E-Paper
Advertisement

Weekend OTT Movies : వీకెండ్ సినిమాల జాతర.. ఓటీటీలో వీటిని మిస్ చెయ్యకండి…

Weekend OTT Movies : వీకెండ్ సినిమాల జాతర.. ఓటీటీలో వీటిని మిస్ చెయ్యకండి…
Advertisement

Weekend OTT Movies : ప్రతి నెలలో థియేటర్లలోకి బోలెడు సినిమాలో రిలీజ్ అవుతూ ఉంటాయి.. అయితే గత నెలతో పోలిస్తే ఈ నెల మాత్రం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలయితే ఇప్పటివరకు రాలేదు.. రిలీజ్ అయిన కొన్ని సినిమాలు కూడా ఏదో సో సో గా ఆడాయి తప్ప బిగ్గెస్ట్ హిట్గా మాత్రం నిలవలేదు.. ఈ నెలలో గత వారంతో పోలిస్తే ఈ వారం థియేటర్లలోకి సినిమాలు పెద్దగా రిలీజ్ అవ్వలేదు.. వచ్చేవారం ఉగాది సందర్భంగా స్టార్ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వచ్చేవారం బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద వార్ జరిగేలా కనిపిస్తుంది. ఇక ఈ వీకెండ్ మాత్రం కేవలం ఓటీటీ సినిమాలు మాత్రమే సందడి చేస్తున్నాయి. మరి ఈ వీకెండ్ ఏ సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి.. ఎక్కడ చూడాలి అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన బెస్ట్ మూవీస్.. 

ఫంకీ..

విశ్వక్ సేన్, కాయదు లోహార్ జంటగా నటించిన తాజా చిత్రం ఫంకీ.. జాతి రత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ మూవీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 13న థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే భారీ అంచనాల నడుమ థియేటర్లలో రిలీజ్ అయిన కూడా పెద్దగా ఆశించిన ఫలితాలని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

కపుల్ ఫ్రెండ్లీ..

Advertisement

సంతోష్ శోభన్, మానస వారణాసి కెమిస్ట్రీ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యింది.. అక్కడ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో సందడి చేస్తోంది. ఈ మూవీ ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది.

లాక్ డౌన్..

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించిన తమిళ చిత్రం లాక్ డౌన్.. గత కొన్ని రోజులుగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పుడు సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.. మార్చి 11 నుండే అమెజాన్ ప్రైమ్‌లో సందడి చేస్తోంది..

Advertisement

ఇవి మాత్రమే కాదు.. అటు రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి, పెన్నుమ్ పోరాట్టమ్, నవాబ్ కేఫ్ ఈటీవి విన్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.. వీటితో పాటుగా మరికొన్ని హాలీవుడ్ చిత్రాలు అలాగే వెబ్ సిరీస్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.. ఆలస్యం ఎందుకు.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసెయ్యండి..

Also Read : కొండన్నకు కార్లంటే ఎంత ప్రేమో.. ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నాయంటే..?

ఇకపోతే వచ్చేవారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల విషయానికొస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్, అలాగే బాలీవుడ్ నుంచి భారీ అంచనాలతో రణవీర్ సింగ్ నటించిన దురంధర్ 2 పోటీ పడుతున్నాయి. మరి ఈ సినిమాలలో ఉగాది విన్నర్ గా ఏ సినిమా నిలుస్తుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×