Khammam: ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భీమవరం గ్రామానికి చెందిన బొల్లా మాధవరావు, భూలక్ష్మీ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం గడిపేవారు. వీరి కుమారుడు అనీల్ కుమార్.. సాధారణ రైతు కుటుంబానికి చెందని అనీల్ కుమార్ స్థానికంగా ప్రాథమిక విద్య పూర్తి చేసి, హైదరాబాద్‌లో ఉన్నత విద్య పూర్తి చేయగా ఉద్యోగం నిమిత్తం యూఏఈ వెళ్ళాడు. గత రెండు సంవత్సరాలు అక్కడ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ.. కొన్ని లాటరీలో పాల్గొన్నా డు. అనంతరం అనిల్‌కు ఇటీవల ఓ లాటరీ టికెట్లలో 240 కోట్ల రూపాయల బహుమతిని గెలుచుకున్నాడు. కొడుకు ఫోన్ చేసి లాటరీ తగిలిన విషయం చెప్పాడని, ఎంతో సంతోషంగా ఉందని అనిల్ తల్లిదండ్రులు మాధవరావు, భూలక్ష్మీ ఆనందం వ్యక్తం చేశారు.