E-Paper
Advertisement

Vijay Deverakonda : కొండన్నకు కార్లంటే ఎంత ప్రేమో.. ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నాయంటే..?

Vijay Deverakonda : కొండన్నకు కార్లంటే ఎంత ప్రేమో.. ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నాయంటే..?
Advertisement

Vijay Deverakonda : టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాగా ఫేమస్ అయిన హీరో ఈ ఏడాది మాత్రం తన పెళ్లితో వార్తల్లో నిలిచాడు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నతో ఏడు అడుగులు నడిచాడు. హీరోయిన్ రష్మిక తో పెళ్లి తర్వాత ఈయన గురించి ప్రతి ఒక్కటి హాట్ టాపిక్ గా మారుతుంది.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గురించి ప్రతి ఒక్కటి కూడా వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం ఈయన రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ఈయన సినిమాల గురించి పక్కన పెడితే.. తాజాగా ఆయన దగ్గర ఉన్న లగ్జరీ కార్ల గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఇంతకీ విజయ్ దగ్గర ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నాయి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

విజయ్ దేవరకొండ కార్ల కలెక్షన్.. 

రౌడీ హీరో విజయ్ దేవరకొండకు వేగం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అంతే విదంగా కార్లు అంటే కూడా ఇష్టమే అని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.. ఇప్పటివరకు ఆయన గ్యారేజ్ లో ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయన్న విషయం తెలిసిందే.. బీఎండబ్ల్యూ ఫైవ్ సిరీస్ దీని ధర దాదాపు 70 లక్షలకు పైగానే ఉంటుంది. హైదరాబాదులో తిరగడానికి ఎక్కువగా విజయ్ దేవరకొండ ఈ కారుని ఉపయోగిస్తాడు. ఫోర్డ్ మాస్టాంగ్.. అమెరికన్ మజిల్ కార్ అంటే చాలా ఇష్టం దీని విలువ దాదాపు 80 లక్షలు వరకు ఉంటుంది. మరో లగ్జరీ కారు ఎస్ యు వి.. దీని ధర దాదాపు కోటి రూపాయలు వరకు ఉంటుందని సమాచారం. దీంతో పాటుగా ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కారు కూడా ఈయన దగ్గర ఉంది.. మొత్తానికి విజయ్ దేవరకొండ దగ్గర మంచి ఖరీదైన కార్లు ఉన్నాయి.

Advertisement

Also Read :లవ్ లో పడ్డ కాయదు.. ఇదేం ట్విస్ట్.. పెళ్లి అప్పుడేనా..?

సినిమాల విషయానికొస్తే…

గతంలో అర్జున్ రెడ్డి సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ హీరోకి.. ఆ తర్వాత గీత గోవిందం సినిమా మరో బిగ్గెస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకునేలా చేసింది.. అయితే ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు కానీ అవి పెద్దగా హిట్ టాక్ ని అందివ్వలేదు. ముఖ్యంగా ఫ్యాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అయిన టైగర్ మూవీ అతని కెరియర్ కు డిసప్పాయింటింగ్ గా మారింది. ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా హిట్ అవ్వలేదు. చివరిగా ఫ్యామిలీ స్టార్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. అయితే అది కూడా పెద్దగా ఆశించిన ఫలితాలని అందుకోలేదు. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న ఈ హీరో.. ప్రస్తుతం రణబలి, రౌడీ జనార్దన సినిమాల్లో నటిస్తున్నాడు. ఆ సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో బిజీగా ఉన్నాయి.. ఈ ఏడాదిలోనే ఈ రెండు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అటు ఈయన భార్య రష్మిక మందన్న బ్యాక్ టు బ్యాక్ హెట్చిత్రాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలను చేస్తూ వస్తుంది..

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×