన్-ఆఫ్ ఇది. చట్టాన్ని కాపాడే మార్షల్స్ పడే కష్టాలు, ఆ కాలం నాటి పరిస్థితులను ఇందులో చాలా గ్రాండ్‌గా చూపించారు. మార్చి 1 నుంచే ఇది మొదలైంది. వీకెండ్ లో ఒక లుక్ వేసేయండి.

2. Ted Season 2

Advertisement

మాట్లాడే ఆ అల్లరి టెడ్డీ బేర్ మళ్ళీ వచ్చేస్తోంది. మొదటి సీజన్ చూసిన వాళ్లకి తెలుసు, టెడ్ చేసే కామెడీ ఎంత క్రేజీగా ఉంటుందో. ఈ రెండో సీజన్లో కూడా టెడ్, జాన్ కలిసి చేసే రచ్చ మామూలుగా ఉండదు. వీకెండ్ లో ఫ్యామిలీ అంతా కలిసి నవ్వుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్. మార్చి 6న ఈ సిరీస్ అన్ని ఎపిసోడ్లు అందుబాటులోకి వస్తాయి.

3. Rooster

స్టీవ్ కారెల్ అనగానే మనకు గుర్తొచ్చేది మంచి కామెడీ సిరీస్ ఇది. ఆయన నటిస్తున్న ఈ సిరీస్ ఒక వెరైటీ డ్రామా. ఒక వ్యక్తి జీవితంలో జరిగే వింత సంఘటనలను నవ్వు తెప్పించేలా ఇందులో చూపిస్తారు. మార్చి 9న ఇది రిలీజ్ అవుతోంది.

4. The Society Season 2

Advertisement

మీకు రియాలిటీ షోలు అంటే పిచ్చా? అయితే ఇది చూడాల్సిందే. మునావర్ ఫారూఖీ హోస్ట్‌గా వస్తున్న ఈ సర్వైవల్ గేమ్ షోలో కంటెస్టెంట్లు గెలవడానికి పడే కష్టాలు, చేసే ప్లాన్లు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. మొదటి సీజన్ మాదిరిగానే రెండో సీజన్ కూడా ఇంకాస్త ఘాటుగా ఉండబోతోందని సమాచారం. ఇది కూడా మార్చి 9 నుండి స్ట్రీమింగ్ కానుంది.

5. Resort

సౌత్ కంటెంట్ ఎదురుచూసే వాళ్ళ కోసం ఈ తమిళ సిరీస్ వస్తోంది. ఒక రిసార్ట్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ ఇది. ఇందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి డ్రామా కూడా ఉంటుంది. మార్చి 13న ఇది స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండే అవకాశం ఉంది.

6. Daredevil: Born Again Season 2

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సిరీస్ ఇదే. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) నుండి వస్తున్న ఈ సిరీస్ మార్చి 25న విడుదల కానుంది. విశేషమేమిటంటే, ఇది కేవలం ఇంగ్లీష్‌లోనే కాకుండా తెలుగు, హిందీ, తమిళం భాషల్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో చార్లీ కాక్స్ డెవిల్ ఆఫ్ హెల్స్ కిచెన్‌గా మళ్లీ తన ప్రతాపాన్ని చూపించబోతున్నాడు.

Read Also : ఓటీటీలోకి వచ్చేస్తున్న కొత్త మూవీ… ఊటీ నేపథ్యంలో సాగే ఓ తండ్రి, ముగ్గురు కొడుకుల కథ

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×