E-Paper
Advertisement

Friendship: టాక్సిక్ ఫ్రెండ్‌షిప్.. బయటకు కనిపించని ఈ 3 లక్షణాలు మీ స్నేహితుల్లో ఉన్నాయా ?

Friendship: టాక్సిక్ ఫ్రెండ్‌షిప్.. బయటకు కనిపించని ఈ 3 లక్షణాలు మీ స్నేహితుల్లో ఉన్నాయా ?
Advertisement

Friendship: స్నేహం అనేది జీవితంలో అత్యంత మధురమైన బంధం. కానీ.. కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఆ బంధం మనల్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది. బయటకు అంతా బాగున్నట్లు అనిపించినా.. లోలోపల ఆ స్నేహం విషపూరితం కావచ్చు. సైకాలజీ ప్రకారం.. మీ స్నేహం ప్రమాదకరంగా మారిందని చెప్పే 3 ముఖ్యమైన రహస్య సంకేతాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1. సమస్యలు  :

సాధారణంగా మంచి స్నేహితులను కలిసినప్పుడు మనం ఉత్సాహంగా.. సంతోషంగా ఫీల్ అవుతాము. కానీ.. మీ స్నేహితుడిని కలిసిన తర్వాత లేదా వారితో మాట్లాడిన తర్వాత మీరు మానసికంగా అలసిపోయినట్లు అనిపిస్తుందా?

Advertisement

నిరంతర విమర్శలు: వారు మిమ్మల్ని నేరుగా కాకుండా.. జోకుల రూపంలో లేదా చిన్నచూపు చూస్తూ విమర్శించడం వంటివి చేయవచ్చు.

నెగటివిటీ: ఎప్పుడూ తమ కష్టాల గురించి లేదా ఇతరుల గురించి ఫిర్యాదులు చేస్తూ, మీలోని సానుకూలతను పొగొడతారు.

భావోద్వేగ భారతం: మాటలు ముగిశాక మీకు ఏదో తెలియని వెలితి లేదా ఒత్తిడి కలిగితే.. అది ఆ స్నేహం టాక్సిక్‌గా మారిందనడానికి మొదటి గుర్తు.

2. “వాకింగ్ ఆన్ ఎగ్‌షెల్స్” :

మీరు వారి ముందు ఏదైనా మాట్లాడాలన్నా.. ప్రవర్తించాలన్నా భయపడటం. వారు ఎక్కడ కోప్పడతారో.. ఎక్కడ ఫీలవుతారో అని మీరు మీ నిజమైన వ్యక్తిత్వాన్ని దాచుకోవడం వంటివి చేస్తారు.

అభద్రతా భావం: మీరు ఒక మంచి వార్త చెప్పినప్పుడు వారు మనస్ఫూర్తిగా సంతోషించరని మీకు ముందే అనిపిస్తుంది.

రియాక్షన్ పట్ల భయం: చిన్న విషయాన్ని కూడా వారు పెద్దది చేసి గొడవ పడతారనే భయంతో మీరు చాలా విషయాలను దాచిపెడుతుంటారు.

నిజాయితీ లోపించడం: స్నేహంలో పారదర్శకత ఉండాలి. కానీ.. మీరు ప్రతి మాటను వందసార్లు ఆలోచించి మాట్లాడుతున్నారంటే.. ఆ బంధంలో స్వచ్ఛత తగ్గిందని అర్థం.

3. అసమతుల్యత:

స్నేహం అనేది “ఇవ్వడం, తీసుకోవడం” అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది. కానీ టాక్సిక్ స్నేహాల్లో ఇది కేవలం ఒకవైపు మాత్రమే ఉంటుంది.

నేను.. నా.. నాకే..: వారు కలిసినప్పుడు కేవలం వారి సమస్యలు, వారి విజయాలు, వారి కథల గురించే మాట్లాడుతుంటారు. మీకు మాట్లాడే అవకాశం ఇవ్వరు, ఒకవేళ మీరు చెప్పినా దాన్ని త్వరగా ముగించేసి మళ్లీ వారి టాపిక్‌లోకి వెళ్తారు.

అవసరానికి మాత్రమే: వారికి అవసరం ఉన్నప్పుడు మీకు పదుల సంఖ్యలో కాల్స్ చేస్తారు. కానీ మీకు ఒక చిన్న సహాయం లేదా మానసిక మద్దతు కావాల్సి వచ్చినప్పుడు వారు అందుబాటులో ఉండరు.

సరిహద్దుల ఉల్లంఘన : మీ వ్యక్తిగత సమయాన్ని లేదా నిర్ణయాలను వారు గౌరవించరు. వారి ఇష్టానుసారమే అన్నీ జరగాలని కోరుకుంటారు.

పైన చెప్పిన లక్షణాలు మీ స్నేహితుడిలో కనిపిస్తున్నాయా ? అయితే ఒక సారి ఆలోచించండి. స్నేహం అంటే మనల్ని మనం మెరుగు పరుచుకునేలా ఉండాలి కానీ.. మన ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉండకూడదు. టాక్సిక్ స్నేహాల నుంచి బయట పడటం ప్రారంభంలో కష్టంగా అనిపించినా.. మీ మానసిక ఆరోగ్యానికి అది చాలా అవసరం.

Related News

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

Big Stories

Advertisement
×