E-Paper
Advertisement

Year Ender 2025 : హర్రర్ నుంచి యాక్షన్ వరకు… ఈ ఏడాది వచ్చిన బెస్ట్ బెంగాలీ సినిమాలు

Year Ender 2025 : హర్రర్ నుంచి యాక్షన్ వరకు… ఈ ఏడాది వచ్చిన బెస్ట్ బెంగాలీ సినిమాలు
Advertisement

Year Ender 2025 :  ఈ ఏడాది ఓటీటీలలో బెంగాలీ సినిమాలు, సిరీస్ లు కూడా తమదైన ముద్ర వేశాయి. 2025లో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసిన బెస్ట్ బెంగాలీ సినిమాలు ఏంటో ఇయర్ ఎండ్ సందర్భంగా తెలుసుకుందాం పదండి.

1. ధూమ్‌కేతు (Dhumketu)

రొమాంటిక్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన ఈ చిత్రానికి కౌశిక్ గంగూలీ దర్శకత్వం వహించారు. దేవ్, శుభశ్రీ గంగూలీ జంటగా నటించారు. భాను (దేవ్) అనే వ్యక్తి తన గ్రామానికి తిరిగి వచ్చి, గతంలో తీవ్రవాద భావజాలం వల్ల కోల్పోయిన ప్రేమికురాలు రూప (శుభశ్రీ)ను కలుసుకుంటాడు. ఆమె కుటుంబానికి జరిగిన అన్యాయాలకు ప్రతీకారం తీర్చుకోవడం కథ.

2. రక్తబీజ్ 2 (Raktabeej 2) – ZEE5

Advertisement

యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘రక్తబీజ్’కు సీక్వెల్. IG పంకజ్ సిన్హా (అభిర్ చటర్జీ), SP సంయుక్త మిత్ర (మిమి చక్రవర్తి) కొత్తగా సరిహద్దు దాటిన ఉగ్రవాద బెదిరింపును ఎదుర్కొంటారు. మొదటి భాగంలోని సంతిపూర్ పేలుళ్లతో ముడిపడిన కుట్రను ఎలా భగ్నం చేశారు అన్నది స్టోరీ. ఈ దర్యాప్తు వారిని న్యూఢిల్లీ నుండి బ్యాంకాక్ వరకు ప్రమాదకరమైన ప్రాంతం గుండా నడిచేలా చేస్తుంది.

3. శర్తోపోర్ (Sharthopor)

కోయల్ మల్లిక్, కౌశిక్ సేన్ నటించిన ఫ్యామిలీ డ్రామా. తల్లిదండ్రుల మరణం తర్వాత వచ్చిన ఆన్సెస్ట్రల్ ఇంటి మీద దూరమైన సోదరీసోదరులు అపర్ణ (కోయల్) మరియు సౌరవ్ (కౌశిక్ సేన్) మధ్య కోర్టు గొడవ జరుగుతుంది. ఆస్తి హక్కులు, లింగ భేదాలు, దాచిపెట్టిన భావోద్వేగాలు చుట్టూ కథ.

4. అమర్ బాస్ (Aamar Boss) – ZEE5

Advertisement

శిబోప్రసాద్ ముఖర్జీ, నందితా రాయ్ దర్శకత్వం వహించిన మూవీ ‘అమర్ బాస్’. రఖీ గుల్జార్, శిబోప్రసాద్ ముఖర్జీ, శ్రాబంతీ చటర్జీ, సౌరసేని మైత్రా, గౌరబ్ చటర్జీ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. బిజీ పబ్లిషింగ్ బాస్ అనిమేష్ జీవితం, రిటైర్మెంట్ తర్వాత రికవరీలో ఉన్న తల్లి శుభ్ర (రఖీ గుల్జార్) ఇంటర్న్‌గా జాయిన్ అయినప్పుడు మారిపోతుంది. ఆమె వృద్ధుల కోసం డేకేర్ సెంటర్ పెట్టి, ఆఫీస్ వాతావరణాన్ని మార్చి, తరాల మధ్య మంచి బంధాలను ఏర్పరుస్తుంది.

5. ది ఏకెన్: బెనారస్ ఏ భీభిషిక (The Eken: Benaras e Bibhishika) – Prime Video

ఈ మూవీలో డిటెక్టివ్ ఏకెన్ బాబు, అతని స్నేహితులు వారణాసీకి వెళ్తారు. ఈ సాధారణ ట్రిప్ మసాన్ హోలీ ఉత్సవాన్ని భంగం కలిగించే భయానక కుట్రను బయట పెడుతుంది. రహస్య కోడ్‌లు, నీడలు, దొంగిలించబడిన విగ్రహం చుట్టూ కథ నడుస్తుంది.

6. కిల్‌బిల్ సొసైటీ (Killbill Society) – Prime Video

శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘హెమ్‌లాక్ సొసైటీ’ సీక్వెల్. హీరోయిన్ పూర్ణ (కౌషానీ ముఖర్జీ) తన పార్టనర్ పబ్లిక్‌గా ద్రోహం చేయడంతో వాడికి బుద్ధి చెప్పడానికి హిట్‌మ్యాన్ మృత్యుంజయ్ కార్ (పరంబ్రత చటర్జీ)ను హైర్ చేసుకుంటుంది. మరి ఆ తరువాత ఏం జరిగిందన్నది స్టోరీ.

Read Also : నదిలో తేలే శవాలు… జంతుబలితో శాంతి పూజలు… కన్నడ హర్రర్ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×