E-Paper
Advertisement

Year Ender 2025 : క్రైమ్ నుంచి రొమాన్స్ వరకు… 2025లో ఓటీటీని రఫ్ఫాడించిన లేడీ ఓరియెంటెడ్ సిరీసులు సినిమాలు

Year Ender 2025 : క్రైమ్ నుంచి రొమాన్స్ వరకు… 2025లో ఓటీటీని రఫ్ఫాడించిన లేడీ ఓరియెంటెడ్ సిరీసులు సినిమాలు
Advertisement

Year Ender 2025 : ఇండియన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మహిళల చుట్టూ తిరిగే కథలు రోజురోజుకూ మెయిన్‌ స్ట్రీమ్ స్టోరీ టెల్లింగ్‌ను మార్చేస్తున్నాయి. సాంప్రదాయ లేదా స్టీరియో టైపు రోల్స్ దాటి మహిళల్ని క్రైమ్, సంబంధాలు, ఆశయాలు, నైతికత, స్వయం అన్వేషణల మధ్య కష్టతరమైన పాత్రల్లో చూపించడానికి మేకర్స్ ముందడుగు వేస్తున్నారు. థ్రిల్లర్ల నుండి డార్క్ డ్రామాల వరకు, సమాజంతో ముడిపడిన కథల వరకు… మహిళలు నిర్ణయాలు తీసుకునేవాళ్లుగా, సమస్యల్ని ఛాలెంజ్ చేసేవాళ్లుగా, బతికి బయటపడేవాళ్లుగా స్ట్రాంగ్ రోల్స్ లో తెరపై కన్పించి ఇన్స్పైర్ చేస్తున్నారు. 2025లో విడుదలై, ఇప్పుడు వివిధ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్‌లో ఉన్న మహిళా ప్రధాన కథలు ఇవే.

మిసెస్ (Mrs) – ZEE5

సైలెంట్ గా వచ్చి గట్టిగా ప్రభావితం చేసిన సోషల్ డ్రామా ‘మిసెస్’. పెళ్లి, గుర్తింపు, ఎమోషన్స్ ను మహిళల దృక్కోణం నుండి చూపిస్తుంది. ఇంటి పనుల మధ్య మహిళలపై పడే కంటికి కన్పించని ఒత్తిళ్లు, ఘర్షణలని మనసుకు హత్తుకునేలా చూపించారు.

సాలీ మొహబ్బత్ (Saali Mohabbat) – ZEE5

Advertisement

ప్రేమలోని డార్క్ సీక్రెట్స్, ఆబ్సెషన్, పవర్ డైనమిక్స్‌ను మహిళా దృక్కోణం నుండి చూపించే ఇంటెన్స్ రొమాంటిక్ డ్రామా ఇది. ఈ ఎమోషనల్ ఈ కథలో ఆశలు, ద్రోహాలు మహిళా గుర్తింపును ఎలా మార్చేస్తాయో చూపిస్తుంది. ఓ మహిళా భావోద్వేగ ప్రయాణాన్ని, ఆధునిక సన్నిహితత్వాన్ని రా, ఫిల్టర్ లేకుండా చూపిస్తుంది.

మండల మర్డర్స్ (Mandala Murders) – Netflix

మహిళా ఇన్వెస్టిగేటివ్ పాత్రలతో నిండిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇది. మిస్టరీ, సైకాలజీ, హర్రర్ ఎలిమెంట్స్ మిక్స్ అయిన ఈ కథలో వరుస హత్యల కేసును పరిష్కరించడానికి ఓ లేడి పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతుంది. సాంప్రదాయబద్ధంగా పురుషులు ఆధిపత్యం చెలాయించే జానర్‌లో మహిళల్ని సమస్యలు పరిష్కరించేవాళ్లుగా చూపించడం దీని ప్రత్యేకత. అలాగే ఇదే జానర్ లో రూపొందిన ‘ఢిల్లీ క్రైమ్ 3’ని కూడా మిస్ అవ్వకుండా చూడండి.

డబ్బా కార్టెల్ (Dabba Cartel) – Netflix

Advertisement

రోజువారీ ఇంటి పనుల మధ్య మహిళలు రహస్య నేర నెట్‌వర్క్ నడుపుతారు. సాధారణ జీవితాల వెనుక దాగిన పవర్, గ్యాంగ్ స్టర్, క్రైమ్ ఏజెన్సీని మహిళలు ఎలా నడిపించారు? ఆశయాలు, బతుకుదెరువు వంటి అంశాలతో మహిళా లీడ్ క్రైమ్ డ్రామాగా అద్భుతంగా ఉంటుంది ఈ సిరీస్.

డూ యూ వాన్నా పార్టనర్ (Do You Wanna Partner) – Amazon Prime Video

ఆధునిక ప్రేమ, కమిట్‌మెంట్, భావోద్వేగ స్వాతంత్ర్యాన్ని మహిళా దృక్కోణం నుండి చూపించే సిరీస్ ఇది. కెరీర్ సెలెక్షన్, రొమాంటిక్ సమస్యలు, వ్యక్తిగత అభివృద్ధి చుట్టూ కథ నడుస్తుంది. అర్బన్ ఇండియాలో మహిళల మారుతున్న ఆశయాలను ప్రతిబింబిస్తుంది.

Read Also : ఇంట్లోంచి పారిపోయి పెళ్లి… పిల్లలు పుట్టట్లేదని… తెలుగు మూవీనే భయ్యా

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×