E-Paper
Advertisement

లోక్‌సభలో బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం.. అధికార-విపక్షాల మాటల యుద్ధం.. వాడి వేడీగా సమావేశాలు

లోక్‌సభలో బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం.. అధికార-విపక్షాల మాటల యుద్ధం.. వాడి వేడీగా సమావేశాలు
Advertisement

Loksabha Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం వాటికి సంబంధించిన బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్ బిల్లును హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు.

ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. సభలో బిల్లులను ప్రవేశ పెట్టిన కేంద్రం

Advertisement

చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టేందుకు గురువారం నుంచి మూడురోజులపాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్లకు తుది రూపం, డీలిమిటేషన్‌ ద్వారా నియోజకవర్గాలను పెంపు, పునర్విభజించేందుకు మూడు బిల్లులను లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది కేంద్రం.

ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభమైన తర్వాత న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌, హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆయా బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత దీనిపై చర్చ మొదలైంది. అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. 2024లో మహిళా రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు.

Advertisement

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేసీ వేణుగోపాల్.. కౌంటరిచ్చిన హోంమంత్రి అమిత్ షా

2023లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చామని ఈ సందర్భంగా సభ దృష్టికి ఆయన తీసుకొచ్చారు. రాజ్యాంగాన్ని ప్రభుత్వం హైజాక్ చేస్తోందన్నారు.  వెంటనే హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టకుండా ఎలా చర్చ చేపడతారని అన్నారు.

బిల్లు ప్రవేశపెట్టకుండానే ఎలా ప్రశ్నించారని ఎదురుదాడి చేశారు. సభలో బిల్లు ప్రవేశ పెట్టిన తర్వాత సభ్యులు తమ తమ అభిప్రాయాలను చెప్పవచ్చన్నవారు. ప్రజల్లో ఆందోళన కలిగించేలా విపక్షాలు వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. జనగణన ఎందుకు చేపట్టలేదని ఎస్పీ ఎంపీ అఖిలేష్ ప్రశ్నిస్తున్నారని అన్నారు.

ALSO READ: అన్నట్టుగానే తమిళనాడులో.. డీలిమిటేషన్ పత్రాలను తగలబెట్టిన సీఎం స్టాలిన్

 

Related News

రహస్య మిత్రుల మధ్య గ్యాప్‌ పెంచిన బాబు! ఎస్‌ఐఆర్‌పై జగన్‌ నిరసన గళం.. సీఈసీ నియామకం సరికాదని పశ్చాత్తాపం…

బతుకమ్మ కుంటకు జీవం పోసిన సీఎం.. సిటీ జనం చిరస్థాయిగా రేవంత్‌ను గుర్తు పెట్టుకునేలా! ఆంక్షలు చేధించుకుని మరీ ఈసారి ఘనంగా సద్దుల బతుకమ్మ!

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఇద్దరూ పోటీ..! మహేశ్‌కు వరించిన అధ్యక్ష పీఠం..! లేటుగానైనా జాతీయ స్థాయి కీలక పదవిలో యాష్కీ!

కాంగ్రెస్‌..కోదండరాం మంత్రం! ఆయనే ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రం..? రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

Big Stories

Advertisement
×