E-Paper
Advertisement

Year Ender 2025 : 2025లో వచ్చిన బెస్ట్ హర్రర్ హిట్స్… వీటిని చూడాలంటే హనుమాన్ చాలీసా పక్కనుండాల్సిందే

Year Ender 2025 : 2025లో వచ్చిన బెస్ట్ హర్రర్ హిట్స్… వీటిని చూడాలంటే హనుమాన్ చాలీసా పక్కనుండాల్సిందే
Advertisement

Year Ender 2025 : 2025లో ఎన్నో హర్రర్ సినిమాలు. సిరీస్ లు వచ్చి ప్రేక్షకులను అలరించాయి. ఇయర్ ఎండ్ సందర్భంగా ఈ ఏడాది ఓటీటీలోకి వచ్చిన అత్యంత భయంకరమైన సిరీస్ లపై ఓ లుక్కేద్దాం పదండి.

యెల్లోజాకెట్స్ సీజన్ 3 (Yellowjackets 3)

1996లో అడవుల్లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత టీనేజ్ అమ్మాయిల బృందం బతికేందుకు ఏం చేసింది? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది? అన్నదే ‘యెల్లోజాకెట్స్’ కథ. రెండు కాలక్రమాలలో నడిచే ఈ సిరీస్ ప్రతి ఎపిసోడ్‌ లో సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఫీలింగ్ ఇస్తుంది. జియోహాట్‌స్టార్ ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

కాసాండ్రా (Cassandra)

Advertisement

వింటేజ్ స్మార్ట్ హోమ్‌లో నివసించాలనే ఆలోచన ఎంత బాగుంటుంది కదా. కానీ ఎంత భయంకరంగా ఉంటుందో చూపించింది ఈ సిరీస్. 1970లలో సృష్టించబడిన ఎలక్ట్రానిక్ వర్చువల్ అసిస్టెంట్ కాసాండ్రా తిరిగి యాక్టివేట్ అవుతుంది. కానీ ఈసారి ఆమె ఇంటిని మెయింటైన్ చేయాలని కోరుకోదు. బదులుగా స్వాధీనం చేసుకుంటుంది. ఏఐ ఎంత డేంజర్ అనేది ఈ సినిమాలో చూడవచ్చు. నెట్‌ఫ్లిక్స్ లో ఈ సిరీస్ ను చూడవచ్చు.

ఐటి: వెల్కం టు డెర్రీ (IT: Welcome to Derry)

స్టీఫెన్ కింగ్ ప్రపంచం నుండి వచ్చిన ప్రీక్వెల్ సిరీస్ ఇది. 1962లో డెర్రీ నగరంలో ఉండే భయంకరమైన రాక్షసుడు పెన్నీవైస్ చేసే అరాచకం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సిరీస్ లో స్నేహితుల బృందం ఈ రాక్షసుడి పుట్టుకకు కారణం ఏంటో తెలుసుకునే కథ స్పైన్ చిల్లింగ్ గా ఉంటుంది. జియోహాట్‌స్టార్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

ది లాస్ట్ ఆఫ్ అజ్ సీజన్ 2 (The Last Of Us 2)

Advertisement

మొదటి సీజన్ తర్వాత ఐదు సంవత్సరాల తరువాత, జోయెల్ – ఎల్లీ ఒకరితో ఒకరు పోరాడుతూనే… గతంలో కంటే ప్రమాదకరంగా మారిన ప్రపంచంతో కూడా ఫైట్ చేస్తారు. జియో హాట్‌స్టార్ లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

స్ట్రేంజర్ థింగ్స్ (సీజన్ 5) (Stranger Things Season 5)

స్ట్రేంజర్ థింగ్స్ చివరి సీజన్‌లో హాకిన్స్ బృందం వెక్నాను ఆపడానికి చివరి పోరాటం చేస్తుంది. 1987లో సెట్ చేయబడిన ఈ సీజన్ సైనిక జోక్యం, మల్టీవర్స్ ముప్పు, ఎలెవెన్ నిజమైన శక్తి చుట్టూ తిరుగుతుంది. ఈ సీజన్ భయం, నోస్టాల్జియా రెండింటినీ అందిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఖౌఫ్ (Khauf)

ఢిల్లీలోని అమ్మాయిల హాస్టల్‌లోని ఒక గది ఖౌఫ్. ఇతర అమ్మాయిలు ప్రవేశించడానికి కూడా భయపడే గది అది. కానీ మధు ఆ గదిలోకి వెళ్లడంతో మొదలవుతుంది దబిడి దిబిడీ. ప్రైమ్ వీడియోలో ఈ హర్రర్ సిరీస్ ఉంది.

అంధర్ మాయ (Andhar Maya)

ఖాటు కుటుంబం ప్రతి సంవత్సరం వారి పూర్వీకుల ఇంటికి తిరిగి వస్తుంది. కానీ ఈసారి ఆ భవనం వారి విధిని మార్చుకుంది. వరుస హత్యాలతో వెన్నులో వణుకు పుట్టించే ట్విస్టులతో సాగుతుంది సిరీస్. ఇది జీ5లో ఉంది.

Read Also : యూరిన్ తాగి ఇదేం పాడు పని… ప్రయాణం చేస్తూ పరలోకానికి… తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్

Related News

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×