E-Paper
Advertisement

Ashes series Eng VS Aus: యాషెస్ టెస్ట్ లో ఆస్ట్రేలియా ఆలౌట్, స్టేడియంలో అలెక్స్ కారీ భార్య క‌న్నీళ్లు

Ashes series Eng VS Aus: యాషెస్ టెస్ట్ లో ఆస్ట్రేలియా ఆలౌట్, స్టేడియంలో అలెక్స్ కారీ భార్య క‌న్నీళ్లు
Advertisement

Ashes series Eng VS Aus: ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ ( Australia vs England) మధ్య యాషెస్ సిరీస్ ( The Ashes, 2025-26) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యాషెస్ సిరీస్ లో ఇప్పటికే రెండు టెస్టులు పూర్తయ్యాయి. ఇందులో రెండు టెస్టులు కూడా ఆస్ట్రేలియానే నెగ్గింది. నిన్నటి నుంచి ఈ రెండు జట్ల మధ్య మూడో టెస్ట్ కూడా ఆడిలైడ్ వేదికగా ప్రారంభమైంది. అయితే ఈ మూడో టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా పడుతూ లేస్తూ 371 పరుగులు సాధించింది. 91.2 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 371 పరుగులకు ఆల్ అవుట్ అయింది. టాపార్డర్ పూర్తిగా విఫలముగా కవాజా అలాగే అలెక్స్ కారీ ( Alex Carey) ఇద్దరు రాణించి ఈ జట్టును కాపాడారు. చివరలో మిచెల్ స్టార్ కు మరోసారి అర్థ సెంచరీ సాధించి జట్టును ఆదుకున్నాడు. లేకపోతే ఆస్ట్రేలియా నిన్ననే ఆల్ అవుట్ అయ్యేది.

Also Read: IPL Auction 2026: మినీ వేలం త‌ర్వాత 10 జ‌ట్ల ప్లేయ‌ర్ల ఫుల్ లిస్ట్ ఇదే, అన్ సోల్డ్ ప్లేయ‌ర్లు వీళ్లే

అలెక్స్ కారీ సెంచరీ, స్టేడియంలోనే భార్య కన్నీళ్లు

Advertisement

ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ( Australia vs England, 3rd Test ) జరుగుతున్న మూడవ టెస్ట్ లో అలెక్స్ కారీ అదరగొట్టాడు. నిన్న ప్రారంభమైన మూడవ టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటర్లందరూ విఫలమైనప్పటికీ వికెట్ కీపర్ అలెక్స్ కారీ మాత్రం జట్టును ఆదుకున్నాడు. ఈ నేపథ్యంలోనే టెస్టుల్లో తన మూడవ సెంచరీని కూడా నమోదు చేసుకున్నాడు అలెక్స్ కారీ. 143 బంతుల్లో 106 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇందులో 8 బౌండరీలతో పాటు పాటు ఒక సిక్సర్ కూడా ఉంది. అయితే అలెక్స్ కారీ సెంచరీ చేసిన నేపథ్యంలో, ఆ సెంచరీని తన తండ్రికి నివాళిగా అంకితం చేశాడు. ఇక తన భర్త సెంచరీ చేయడంతో అలెక్స్ కారీ భార్య స్టేడియంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సంఘటన వైరల్ గా మారింది. ఇటీవ‌లే అలెక్స్ కారీ తండ్రి మృతి చెందారు. ఈ త‌రుణంలో తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత తొలి సెంచ‌రీ చేసి,అంకితం చేశాడు. అటు ఆయ‌న భార్య క‌న్నీళ్లు పెట్టుకున్న పోటోలు వైర‌ల్ గా మారాయి.

ఆస్ట్రేలియా ఆలౌట్

యాషెస్‌ సిరీస్ లో భాగంగా ఆడిలైట్ వేదికగా జరుగుతున్న మూడవ టెస్టులో ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. 371 పరుగులకు ఆస్ట్రేలియాను కుప్ప కూల్చింది ఇంగ్లాండ్. ఇక ఈ మ్యాచ్ లో జోఫ్రా ఆర్చర్ 5 వికెట్లు పడగొట్టి దుమ్ము లేపాడు. కార్సేకు రెండు వికెట్లు పడగా వీల్ జాక్స్‌ మరో రెండు వికెట్లు తీశాడు. జోష్‌ టంగ్ ఒక వికెట్ పడగొట్టాడు. ఇక ఆస్ట్రేలియా ఆలౌట్ కావడంతో మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించింది ఇంగ్లాండ్. మొద‌టి ఇనింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 42 పరుగులకు ఇప్పటికే రెండు వికెట్లు కోల్పోయింది.

Advertisement

Also Read: Yashasvi Jaiswal: మ్యాచ్ ఆడుతుండగా కలకలం.. ఆసుపత్రిలో చేరిన జైస్వాల్.. అసలు ఏమైంది అంటే

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×