OTT Movie : థ్రిల్లర్ ఫ్యాన్స్ ఒక్క సారి చూస్తే మరచిపోలేని సినిమాలను ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అలాంటి సినిమాలను చూస్తున్నప్పుడు పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోరు. అలాంటి సినిమాలు ఓటీటీలో చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా డిఫరెంట్ కంటెంట్ తో వచ్చింది. ఈ కథ ఒక స్నేహితుడు చేసే నమ్మకద్రోహంతో తిరుగుతుంది. ఒక రిచ్ ఫ్యామిలీని డెస్ట్రాయ్ చేసే అతని ప్లాన్, ఆడియన్స్ ని కూడా షాక్ లో ఉంచుతుంది. ఈ సినిమాను ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఒక మహిళా దర్శకురాలు రూపొందించింది.
దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఎలా ఉంటుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘Saltburn’ 2023లో వచ్చిన బ్రిటిష్ బ్లాక్ కామెడీ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఎమరాల్డ్ ఫెన్నెల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో బారీ కీఘన్, జేకబ్ ఎలార్డి, రోసమండ్ పైక్, రిచర్డ్ ఈ. గ్రాంట్, ఆలిసన్ ఆలివర్ ప్రధాన పాత్రల్లో నటించారు. 131 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 7.0/10 రేటింగ్ ని పొందింది. ఈ సినిమా 2023 నవంబర్ 17న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ ఆడియోలో కూడా ఈ సినిమా ప్రైమ్ వీడియోలో లభిస్తుంది. కానీ ప్రస్తుతానికి తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు.
ఆలివర్ అనే పేద బ్యాక్ గ్రౌండ్ కుర్రాడు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకోవడానికి వస్తాడు. అక్కడ ఫెలిక్స్ అనే చాలా రిచ్ కుర్రాడితో ఫ్రెండ్‌షిప్ ఏర్పడుతుంది. ఆలివర్ తన లైఫ్ గురించి బాధలు చెప్పి ఫెలిక్స్ సింపతీ పొందుతాడు. ఫెలిక్స్ ఆలివర్‌ని తన ఫ్యామిలీ బిగ్ హౌస్ “సాల్ట్‌బర్న్”కి సమ్మర్ హాలిడేకి ఇన్వైట్ చేస్తాడు. అక్కడ ఫెలిక్స్ ఫ్యామిలీ చాలా రిచ్ పీపుల్ గా కనిపిస్తారు. ఫెలిక్స్ అమ్మ, నాన్న, సిస్టర్ వెనీషా, కజిన్ ఫార్లీ ఆ పెద్ద ఇంట్లో ఉంటారు. ఆలివర్ మొదట సిగ్గుపడుతాడు కానీ నెమ్మదిగా ఫెలిక్స్ మీద ఆ రిచ్ లైఫ్ మీద ఒక మత్తు వస్తుంది. ఇంట్లో పార్టీలు, గేమ్స్ తో సరదాగా గడుపుతారు. ఇక్కడి నుంచి థ్రిల్లర్ వైబ్ స్టార్ట్ అవుతుంది.
Read Also : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?
ఆలివర్ ఫ్యామిలీని మానిప్యులేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత ఒక్కొక్కరు దారుణంగా చనిపోతుంటారు. ఈ సమయంలో ఆలివర్ గురించి సీక్రెట్స్ బయటపడతాయి. ఆలివర్ నిజంగా పేదవాడు కాదు, అతడు చాలా కాలం నుంచి అబద్ధాలు చెప్పి ఈ ప్లాన్ చేశాడని తెలుస్తుంది. ఫైనల్ ట్విస్ట్‌లో ఆలివర్ మొత్తం సాల్ట్‌బర్న్ ఎస్టేట్‌ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. అందరినీ మోసం చేసి, కిల్ చేసి రిచ్ అవుతాడు. ఈ మూవీ ఆలివర్ బట్టలు లేకుండా, ఆ ఇంట్లో డాన్స్ చేస్తున్నప్పుడు ఎండ్ అవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే, ఒక పేద కుర్రాడు రిచ్ ఫ్రెండ్ ఇంట్లోకి వెళ్లి మొత్తం ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేసి రిచ్ అవుతాడు.