Year Ender 2025 : బలమైన కథనాలు, క్రియేటివ్ స్క్రీన్‌ప్, విజువల్ వండర్స్ తో చిత్రనిర్మాణంతో సౌత్ సినిమా 2025లో కూడా అదరగొట్టింది. కొన్ని సినిమాలు ఈ ఏడాది విడుదలై, తీవ్రంగా నిరాశ పరిచినప్పటికీ, మరికొన్ని మాత్రం సర్ప్రైజ్ హిట్ అయ్యాయి. అలా తమిళం, తెలుగు, మలయాళ పరిశ్రమల నుంచి వచ్చిన కొన్ని చిత్రాలు పెద్దగా అంచనాలు లేకుండానే ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. డార్క్ థ్రిల్లర్‌ల నుండి మొదలు పెడితే హార్ట్ ఫెల్ట్ ఫ్యామిలీ డ్రామాల వరకు, ఈ సంవత్సరం బెస్ట్ మస్ట్ వాచ్ సౌత్ మూవీస్ గా పేరు తెచ్చుకున్న మూవీస్ ఇప్పుడు Netflix, SonyLIV, JioHotstar, ZEE5 వంటి ఓటీటీలలో అందుబాటులో ఉన్నాయి. మరి ఈ లిస్ట్ లో ఉన్న సినిమాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
జియో హాట్ స్టార్‌లో అందుబాటులో ఉన్న ‘thudarum’ అనే మలయాళం మూవీ ఈ సంవత్సరంలో అత్యంత ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్‌లలో ఒకటిగా నిలిచింది. IMDbలో రేటింగ్ 7.6తో ఓటీటీలోనూ దుమ్మురేపింది. ఎక్స్ స్టంట్‌మ్యాన్ అంబాసిడర్ కారు, అతని కొడుకు మర్డర్ చుట్టూ కథ నడుస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ కు బుర్ర బద్దలే.
నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది వచ్చిన మరో అద్భుతమైన చిత్రం ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ఈ తెలుగు మూవీని నాని నిర్మించగా, 7.9 IMDb రేటింగ్ తో టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. టీనేజ్ బాలుడిపై పెట్టిన అబద్దపు పోక్సో చట్టం, దాని వల్ల కలిగే పరిణామాల నుంచి అమాయకపు బాలుడిని కాపాడడానికి జూనియర్ న్యాయవాది చేసే పోరాటమే ఈ కథ.
ఈ ఏడాది సైలెంట్ గా వచ్చి సంచలనం సృష్టించిన మూవీ ‘రోంత్’. జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మలయాళ మూవీ రేటింగ్ 7.1 ఉంది. ఇద్దరు పెట్రోల్ పోలీస్ అధికారుల జీవితాలు ఒక్క రాత్రిలో ఎలా డేంజర్ లో పడ్డాయో ఈ మూవీలో చూడవచ్చు.
నాని హీరోగా నటించిన ‘హిట్ : ది థర్డ్ కేస్’ అనే తెలుగు మూవీ కూడా ఈ మస్ట్ వాచ్ లిస్ట్ లో ఉంటుంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఎస్పీ అర్జున్ సర్కార్ అవయవ అక్రమ రవాణా సిండికేట్ ను ఎలా ఊచకోత కోశాడు అన్నది కథ.
అలాగే మలయాళం సినిమా సోనీ లివ్ లో ఉన్న’రేఖాచిత్రం’, జీ5లో ఉన్న ‘కుడుంబస్థాన్’ అనే తమిళ మూవీ, జియో హాట్ స్టార్‌లో ఉన్న’టూరిస్ట్ ఫ్యామిలీ’ అనే మరో తమిళ సినిమా 2025 మస్ట్ వాచ్ సౌత్ సినిమాల లిస్ట్ లో ఉంటాయి.
Read Also : మనిషిని పెంపుడు జంతువులా పెంచుకునే డైనోసార్… ఇలాంటి సినిమాను లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిందే భయ్యా