E-Paper
Advertisement

OTT Movie : ఇంట్లోంచి పారిపోయి పెళ్లి… పిల్లలు పుట్టట్లేదని… తెలుగు మూవీనే భయ్యా

OTT Movie : ఇంట్లోంచి పారిపోయి పెళ్లి… పిల్లలు పుట్టట్లేదని… తెలుగు మూవీనే భయ్యా
Advertisement

OTT Movie : ఇటీవలే తెలుగులో రిలీజ్ అయిన ఓ తెలుగు బోల్డ్ మూవీ ఈరోజే ఓటీటీలోకి అడుగు పెట్టింది. పైగా ఈ మూవీ రెండు ఓటీటీలలో సందడి చేస్తోంది. నవంబర్ లో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ, విడుదలై అలా నెల పూర్తయిందో లేదో ఇలా ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఇంతకీ ఈ సినిమా స్టోరీ ఏంటి? ఏ ఓటీటీలలో చూడవచ్చు? అనే వివరాల్లోకి వెళ్తే…

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తెలుగు సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’ (Santhana Prapthirasthu). విక్రాంత్, చాందిని చౌదరి ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. అభినవ్ గోమటం, రచ్చ రవి తాగుబోతు రమేష్, వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్ తదితరులు ఇందులో కీలకపాత్రలలో నటించారు. సంజీవరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కి, నవంబర్ 14న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ నెల 19 నుంచి అంటే నేటి నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మూవీ ఒకేసారి రెండు ఓటీటీలలో అందుబాటులోకి వచ్చింది.శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), జియో హాట్ స్టార్ (Jio Hotstar) ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా. థియేటర్లలో మిస్ అయిన ఆడియన్స్ కు రెండు ఓటీటీకలలో ఈ సినిమాకు వీక్షించే ఛాన్స్ ఉందన్న మాట. ప్రేమ పెళ్లి, ఆ తరువాత పిల్లలు పుట్టక పడే ఇబ్బందులను ఈ మూవీలో చక్కగా చూపించారు.

Advertisement

Read Also :  నెట్ ఫ్లిక్స్ లో తుక్కురేగ్గొడుతున్న 2 గంటల 28 నిమిషాల పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్… IMDbలో అదిరిపోయే రేటింగ్

 

కథలోకి వెళ్తే…

Advertisement

హీరో చైతన్య (విక్రాంత్) సాఫ్ట్వేర్ ఉద్యోగి. సుబ్బు (అభినవ్ గోమటం) అనే తన ఫ్రెండ్ ను ఎగ్జామ్ సెంటర్ దగ్గర దింపడానికి వెళతాడు. అక్కడ కళ్యాణి (చాందిని చౌదరి) అనే అమ్మాయిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం మొదట్లో హీరోని అపార్థం చేసుకుంటుంది. తరువాత అతను, అతని వ్యక్తిత్వం గురించి తెలుసుకుని దగ్గరవుతుంది. ఇద్దరూ ప్రేమలో పడ్డాక ఒకరోజు హీరోయిన్ ను కలవడానికి హీరోయిన్ వాళ్ళ ఊరికి వెళతాడు. చైతన్యతో కళ్యాణి ప్రేమ విషయం తండ్రి ఈశ్వర రావు (మురళీధర్ గౌడ్)కు తెలియడంతో రచ్చ రచ్చ అవుతుంది. పెళ్ళికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ జంప్ అయ్యి, లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఇప్పటికైనా తమ పెళ్లిని పెద్దలు అంగీకరించాలి పిల్లలు పుడితే సరి అని ప్లాన్ చేస్తారు. కానీ ఎంత ట్రై చేసినా పిల్లలు పుట్టరు. డాక్టర్ దగ్గరకు వెళ్తే చైతన్యకే ప్రాబ్లమ్ ఉందని తేలుతుంది. మరి విషయం తెలిసిన హీరోయిన్ ఏం చేసింది? పిల్లల కోసం ఏం చేశారు? చివరికి పెద్దవాళ్ళు వీళ్ళ పెళ్ళిని ఒప్పుకున్నారా లేదా? అనేది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×