E-Paper
Advertisement

Youth OTT : ఓటీటీ లోకి వచ్చేసిన రొమాంటిక్ స్టోరీ మూవీ.. తెలుగులో ఎక్కడ చూడచ్చంటే..?

Youth OTT : ఓటీటీ లోకి వచ్చేసిన రొమాంటిక్ స్టోరీ మూవీ.. తెలుగులో ఎక్కడ చూడచ్చంటే..?
Advertisement

Youth OTT : ప్రస్తుతం థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలతో పాటుగా ఓటీటీలోకి వచ్చే సినిమాల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్లాట్ఫారంలోకి సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇంట్లోనే కూర్చుని తమకు నచ్చిన సినిమాని చూసుకునేందుకు ఈ ఫ్లాట్ ఫామ్ లు మూవీ లవర్స్ కి అందుబాటులో ఉన్నాయి. దాంతో ఇక్కడ వచ్చే సినిమాలకు కూడా రోజురోజుకీ డిమాండ్ పెరుగుతూ వస్తుంది. ఈవారం బోలెడు సూపర్ హిట్ సినిమాలు ఓటిటిలోకి స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి.. అందులో యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ యూత్ ఒకటి.. ఈ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. మరి స్ట్రీమింగ్ ఎక్కడ అన్న వివరాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

‘యూత్’ ఓటీటీ వివరాలు..

కోలీవుడ్ నటుడు కరుణాస్ వారసుడు కెన్ కరుణాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ చిత్రం యూత్.. ఈ మూవీకి ఈయనే స్వయంగా దర్శకత్వం కూడా వహించారు. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. దాదాపు 20 రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది.. తెలుగులోకి స్ట్రీమింగ్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది. తమిళం, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం యూత్ ట్రెండ్కు అనుగుణంగా ఉన్న స్టోరీ అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరమూడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ పలువురు నటీనటులు నటించారు.

Advertisement

Also Read :మనోజ్ కొత్త అవతారం.. ఇదేం ట్విస్ట్ రా నాయనా..

మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

ఒక ఊరిలోని ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో చెందిన వ్యక్తి హీరో ప్రవీణ్.. అతని తండ్రి బేకరీని నడుపుతుంటాడు. అతని భార్య హౌస్ వైఫ్ గా ఇంట్లో తన బాధ్యతలను నెరవేరుస్తూ ఉంటుంది. వీళ్ళ కొడుకే ప్రవీణ్. జీవితంలో సక్సెస్ అవ్వడానికి ప్రయత్నాలు చేయాలి అని వాళ్ళు ఎన్నెన్నో కలలు కంటూ కొడుకు మీద ఆశలను పెంచుకుంటారు. అతను చేసే అల్లరితో స్కూల్లో ఏ అమ్మాయి కూడా అతని వైపు కన్నెత్తి చూడదు. తన స్కూల్ లైఫ్ పూర్తయ్యే లోపు ప్రేమించాలనే లక్ష్యంతో అతను ప్రయత్నాలు చేస్తాడు. ఆ విషయం తల్లిదండ్రులకు తెలియదు. అతడి జీవితంలోకి మరి కొంతమంది వస్తారు. హీరోయిన్ తో ప్రేమలో పడ్డ అతను తన ప్రేమను గెలిపించుకుంటాడా లేదా అన్నది ఈ సీరియల్ స్టోరీ లో చూడాలి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రొమాంటిక్ స్టోరీగా వచ్చిన ఈ మూవీ యూత్ ని బాగా ఆకట్టుకోవడంతో థియేటర్లలో మంచి టాక్ ని సొంతం చేసుకుంది. మరి ఓటీటీలో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఈవారం మరికొన్ని సూపర్ హిట్ సినిమాలు కూడా ఇక్కడ సందడి చేయబోతున్నాయి.

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×