E-Paper
Advertisement

Best Jio hotstar movie : మనిషిని పెంపుడు జంతువులా పెంచుకునే డైనోసార్… ఇలాంటి సినిమాను లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిందే భయ్యా

Best Jio hotstar movie : మనిషిని పెంపుడు జంతువులా పెంచుకునే డైనోసార్… ఇలాంటి సినిమాను లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిందే భయ్యా
Advertisement

Best Jio hotstar movie : అనిమేటెడ్ అడ్వెంచర్ సినిమాలను పిల్లలతో పాటు, పెద్దలు కూడా ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు. ఇలాంటి సినిమాలు ఎప్పుడు చూసినా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అనిమేటెడ్ స్టోరీ డైనోసార్ల కాలం నాటిది. డైనోసార్లు అంతరించకుండా మనుషులతో కలిసి జీవిస్తున్న ప్రపంచంలో ఒక భయస్థుడైన యంగ్ డైనోసార్ అర్లో జర్నీతో ఈ కథ మొదలవుతుంది. అద్భుతమైన విజువల్స్, హార్ట్‌వార్మింగ్ స్టోరీ, ఫ్యామిలీ థీమ్స్‌తో కూడిన ఈ మూవీ పిక్సార్ ఫిల్మ్స్‌లో బెస్ట్ ఫ్యామిలీ ఎమోషనల్ గా నిలిచింది. కిడ్స్ & ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఫేవరెట్ గా నిలిచింది.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2015లో వచ్చిన ఈ అమెరికన్ అనిమేటెడ్ అడ్వెంచర్ మూవీ పేరు ‘ది గుడ్ డైనోసార్’ (The Good Dinosaur). పిక్సార్ ఆనిమేషన్ స్టూడియోస్ నిర్మాణంలో దీనికి పీటర్ సోన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా Jio hotstar, Prime Videoలో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ లో కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. 1 గంట 33 నిమిషాల నిడివితో ఐయండిబిలో 6.7/10 రేటింగ్ పొందింది.

Advertisement

Read Also :  : బ్లాక్ మార్కెట్ లో డేంజరస్ డ్రగ్… సైడ్ ఎఫెక్ట్స్ చూస్తే కంటిమీద కునుకు కరువు… బుర్రపాడు క్లైమాక్స్

స్టోరీ ఏమిటంటే

అర్లో అనే చిన్న డైనోసార్ ఒక అపటోసారస్ ఫ్యామిలీలో పుట్టాడు. ఈ ప్రపంచంలో డైనోసార్లు మనుషుల్లా ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆస్టరాయిడ్ భూమిని తాకకుండా పక్కకి వెళ్ళిపోతుంది. దీంతో కథ కొత్తగా సాగుతుంది. అర్లో తన అన్నయ్య బక్, అక్క లిబ్బీలతో పోల్చితే చాలా భయపడే పిల్లాడు. ఏ చిన్న సౌండ్ వచ్చినా వణుకుతాడు. తన నాన్న హెన్రీ, అమ్మ ఇడా ఫార్మ్‌లో పంటలు పండించి ధాన్యం గోడౌన్ నింపుతుంటారు. ఎవరైతే ధైర్యంగా పని చేసి గోడౌన్ లో ధాన్యం తీసుకెళ్తారో వాళ్లు ఆక్కడ తమ ముద్ర వేసుకుంటారు. అయితే అర్లోకి ఉన్న భయం కారణంగా ఇంకా అది రాలేదు. ఒకరోజు ఫార్మ్‌లో పంటలు దొంగిలిస్తున్న స్పాట్‌ అనే చిన్న పిల్లాడిని చూసి అర్లో ట్రాప్‌లో బంధిస్తాడు, కానీ భయంతో వదిలేస్తాడు. నాన్న హెన్రీ కోపంతో అర్లోతో కలిసి ఆ పిల్లడిని వెతకడానికి వెళ్తాడు. మధ్యలో భారీ వర్షం, రివర్ ఫ్లడ్ వచ్చి హెన్రీ అర్లోను రక్షించి చనిపోతాడు. అర్లో స్పాట్‌పై బ్లేమ్ పెట్టి చేజ్ చేస్తూ రివర్‌లో పడి ఇంటి నుంచి చాలా దూరంగా కొట్టుకుపోతాడు.

Advertisement

ఇప్పుడు అర్లో ఒంటరిగా, ఆకలితో, భయంతో ఇంటికి తిరిగి వెళ్లే దారి వెతుక్కుంటాడు. మళ్లీ స్పాట్ కనిపించి, అర్లోకు బెర్రీలు తెచ్చి తినిపిస్తాడు. దీంతో ఇద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. స్పాట్ మాటలు మాట్లాడడు, కానీ డాగ్ లాగా అర్లోతో ప్రయాణిస్తాడు. దారిలో భయంకరమైన వేటాడే జీవులను ఎదుర్కొంటారు. చివరికి స్పాట్‌కు తన మనుషుల ఫ్యామిలీ దొరుకుతుంది. అర్లో బాధపడుతూ స్పాట్‌ను వదిలేసి ఒంటరిగా ఇంటికి చేరుకుంటాడు. చివరికి గోడౌన్ లో తన మార్క్ వేసుకుని అమ్మ, అన్నయ్య, అక్కతో సంతోషంగా జీవిస్తాడు.

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×