E-Paper
Advertisement

Year Ender 2025 : డెమోన్ స్లేయర్ నుంచి నరుటో వరకు… ఓటీటీలో 2025లో తుక్కురేగ్గొట్టిన యానిమే సిరీసులు ఇవే

Year Ender 2025 : డెమోన్ స్లేయర్ నుంచి నరుటో వరకు… ఓటీటీలో 2025లో తుక్కురేగ్గొట్టిన యానిమే సిరీసులు ఇవే
Advertisement

Year Ender 2025 : 2025 యానిమేషన్ ప్రియులకు మరపురాని సంవత్సరం. మై హీరో అకాడమియా లాంటి లెజెండరీ సిరీస్ ముగిసినా, ఓటీటీల్లో పాత క్లాసిక్‌లను రివైండ్ చేస్తూ కొత్త వీక్షకులు లక్షల్లో చేరారు. ఇండియా, వెస్ట్ దేశాల్లో యానిమేషన్ క్రేజ్ పతాక స్థాయికి చేరింది. నెట్‌ఫ్లిక్స్ నుంచి OTTplay ప్రీమియం వరకు అన్నీ ప్లాట్‌ ఫామ్‌లు యానిమే వ్యూస్ తో రికార్డులు బద్దలు కొట్టాయి. 2025లో అత్యధికంగా రివైండ్ చేసిన టాప్ 10 యానిమేషన్ సిరీసులను ఎక్కడ చూడాలో తెలుసుకుందాం పదండి.

1. Naruto & Naruto: Shippuden

నెట్‌ఫ్లిక్స్ 2025 గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం నరుటో అత్యధిక స్ట్రీమింగ్ యానిమేషన్ సిరీస్. దాదాపు 720 ఎపిసోడ్లు ఉన్న ఈ జర్నీని కొత్త జనరేషన్ మొత్తం బింజ్ చేసింది. Netflix లో తెలుగు డబ్ లో కూడా ఉంది.

2. Demon Slayer: Kimetsu no Yaiba

Advertisement

Infinity Castle మూవీ ట్రైలాజీ పార్ట్-1 (Akaza’s Return) అనౌన్స్‌మెంట్‌తో 2025లో డెమోన్ స్లేయర్ క్రేజ్ పీక్‌కి చేరింది. హషిరా ట్రైనింగ్ ఆర్క్ తర్వాత మూవీ స్టోరీ పికప్ అవుతుంది కాబట్టి అందరూ 4 సీజన్లు రివైండ్ చేశారు. ఇది Netflix, OTTplay Premiumలో తెలుగు, తమిళం, హిందీ డబ్బింగ్ తో స్ట్రీమ్ అవుతోంది.

3. Jujutsu Kaisen

సీజన్-3 2026 జనవరి 8న జపాన్‌లో రిలీజ్ కానుంది. గోజో vs సుకున, యూజి ఇటాడోరి ఫైట్స్ కోసం ఫ్యాన్స్ సీజన్ 1 & 2 రివైండ్ చేస్తున్నారు. Netflix, OTTplay Premium (తెలుగు డబ్ ఉంది)

4. Chainsaw Man

Advertisement

Chainsaw Man: The Movie – Reze Arc మూవీ PVODలో రిలీజ్ అయింది. ఈ మూవీకి ముందు సిరీస్ మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
Netflix, OTTplay Premium లో ఉంది.

5. Solo Leveling

సీజన్-2 2024 చివర్లో స్టార్ట్ అయి 2025 మొదటి నెలల్లో క్రేజ్ కంటిన్యూ అయింది. మన్‌హ్వా అడాప్టేషన్ కాబట్టి సన్ జిన్-వూ జర్నీని అర్థం చేసుకోవడానికి సీజన్-1 కూడా రివైండ్ ఎక్కువైంది. Netflix లో అందుబాటులో ఉంది.

6. Attack on Titan

ఈ సిరీస్ ఎండింగ్‌పై 2025 మొదట్లో భారీ డిబేట్ మొదలైంది. క్యూరియాసిటీతో కొత్త వీక్షకులు 4 సీజన్లు బింజ్ చేశారు.
Netflix, OTTplay Premiumలో దీనిని చూడవచ్చు.

7. One Piece

Egghead ఆర్క్ 2025లో రివైవ్ అయింది. సిరీస్ తాత్కాలిక బ్రేక్ తీసుకుంటుందని తెలిసి ఫ్యాన్స్ పాత ఆర్క్‌లు రివైండ్ చేశారు.
1000+ ఎపిసోడ్స్ తో Netflix లో ఉంది.

8. My Hero Academia

సీజన్-8తో సిరీస్ 2025లో అధికారికంగా ముగిసింది. ఇజుకు మిడోరియా జర్నీ హార్ట్‌వార్మింగ్ ఎండింగ్‌తో ముగియడంతో ఫ్యాన్స్ మొత్తం సిరీస్ రివైండ్ చేశారు. Netflix, OTTplay Premiumలో అందుబాటులో ఉంది.

9. Death Note

లైట్ యగామి మైండ్ గేమ్స్, ఎల్ vs కిరా బ్యాటిల్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇది 2025లో కూడా కొత్త జనరేషన్ డిస్కవర్ చేసింది.
Netflixలో తెలుగు డబ్ ఉంది.

10. Frieren: Beyond Journey’s End

సీజన్-2 2026 జనవరి 16న రాబోతుంది. “హ్యాపిలీ ఎవర్ ఆఫ్టర్ తర్వాత ఏం జరుగుతుంది?” అనే థీమ్ రిప్రజెంటేషన్‌తో డార్క్ హార్స్‌గా మారింది. Netflix లో ఇది అందుబాటులో ఉంది.

కొవిడ్ తర్వాత కోరియన్ డ్రామాలు బూస్ట్ పొందినట్లే, 2025లో యానిమే భారీగా మెయిన్‌స్ట్రీమ్ అయింది. మై హీరో అకాడెమియా ఎండ్, డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్, నరుటో టాప్ స్ట్రీమింగ్‌తో ఈ ఏడాది యానిమే ఇండియాలో కూడా భారీ హిట్ అయింది.

Read Also : ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి చితగొట్టిన మూవీస్ ఇవే…. ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×