Jana Nayagan First Single: విజయ్ దళపతి (Vijay Thalapathy)ప్రధానోపాత్రలో హెచ్ వినోద్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం జన నాయగన్(Jana Nayagan). ఈ సినిమా 2026 జనవరి 9వ తేదీ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇటీవల ఈ సినిమా విడుదల గురించి అధికారకంగా ప్రకటించిన చిత్ర బృందం తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగిన నేపథ్యంలో షూటింగ్ పనులను శరవేగంగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. ఇలా ఒక వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుతూనే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.
తాజాగా ఈ సినిమా నుంచి థళపతి కచేరి (Thalapathy Kacheri)అంటూ సాగిపోయే పాటను విడుదల చేశారు. ఇక ఈ పాటకు స్వయంగా అనిరుద్(Anirudh) సంగీతం అందిస్తూ ఈ పాటను కూడా ఆలపించారు. ఇక ఈ పాట చూస్తుంటే చాలా కలర్ ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. ఈ పాటకు అనిరుద్ మ్యూజిక్ అద్భుతంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే, మమితా బైజు(Mamitha Baiju), బాబీ డియోల్, గౌతమ్ మీనన్ వంటి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. నిజానికి ఈ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది అంటూ ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేశాయి. నటుడు విజయ్ సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో ఈయన రాజకీయాలలోకి కూడా అడుగుపెట్టి కొంత పార్టీని స్థాపించారు. రాజకీయ వ్యవహారాల కారణంగా విజయ్ నటించే ఆఖరి సినిమా ఇదే అని తెలుస్తోంది. ఇటీవల రాజకీయ కార్యకలాపాలలో భాగంగా కరూర్ లో ఏర్పాటు చేసిన తొక్కిసలాటలో భారీగా ప్రాణా నష్టం జరిగింది. ఈ ఘటన కారణంగానే జన నాయగన్ సినిమా విడుదల ఆలస్యం అవుతుందనే వార్తలు వినిపించాయి.
విజయ్ ఆఖరి సినిమా?
ఇలా ఈ సినిమా విడుదల గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం అధికారకంగా స్పందిస్తూ ఈ వార్తలను ఖండించడమే కాకుండా సంక్రాంతి పండుగ సందర్భంగా జన నాయగన్ రాబోతున్నారంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమాని కెవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా అనిరుధ్ సంగీతం అందించారు. ఇక విజయ్ చివరిగా గోట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన సినిమాల పట్ల కాస్త ఫోకస్ తగ్గించి రాజకీయాలలో బిజీగా ఉన్నారు. మరి విజయ్ ఆఖరి సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జననాయగన్ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.