Sci fi Comedy Web Series: ఓటీటీలో ప్రతి వారం ఎన్నో కొత్త వెబ్ సిరీస్‌లు వస్తుంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే కథ, పాత్రలు, కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అలాంటి సిరీస్ పేరే ‘స్టువర్ట్ ఫెయిల్స్ టు సేవ్ ది యూనివర్స్’ (Stuart Fails to Save the Universe). ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ది బిగ్ బ్యాంగ్ థియరీ చూసిన వాళ్లకు స్టువర్ట్ అనే క్యారెక్టర్ ప్రత్యేకంగా గుర్తుండే ఉంటుంది. ఎప్పుడూ అమాయకంగా కనిపించే ఆ కామిక్ బుక్ స్టోర్ ఓనర్ ఇప్పుడు ఏకంగా మల్టీవర్స్‌ను కాపాడే బాధ్యత తీసుకుంటే ఎలా ఉంటుందో ఈ స్పిన్-ఆఫ్ లో చూడవచ్చు. మరి ఇంతకీ ఈ సిరీస్ స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో చూడవచ్చు ? తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఈ సిరీస్ లో మన హీరో పేరు స్టువర్ట్ బ్లూమ్. ఎప్పటిలాగే తన కామిక్ బుక్ స్టోర్ లో ఉంటాడు ఈ దురదృష్టవంతుడు. అనుకోకుండా అతని చేతికి సీక్రెట్ క్వాంటం పరికరం దొరుకుతుంది. అది అనుకున్నట్టుగా సాధారణ గ్యాడ్జెట్ కాదని అతనికి తెలియదు. అతను చేసే ఒక చిన్న తప్పుతో ఆ పరికరం పని చేయకుండా పోతుంది. ఆ క్షణం నుంచి భూమి వినాశనం స్టార్ట్ అవుతుంది. చుట్టూ ఉన్న ప్రపంచమే వింతగా కనిపించడం మొదలవుతుంది. ఎవ్వరూ ఊహించని రీతిలో మల్టీవర్స్ తలుపులు తెరుచుకుంటాయి.
ఆ గందరగోళంలోనే స్టువర్ట్‌కు తనలాగే కనిపించే మరో వ్యక్తి ఎదురవుతాడు. కానీ అతను వేరే ప్రపంచానికి చెందిన స్టువర్ట్. ఈ విశ్వాన్ని కాపాడగలిగేది నువ్వే అని చెప్పడంతో అసలు కథ షురూ అవుతుంది. తన గర్ల్‌ఫ్రెండ్ డెనిస్, స్నేహితుడు బర్ట్, క్వాంటం ఫిజిసిస్ట్ బారీ క్రిప్కేతో కలిసి స్టువర్ట్ విశ్వాన్ని కాపాడడానికి ఒక డేంజరస్ జర్నీకి సిద్ధమవుతాడు. ప్రతి ఎపిసోడ్‌లో వాళ్లు ఒక విశ్వం నుంచి మరో కొత్త విశ్వానికి వెళ్తూ, లేనిపోని సమస్యలను కొనితెచ్చుకుంటారు.
ప్రతి ప్రపంచంలో తెలిసిన పాత్రలే కనిపించినా… వారి వ్యక్తిత్వాలు మాత్రం వేరేగా ఉంటాయి. మరి ఇంతకీ స్టువర్ట్ గ్యాంగ్ చివరకి అనుకున్నట్టుగా ప్రపంచాన్ని కాపాడిందా ? విశ్వం రక్షణ కోసం వాళ్ళు చేసిన పని ఏంటి ? స్టువర్ట్ నిజంగా మల్టీవర్స్‌ను కాపాడగలిగాడా? అన్నది తెలుసుకోవాలంటే ఈ సిరీస్‌ను మిస్ అవ్వకుండా చూడాల్సిందే.
‘స్టువర్ట్ ఫెయిల్స్ టు సేవ్ ది యూనివర్స్’లో కామెడీనే హైలెట్. అదే సమయంలో మల్టీవర్స్ కాన్సెప్ట్‌ను గందరగోళంగా కాకుండా ఆడియన్స్ కు ఈజీగా అర్థమయ్యేలా చూపించారు. కొన్ని ఎపిసోడ్‌లలో వచ్చే ట్విస్టులు సర్ప్రైజింగ్ గా అన్పిస్తాయి. ‘ది బిగ్ బ్యాంగ్ థియరీ’ ఫ్యాన్స్‌కు ఈ సిరీస్ లో ఎన్నో చిన్న చిన్న సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. క్లైమాక్స్ ట్విస్ట్ ను ఊహించలేదు. ఇందులో కెవిన్ సస్స్మాన్, లారెన్ లాప్కస్, బ్రయాన్ పోసేన్, జాన్ రాస్ బోయీ తదితరులు ఇందులో నటించారు.
జూలై 23 నుంచి ఈ సైన్స్ ఫిక్షన్ కామెడీ డ్రామా JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ మొత్తం 10 ఎపిసోడ్‌లు ఉండగా, ఇంగ్లీష్ తో పాటు ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ ఇంకా అందుబాటులోకి రాలేదు. మల్టీవర్స్ కథలు, సైన్స్ ఫిక్షన్, కామెడీ కలగలిసిన అద్భుతమైన వెబ్ సిరీస్ ఇది. నవ్వులు పంచుతూనే సైన్స్ ఫిక్షన్, మల్టీవర్స్ కాన్సెప్ట్‌ను సరదాగా చెప్పిన విధానం ఈ సిరీస్‌కు పెద్ద ప్లస్. ఒకవేళ ఈ వీకెండ్ సరదాగా నవ్వుకోవాలి అనుకుంటే ఈ సిరీస్ ను డోంట్ మిస్.
Read Also: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాకు చుక్కలు చూపించే లేడీ సింగం… ఒక్కొక్కడికీ చుక్కలే